సోను సూద్ అరెస్ట్..??తీవ్రమైన ఆందోళనలో అభిమానులు

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూఇన్న రోజు నుండి నేటి వరుకు అలుపెరగని సేవ కార్యకమ్రాలు చేసున్న వ్యక్తి ఎవరు అంటే కళ్ళు మూసుకొని టక్కుమని ఎవరైనా సోను సూద్ పేరు చెప్పక తప్పదు, తానూ కస్టపడి సంపాదించిన డబ్బు తో ఆయన ఎన్నో వేల మందికి , ఎన్నో వెంకపడిన గ్రామాలకు వెలకట్టలేని సహాయాలు చేసాడు,ఆయన ప్రభావం మన సమాజం లో ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరు తాము సంపాదించిన సంపాదన లో ఎంతో కొంత ఆపదలో ఉన్న వారికి ఇవ్వడానికి స్ఫూర్తి ని ఇచ్చింది, సోను సూద్ చేతున్న సేవ కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆయనని ఎలా పొగుడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఆయన మనసు ఎంత గొప్పది అంటే ప్రజా సేవ చెయ్యడం కోసం ఆయన తన సొంత ఆస్తులను కూడా తాకట్టు పెట్టాడు అంటే,సేవ చెయ్యడం లో ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో అందరికి అర్థం అయ్యేలా చేస్తోంది,అయితే గత కొద్దీ రోజుల నుండి సోను సూద్ గురించి సోషల్ మీద లో వస్తున్నా ఒక్క వార్త ఆయనని ప్రేమించే వాళ్ళని చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే సోను సూద్ కి ముంబై లోని జుహు అనే ప్రాంతం లో ఆరు అంతస్తుల భవనం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ నివాస భవనం ని ఆయన హోటల్ గా మార్చారు అని సోను సూద్ పై మరియు అతని భార్య పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు,పౌర సంఘం అనుమతి లేకుండా నివాస గృహం ని హోటల్ గా మార్చడం అనేది చట్టరీత్య నేరం అని, సోను సూద్ కచ్చితంగా దీనిని సరి చేసుకోకపోతే అతనిని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసారు,ఈ కేసుని జనవరి 4 వ తేదీన మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ క్రింద బీ ఏం సి వాళ్ళు ఫిర్యాదు చేసారు, అయితే ఈ ఫిర్యాదు ప్రకారం సోను సూద్ కు 2020 వ సంవత్సరం అక్టోబర్ 27 వ తారీఖున ఆయనకు నోటీసులు జారీ చెయ్యడం జరిగింది, దీనికి ఆయన 26 వ తేదీ లోపు స్పందించాల్సిన గడువుగా ఆ నోటీసులో ఉంది.

అయితే సోను సూద్ బీఎంసీ చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ తానూ చట్ట ఉల్లంఘన చేయకుండానే నివాస గృహం ని హోటల్ గా మార్చాను అని, అయితే కొన్ని అనుమతులు మరియు లైసెన్స్ రావాల్సి ఉంది అని, కరోనా కారణంగా అది ఆలస్యం అవుతూ వస్తుంది అని, నాకు కాస్త సమయం కావలి అని సోను సూద్ హై కోర్టు ని ఆశ్రయించాడు, అయితే హై కోర్టు నుండి ఆయనకీ ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు, ఆయన వేసిన పిటిషన్ ని కొట్టి వేస్తూ సోను సూద్ కి హై కౌతు ఉత్తర్వులు జారీ చేసింది, దీనితో చట్టబద్దం గా నిర్మాణం చెయ్యబడిన హోటల్ అని బీఎంసీ వాళ్ళు చేసిన కేసు ని ఆధారంగా తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది గత కొద్దీ రోజుల నుండి జోరుగా మీడియా లో ప్రచారం అవుతున్న వార్త, అయితే సోను సూద్ తనకి తగిన న్యాయం కోసం అతి త్వరలోనే సుప్రీమ్ కోర్టు లో కేసు వెయ్యనున్నాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం, మరో పక్క తాము ఇస్తా వ్యక్తిని అరెస్టు చెయ్యబోతున్నారు అనే వార్తలు వస్తుండడం తో సోను సూద్ అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు, మరి ఈ కేసు రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.