హరి హర వీర మల్లు టీజర్ పై అకిరా నందన్ చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

బాహుబలి సినిమా తర్వాత మన టాలీవుడ్ రూపు రేకలు మారిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆ సినిమా విజయం ఇచ్చిన ప్రోత్సహం తో మన స్టార్స్ అందరూ అలాంటి పాత్రలు చెయ్యడానికి ధైర్యం చేసి ముందుకి వస్తున్నారు, 60 ఏళ్ళ వయస్సు దాటినా కూడా మెగా స్టార్ చిరంజీవి సై రా నరసింహ రెడ్డి వంటి సినిమా లో నటించాడు అంటే అది బాహుబలి విజయం ఇచ్చిన స్ఫూర్తే, ఈ విషయం ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సై రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు, ఇప్పుడు అదే తరహా పాత్ర ని చెయ్యడానికి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముందుకి వచ్చాడు, ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు అనే చిత్రం పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఓరంగజేబు కాలం నాటికి చెందిన నేపథ్యం లో తెరకెక్కనుంది, ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు,కోహినూర్ డైమండ్ వజ్రం చుట్టూ తిరిగే ఈ కథ ని ఎంతో ఆసక్తికరంగా తనదైన శైలిలో తీస్తున్నాడు డైరెక్టర్ క్రిష్, ఇటీవలే ఈ చిటానికి సంబంధించిన చిన్న టీజర్ విడుదల అవ్వగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక టీజర్ విడుదల అయిన క్షణం నుండి అటు అభిమానుల నుండి ఇటు టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ ని ఇలాంటి లుక్ లో చూస్తాము అని అభిమానులు కూడా ఊహించలేదు, కానీ వారి అంచనాలకు మించి డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ ని అత్యద్భుతంగా చూపించడం తో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు,ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా ఈ టీజర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఆయన ఈ టీజర్ పై చేసిన కామేంన్స్ ని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లైవ్ వీడియో చాట్ ద్వారా అభిమానులతో పంచుకుంది, అకిరా కి వాళ్ళ నాన్న లేటెస్ట్ టీజర్ పిచ్చ పిచ్చగా నచ్చింది అని, ఆ టీజర్ విడుదల ఆయిన్ రోజు నుండి నేటి వరుకు ఆపకుండా చూస్తూనే ఉన్నాడు అని, నిజంగా కళ్యాణ్ గారు ఈ లుక్ లో ఇంత బాగుంటాడు అని నేను కూడా ఊహించలేదు అని రేణు దేశాయ్ ఈ సందర్భంగా మాట్లాడారు.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం వచ్చే నెల 9 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఆయన తన కెరీర్ లో తోలి సారి ఒక్కేసారి మూడు సినిమాల షూటింగ్ లో పాల్గొన్నారు, ఒక్కపక్క రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూ మరోపక్క ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్, మనం సాధారణంగా ఒక్కేసారి రెండు పనులు చేస్తే బుర్ర పని చెయ్యకుండా పోతుంది , అలాంటిది అతి కష్టతరమైన సినీ మరియు రాజకీయ రంగం ని సమర్థవతంగా బాలన్స్ చెయ్యడం అంటే మాటలు కాదు అనే చెప్పాలి,పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో పడుతున్న శ్రమకి ఫలితం కచ్చితంగా దక్కాలి అనే కోరుకుంటున్నారు, ఎందుకంటే 2013 వ సంవత్సరం తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులకు ఘోరమైన బాడ్ ఫేస్ తగిలింది అనే చెప్పాలి, సరైన సక్సెస్ చూసి దాదాపుగా 8 ఏళ్ళు అవుతుంది, ఇక రాబొయ్యే రోజులు అన్ని మంచి రోజులే అని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలి అంటే ఏప్రిల్ 9 వరుకు ఆగాల్సిందే.