హీరోలు అందరికి పెద్ద సమస్యగా మరీనా సోనుసూద్ అసలు కారణం ఏంటి?

సోనూసూద్ ఇపుడు దేశంలో ఎక్కడ పట్టిన ఈ సూపర్ హీరో పేరు వినిపిస్తుంది కష్టకాలం లో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సోనుసూద్ ని ప్రజలు రియల్ హీరోగా గుర్తుంచేసారు ఫేస్బుక్ ప్రొఫైల్, వాట్సాప్ డిపిలు ఎక్కడ చూసిన అయినా ఫొటోలే సోనుసూద్ వాళ్ళకి సహాయం చేశారట వీళ్లకి సహాయం చేశారట అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయ్.ఒక దేశ ప్రభుత్వం చేయాల్సిన పని సోనూసూద్ ఒక్కడే చేస్తున్నారు దీనితో సోనుసూద్ కి నేషనల్ వైస్ క్రేజ్ వచ్చేసింది దెబ్బతో ఆన్ స్క్రీన్ విల్లన్ ఆఫ్ స్క్రీన్ హీరో అయిపోయాడు సోనూసూద్ కి ఇంత క్రేజ్ రావడం అందరికి ఆనందంగా ఉన్న మన స్టార్ హీరోలకి దర్శక నిర్మాతలకి మాత్రం కాస్త ఇబ్బందిగా మారిందట అయితే ఇందుకు కారణం లేకపోలేదు ఒక్కపుడు సోనూసూద్ ని విల్లన్ గా చూపిస్తే ప్రేక్షకులు బాగానే అంగీకరించారు కానీ ఇపుడు పరిస్థితిలు అలా లేవు ఇపుడు సోనూసూద్ ని తెరపై విల్లన్ గా చూపించడం అంత సులభం కాదు దానికి అయినా రియల్ ఇమేజ్ అడ్డువస్తుంది.

ఒకవేళ సినిమాలో కథ పరంగా మన హీరోలు సోనూసూద్ ని కొట్టిన అభిమానులు తట్టుకునే పరిస్థితిలో లేరు ఇన్ని పరిమితులు మధ్య సోనుసూద్ తో సినిమాలు చేయాల్సిన పరిస్థితి రావడం మేకర్స్ కి కాస్త కష్టమైన పని అనే చెప్పచు. ఈ విష్యం లో మన హీరోలు బాధ ఇంకా తీరలేదు సినిమాలో సోనూసూద్ ఉంటె మిడిల్ రేంజ్ హీరోలని ఇపుడు కచ్చితంగా డామినెటే చేసేస్తారు ..ఒకవేళ స్టార్ హీరోలు ఉంటె వారు కూడా సోనూసూద్ తో ఆన్ స్క్రీన్ వార్ చేయలేరు ఒకవేళ చేసిన తమ రియల్ హీరోని జస్ట్ ఆన్ స్క్రీన్ కొట్టడం ఏంటి అని కామెంట్స్ వినిపిస్తాయి మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకో సమస్య ఉంది సోనూసూద్ హీరో కాకపోయినా తన దగ్గర ఉన్నది మొత్తం అష్టులు మొత్తం కూడా ప్రజల కోసం సేవ చేస్తున్నాడు అటు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎవరు ఈ స్థాయిలో సేవ చేసిన హీరోలు లేరు దీనితో స్టార్ హీరోలు సైతం సోనుసూద్ ని చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యం లో వీరంతా సోనూసూద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడకపోవచ్చు సంక్రాంతికి బెల్లం కొండా శ్రీనివాస్ హీరో గా వచ్చిన అల్లు అదుర్స్ సినిమాలో కూడా ఇదే సమస్య ఎదురైంది సోనూసూద్ క్యారెక్టర్ ని విల్లన్ గా చూపించలేక మంచిగా మార్చలేక దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తలనొప్పి ఎదురుకున్నారు.ఇక ఆచార్య సినిమాలో సోనూసూద్ ని స్క్రిప్ట్ పరంగా కొట్టాలి అంటే నేను అలా చేయలేను అంటూ చిరంజీవి అంతటి గొప్ప మెగాస్టార్ గారు వెనక అడుగు వేశారు అంటే ఇక మిగతా హీరోలు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఈ నేపథ్యం లో అసలు సోనూసూద్ ని హీరోగా మార్చేసే పనిలో పడ్డారు అంత మేకర్స్, ఇప్పటికే సోనూసూద్ కి హీరోగా రెండు బారి బడ్జెట్ సినిమాలు సెట్ అయినట్టు తెలుస్తుంది, ఈ సినిమాలో సోనూసూద్ విల్లన్ గా కంటిన్యూ అవుతారా లేక హీరో గా నటిస్తారా అనేది ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు ఈ విష్యం పై చర్చిస్తున్నారు.

సోనుసూద్ దాదాపు సంవత్సరం నుండి అయినా చేసే సహాయాలు అంత ఇంత కాదు ప్రతి దేశం చెప్పుకోదక్క పేరు తెచ్చుకున్నారు అటు ఆస్తులు కూడా అముకుని ప్రజలకు సేవలు చేసారు.. సామాన్యులకు మాత్రమే కాదు సెలెబ్రెటీలకు కూడా సోనూసూద్ ఏ పెద్ద దిక్కు అయ్యారు ఎవరికి కష్టం వచ్చిన మొదట సోనుసూద్ మాత్రమే గుర్తొస్తాడు ఎవరు ఏ సహాయం కోరుకున్న ఎక్కడ నుండి వచ్చిన వెంటనే స్పందించి కావాల్సిన ఉత్పత్తులు అందిస్తారు సినిమాలో విల్లన్ గా కనిపించిన నిజ జీవితం లో అందరికన్నా గొప్ప హీరో గా పేరు సంపాదించారు. చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ వాలా బాధలని తెలుసుకుంటూ తోచినంత సహాయం చేస్తున్నాడు. ఇక వేరే హీరోలు ఎంత చేసిన ఈయన ముందు తక్కువే అంటున్నారు నెటిజన్లు వెనక ముందు ఆలోచించకుండా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఇపుడు ఎక్కువ శాతం సహాయం కావాలంటే సోనూసూద్ ఏ గుర్తొస్తారు అలానే సోనూసూద్ కూడా ఎప్పటికి సహాయం చేస్తూనే ఉంటాను అంటున్నారు..