హరి హర వీర మల్లు టీజర్ నటసింహం షాకింగ్ కామెంట్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఎన్ని హిట్స్ వచ్చిన ఎన్ని ప్లాప్స్ వచ్చిన చెక్కు చెదరని ఇమేజి ఎవరికైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ కి మాత్రమే అని ట్రేడ్ పండితులు సైతం చెప్తుంటారు, ఇంత ఇమేజి మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కూడా పవన్ కళ్యాణ్ ఏనాడూ కూడా టాప్ డైరెక్టర్ తో పని చెయ్యలేదు, తన కెరీర్ మొత్తం మీద ఆయన పని చేసిన టాప్ డైరెక్టర్స్ కేవలం పూరి జగన్నాథ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే , రాజమౌళి వాంతి టాప్ డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ తో పని చెయ్యడానికి ఎంతో అత్రుతుగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఊరు పేరు తెలియని డైరెక్టర్ తో సినిమా చేసి భారీ వసూళ్లను రాబడుతాడు, అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తో హరి హర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ విడుదల అవ్వగా దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇప్పటి వరుకు పవన్ కళ్యాణ్ ని చూడని లుక్ లో అభిమానులు చూసేసరికి వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఇక ఈ గ్లిమ్స్ కి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో, టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది, ఒక్క చిన్న గ్లిమ్స్ వీడియో కి సెలెబ్రిటీల నుండి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఇదే తొలి సారి అని చెప్పొచ్చు, అయితే ఈ టీజర్ పై నందమూరి బాలకృష్ణ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు, బాలకృష్ణ కి మరియు డైరెక్టర్ క్రిష్ కి మంచి స్నేహ పూర్వక సంబంధం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే,వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, అప్పటి నుండి క్రిష్ ని నందమూరి బాలకృష్ణ ఎంతో గౌరవిస్తారు,ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఎన్టీఆర్ కధానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు కూడా డైరెక్టర్ క్రిష్ నే ఎంచుకున్నారు, కానీ ఈ రెండు సినిమాలు ఘోర పరాజయం పాలైయ్యాయి, అయినా కూడా నందమూరి బాలకృష్ణ మరియు క్రిష్ కి మధ్యన ఉన్న సాన్నిఒహిత్య సంబంధం కాస్త కూడా సన్నగిల్లలేదు.

ఇక ఇటీవలే విడుదల అయినా హరిహర వీర మల్లు టీజర్ ని చూసి బాలకృష్ణ క్రిష్ కి ఫోన్ చేసి ప్రశంసలతో ముంచి ఎత్తినట్టు ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న టాక్, దేశం గర్వించదగ్గ దర్శకులలో నువ్వు కచ్చితంగా ఎదో ఒక్క రోజు అవుతావు అని నేను ఎప్పుడో చెప్పా, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో నీలోని అద్భుత ప్రతిభ బయట పడింది, ఇప్పుడు హరి హర వీర మల్లు సినిమాతో నీ కీర్తి ప్రతిష్టలు దేశం నలుమూలల వ్యాపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,మిత్రుడు చిరంజీవి గారి లాగానే, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పౌరాణిక గాడిలో నటించడం శుభ పరిణామం, ఇలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచే సినిమాలు అందరూ చెయ్యాలని, మన తెలుగు కళామ్మ తల్లి విశిష్ట ప్రతిభ తో ఇలాగే తన ఖ్యాతిని వెలిగేలా చెయ్యాలి అని మనస్ఫూర్తిగ కొట్టుకుంటున్నాను అంటూ డైరెక్టర్ క్రిష్ తో బాలకృష్ణ సంబాషించినట్టు సోషల్ మీడియా లో ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.