హరి హర వీర మల్లు టీజర్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,2018 వ సంవత్సరం లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పూర్తిగా రాజకీయాలపై శ్రద్ద పెట్టిన పవన్ కళ్యాణ్,ఆ తర్వాత సినిమాలకు దూరం అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు మళ్ళీ ఆయన మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రం తో ఏప్రిల్ 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు, చాలా కాలం తర్వాత వస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో అభిమానులు ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు, ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి కానీ , మరియు విడుదల అయినా రెండు పాటలకు గాని అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీర మల్లు టీజర్ ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ టీజర్ కి ఎవ్వరు ఊహించని రెస్పాన్స్ వచ్చింది, ఇప్పటి వరుకు పవన్ కళ్యాణ్ వెయ్యని గెటప్ వెయ్యడం తో అభిమానులు ఒక్కసారిగా థ్రిల్ ఫీల్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా ఈ టీజర్ పై టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మన అందరికి తెలిసిందే, తన బాబాయ్ కి సంబంధించిన టీజర్ మరియు ఫస్ట్ లుక్ వస్తే రామ్ చరణ్ తానూ ఒక్క స్టార్ హీరో అని కూడా మర్చిపొయ్యి ,ఒక్క సాధారణ అభిమానిలా ప్రవర్తిస్తాడు, ఇప్పుడు ఇటీవల విడుదల అయిన పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు టీజర్ కి కూడా రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు, ఆయన మాట్లాడుతూ ‘ కళ్యాణ్ బాబాయ్ ని ఇలా కూడా చూపించవచ్చు అని నేను ఎప్పుడు ఊహించలేదు, ఈ టీజర్ లో బాబాయి ని చూస్తుంటే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచుకున్నాయి, కచ్చితంగా డైరెక్టర్ క్రిష్ గారు చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని సినిమా ఇస్తాడు అని అనుకుంటున్నాను, ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతోంది అని గట్టిగ నమ్ముతున్నాను, ఆల్ ది బెస్ట్ బాబాయ్ ‘అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా స్పందించాడు.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సినిమా తో పాటు ఆయన మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా అయ్యప్పానుమ్ కోశియుమ్ అనే సినిమాని రీమేక్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది, ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా దగ్గుపాటి రానా కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇందులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తరహా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదల కానుంది, ఇక ఈ ఏడాది సెకండ్ సెప్టెంబర్ లోపు ఈ రెండు సినిమాలు పూర్తి చేసి హరీష్ శంకర్ తో తియ్యబోయ్యే సినిమాలో పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్, గతం లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మళ్ళీ ఇన్నేళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడం తో అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి చేరింది.