హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ కి సహాయం చేసిన పవన్ కళ్యాణ్ !

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,పవన్ కళ్యాణ్ అంటే కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆయనని కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా ఒక దైవంల పూజిస్తారు ప్రదిస్తారు ఆయనని అందరు ఆరాధిస్తారు, తనని ఇంతలా అభిమానిస్తున్న ఫాన్స్ కోసం మరియు ప్రజల కోసం ఏదొక గొప్ప పని చేయాలనీ ఆలోచన ఎప్పుడు ఉండేది అయితే ఆ ఆలోచనతో అతి కష్టమైన మార్గం అని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగలోకి ప్రవేశం చేసారు కానీ మూడవ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఎదగడానికి ఏ మాత్రం ఇష్టపడని రెండు ప్రధాన పార్టీలు ఎలా ఆయనని తొక్కాలని ప్రయత్నాలు జనసేన పార్టీ ఆరంభం నుండి నేటివరకు చేస్తూనే ఉన్నాయ్.

ఒక దారిలో పవన్ కళ్యాణ్ ని మరియు అయినా అభిమానులను రెండు పార్టీల తమకి ఉన్న మీడియా ని ప్రధాన అస్త్రంగా చేసుకుని సినిమా ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ఆర్టిస్టులను టీవీ చానెల్స్ లో 24 గంటలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం పైన విమర్శలు చేస్తూ వచ్చారు అలా విమర్శలు చేసిన వారిలో కత్తి మహేష్ ని అంత తేలికగా మరచిపోలేము అప్పట్లో న్యూస్ చానెల్స్ పెడితే ఈయన లైవ్ డిబేట్ లో కనిపించేవారు, ఇక అసలీ విషయానికి వస్తే కత్తి మహేష్ ఇటీవలే నెల్లూరు ప్రాంతంలో జాతీయ రహదారి మీద ఆగి ఉన్న ఒక లారీ ని అతివేగంగా తన కార్ తో ఢికొట్టడం తో తీవ్రమైన గాయాలు పలు అయినా సంగతి మనందరికీ తెలిసిందే, అదృష్టం కొద్దీ కార్ లో ఉన్న ఎయిర్ బాగ్స్ వాళ్ళ ప్రాణాలు తో బయట పడినప్పటికీ తలా పై అతి తీవ్రమైన గాయాలు తగలడంతో అయినా పరిస్థితి ప్రమాదకరం గానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ప్రస్తుతానికి ప్రాణ ప్రమాదం లేనప్పటికీ ఆయనకి చూపు పూర్తిగా కొలిపోయే అవకాశం ఉందని డాక్టర్లు ఈ సందర్బంగా తెలిపారు. ఇది ఇలా ఉండగా కత్తి మహేష్ ప్రాణాలతో ఇబ్బంది పడుతున్న సంఘటన చూసి ఆయనని హాస్పిటల్ లో చేర్చింది పవన్ కళ్యాణ్ అభిమానులే అని తెలిసింది, ఈ విష్యం జనసేన పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎలా అయినా అతని ప్రాణాలను రక్షించాల్సింది అని డాక్టర్లను కోరారు అందుకోసం అయినా ఎలాంటి ఆర్థిక సహాయం కావాలన్నా కూడా చేస్తాను అని పవన్ కళ్యాణ్ తెలిపారట హాస్పిటల్ కి అయ్యే ఖర్చు అంత కూడా అవరసం అయితే సహాయం చేస్తాను అని తెలిపారు ఈ విష్యం గురించి చెప్పారట, ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంత వరకు కత్తి మహేష్ కోసం సహాయం చేస్తూ అకౌంట్ లో విరాళాలు గా సోషల్ మీడియా ద్వారా అందిచారట.

నెదూరు వద్ద కొడవళూరులోని చంద్రశేఖరంపురం గ్రామంలో ప్రమాదానికి గురైన కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి అయితే చెన్నై ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ సహాయంతో అతను పరిస్థితి విషమంగా మారింది, ఇక అతను కళ్ళు మరియు ముక్కులో గాయాలు బాగా అయ్యాయి . అతను ప్రస్తుతం ఐసియులో ఉన్నాడు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందుకు వెంటిలేటర్ మీద ఉంచాడు. ప్రస్తుతం అతను చెన్నైలో మెరుగైన చికిత్స పొందుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు, ఒకపుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏంటో ఆపదలో ఉన్నపుడు సహాయం చేయడం గొప్ప విష్యం అనే చెప్పాలి ఈ విష్యం గురించి ఫాన్స్ స్పందిస్తున్నారు, దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.