హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎంత మంది హీరోయిన్స్ పుట్టుకొస్తున్న కూడా కొంతమంది హీరోయిన్స్ ని మాత్రం ఎప్పటికి మర్చిపోలేము, వీళ్ళని ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ అని మనం అంటూ ఉంటాము, ఈ స్థాయి అంత తేలికగా ఎవ్వరికి రాదు, ఒక్క రేంజ్ లో ప్రేక్షకులని అలరించి అశేష అభిమానం పొందితే కానీ ఈ స్థాయి దక్కదు, అలాంటి రేంజ్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒక్కరు ఆసిన్, ఈమెకి ఒక్కప్పుడు మన సౌత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు డిమాండ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దక్షిణాదిన సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న ప్రతి ఒక్క టాప్ హీరో తో ఈమె నటించింది, అదృష్టం తలుపు తట్టినట్టు బాలీవుడ్ లో కూడా ఈమెకి చిన్నగా అవకాశాలు రావడం మోడలు పెట్టాయి అప్పట్లో, అక్కడ కూడా ఈమె హీరోయిన్ గా గ్రాండ్ సక్సెస్ అయ్యి అక్కడ కూడ అగ్ర కధానాయిక గా ఒక్క వెలుగు వెలిగింది, ఇలాంటి సెన్సేషన్ సృష్టించిన ఈమె గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం ఈ స్టోరీ లో అందిస్తున్నాము చూడండి.

ఆసిన్ పూర్తి పేరు ఆసిన్ తొట్టుమ్కల్, ఈమె 1985 అక్టోబర్ 26 కేరళలోని కొచ్చి లో జన్మించింది, ఈమె తండ్రి పేరు జోసెఫ్ తొట్టుమ్కల్ మరియు తల్లి పేరు సెలైన్ తొట్టుమ్కల్,తండ్రి జోసెఫ్ మాజీ సిబిఐ ఆఫీసర్, చిన్నప్పటి నుండి డాన్స్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న ఆసిన్ భరత నాట్యం లో శిక్షణ తీసుకుంది, స్టేజి మీద ఈమె ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది, ఇక అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తానూ రవితేజ తో తియ్యబోతున్న అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొత్త వాళ్ళని వెతుకుతున్న సమయం లో హీరోయిన్ ఆసిన్ ఆయన దృష్టిని ఆకర్షించింది, తన సినిమాలో హీరోయిన్ తమిళ్ నేటివిటీ కి దగ్గర గా ఉండే లుక్స్ ఉన్నాయి అమ్మాయి కావాలి, ఆ లుక్స్ ఆసిన్ లో కనిపించడం తో వెంటనే ఆయన తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు, అప్పట్లో ఈ సినిమా ఎంతతి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,రవితేజ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్లిన సినిమానే కాకుండా హీరోయిన్ ఆసిన్ ని కూడా స్టార్ హీరోయిన్ ని చేసిన సినిమా ఇది,ఇక ఈ సినిమా తర్వాత ఆమె హవా టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ లలో ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,అలనాటి మహానటి శ్రీదేవి తర్వాత అన్ని బాషలలో సమానమైన క్రేజ్ సంపాదించిన హీరోయిన్ గా ఆసిన్ సరికొత్త రికార్డు సృష్టించింది.

కెరీర్ లో పీక్స్ పోసిషన్ లో ఉన్నా సమయం లోనే ఆసిన్ రాహుల్ శర్మ అనే అతనిని పెళ్ళాడి సినిమాలకి గుడ్ బాయ్ చెప్పేసింది, కెరీర్ శిఖరాగ్ర స్థాయిలో ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకు అని అప్పట్లో దేశ వ్యాప్తం గా ఉన్న ఆమె అభిమానులు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు,ఇక ఆసిన్ భర్త రాహుల్ శర్మ విషయానికి వస్తే ఈయన మైక్రో మాక్స్ కంపెనీ కి స్వయానా సీఈఓ, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఇతని సొంతం,అయితే ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరం అయినా తర్వాత మీడియా కి కానీ , సోషల్ మీడియా కి కానీ ఎక్కువగా కనిపించలేదు, కానీ ఇటీవల ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది, ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు క్రింద చూడవచ్చు, ఆసిన్ మరియు రాహుల్ శర్మ దంపతులకు అరిన్ రైన్ అనే కూతురు కూడా ఉంది, ఆ పాపకి ఇప్పుడు మూడేళ్ళ వయస్సు.

1

2

3

4