హీరోయిన్ సద కి అన్ని కష్టాలు కెరీర్ నాశనం అవడానికి అసలు కారణం?

సద తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని హీరోయిన్ డైరెక్టర్ తేజ దర్శకత్వం లో వచ్చిన జయం సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ మహారాష్ట్ర ముద్దు గుమ్మా జయం సినిమా సూపర్ సక్సెస్ కావడంతో సద కెరీర్ లో అవకాశాల కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది కనీసం ఒక 10 ఏళ్ళ పాటు అగ్ర తారగా వెలుగు అందుకుంది ఇదే సమయంలో ఇతర భాషలో కూడా తన సత్తా చాటింది అలా కెరీర్ లో పీక్స్ లో ఉండగానే సద డౌన్ ఫాల్ మొదలైంది కారణాలు ఏంటో తెలీదు కానీ ఈ భామకి చిన్న హీరోలు పక్కన కూడా అవకాశాలు లేకుండా పోయాయి, ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బుల్లితెర పై ప్రసారం అయ్యే ఎంటర్టైన్ షోలలో మెరుస్తూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది తాజాగా సద ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే అలీ తో సరదాగా షో లో అతిధిగా విచ్చేసింది,

ఈ ఎపిసోడ్ ప్రోమో లో సద కన్నీరు పెట్టడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. అలీ తో సరదాగా షో లో భావొద్వేలకి పెద్ద పీట వేస్తుంటున్నారు ప్రతి ఎపిసోడ్ లో అందరిని ప్రశ్నలు అడుగుతారు సరదాగా మాట్లాడుతూనే అలీ అవతల వారికీ ఉన్న బాధలు బయటకి తీస్తారు సద ఎపిసోడ్ ప్రోమో లో కూడా ఇదే జరిగింది ఒక సినిమాతో స్టార్ అయిపోయారు కెరీర్ లో పీక్స్ చూసావ్ అంత బాగుండగానే ఎందుకు నువ్వు నెమ్మది అయిపోయావ్ సద కి ఎందుకు అవకాశాలు రాలేదు అని అలీ ఒక ప్రశ్న అడిగాడు దీనికి సమాధానం చెబుతూ సద ఏడిచేసారు, ఆమె చెప్పిన మాటలను ప్రోమో లో రెవీల్ చేయలేదు కానీ హీరోయిన్ గా సద కెరీర్ ఇలా అర్దాంతరంగా ఆగిపోవడం వెనక ఎదో బలమైన కారణం ఉందని ఆమె కన్నీరు చూసినవారికి అర్ధం అవుతుంది, ఇక ఇదే ప్రోమో లో సద పలువురి హీరోల పై తన అభిప్రాయాన్ని చెప్పింది.

బాలకృష్ణ డి చిన్న పిల్లాడి మనస్తత్వం అని జూనియర్ ఎన్టీఆర్ లాంటి డాన్సర్ ని తాను ఇప్పటివరకు చూడలేదు అని సద కామెంట్ చేసింది మరి హీరోయిన్ గా సద కెరీర్ అనుకోకుండా ఎందుకు ముగిసిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చాక చూడాల్సిందే. సద తెలుగు లోనే కాదు తమిళం మరియు కన్నడ చిత్రాలు లో కూడా నటించింది, ఆమె జయం చిత్రానికి ఉత్తమ నటి అవార్డును అందుకుంది మరియు తమిళంలో ఆమె జయం, ఎథిరీ, అన్నయన్, ప్రియాసాఖి, ఉన్నాలే ఉన్నాలే, టార్చ్లైట్ సినిమాలకి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాధా మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. ఆమె తండ్రి ఒక వైద్యుడు మరియు ఆమె తల్లి న్యూ ఇండియా అస్యూరెన్స్ తో పనిచేస్తోంది, ఆమె రత్నగిరిలోని పవిత్ర హార్ట్ కాన్వెంట్ హైస్కూల్ లో చదువుకుంది తరువాత ముంబైకి వెళ్ళింది. ఆ తరువాత జయం సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.

సద సినిమాలతో పాటు ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఢీ జూనియర్స్ 1, ఢీ సీసన్ 2 డాన్స్ షోలో మరియు ఢీ జూనియర్స్ షో లో జడ్జి గా వ్యవరించింది అలాగే జోడి నెంబర్ వన్ షో లో కూడా చేసింది, హిందీ లో కూడా మూడు సినిమాలు చేసింది అవి “లవ్ కిచిడి”, క్లిక్ ,దిల్ తొహ్ దీవానా హాయ్ అనే సినిమాలో నటించింది, సాధ మరియు జంతు హక్కుల మద్దతుదారు, జంతు రక్షకుడు మరియు శాకాహారి. ఆమె ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్కు మద్దతు ఇస్తుంది మరియు శాకాహారిని ప్రోత్సహించింది. ప్రస్తుతం 3 ఏళ్ళ గ్యాప్ తరువాత మల్లి కిట్టి పార్టీ అనే సినిమాలో నటిస్తుంది, ఆమె యూట్యూబ్ ఛానల్ లో చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది ఆమె చేసిన వీడియోస్ మంచి వ్యూస్ అందుకుంటున్నాయి సోషల్ మీడియా లో యాక్టీవ్ గా కనిపిస్తుంది ఆమె ఫాన్స్ ఆమె సినిమాలో నటించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.