హీరో అల్లు శిరీష్ కి గాయాలు అసలు ఎం జరిగిందో తెలుసా?

యంగ్ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియా లో చేసే అల్లరి గురించి అందరికి తెలిసిందే, హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో సినిమా చేస్తూ ఆఫ్ సెట్స్ లో సందడి చేస్తున్నారు, ఈ జోడి చేసే హంగామా కి అందరు ఫిదా అవుతున్నారు, ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి, మొత్తానికి అల్లు శిరీష్ మాత్రం తన తదుపరి సినిమా కోసం ప్రొమోషన్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తుంది అయితే అల్లు శిరీష్ ఇపుడు బాడీ పెంచే పనిలో పడ్డారు గత కొద్దీ రోజులుగా జిమ్ లో అల్లు శిరీష్ తెగ కష్టపడిపోతున్నాడు, అల్లు శిరీష్ బాడీ మీద రాఘవేంద్ర రావు వేసిన వెరైటీ ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. అలా మొత్తానికి అల్లు శిరీష్ తన శరీరాకృతి ని మార్చేసుకుంటున్నారు అనే చెప్పచు, తన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ కోసమే ఇదంతా చేస్తున్నట్లు ఉన్నారు అని తెలుస్తుంది.

అల్లు శిరీష్ కి చాలా కాలం నుండి సినిమాలో హిట్స్ లేక బాధపడుతున్నారు ఇతనికి తన మీద కి బ్యాండ్ వేసిన ఫోటో ఒక్కటి ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసారు ఇది ఫ్యాషన్ కోసం కాదు వర్కౌట్ చేస్తున్న క్రమంలో మీద పటేసింది అందుకే ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది అని క్లియర్ గా క్లారిటీ గా చెప్పుకొచ్చారు మాములుగా ఆనీటిపైనా సెటైర్ వేసే అల్లు శిరీష్ ఇలా తనకి గాయం అవ్వడం ఆ పట్టి పెట్టుకోవడం పైన సెటైర్ వేశారు ఏబీసీడీ సినిమా తరువాత రెండు ఏళ్ల గ్యాప్ తీసుకున్న శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రేమ కాదంట అంటూ అను ఇమ్మానుయేల్ అల్లు శిరీష్ లు చేస్తున్న సందడి అంట చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న కార్ లో టీ తాగుతూ చీర్స్ చెప్పుకున్నారు, ఆ తరువాత ఏకంగా మందు గ్లాస్ తో నే చీర్స్ చెప్పుకుంటున్నారు ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అల్లు శిరీష్ 1990 సంవత్సరంలో “ప్రతిబంధ్” అనే హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అలానే మరో సినిమా 1995 సంవత్సరం లో వచ్చిన మాయాబజార్ తమిళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అల్లు శిరీష్ 2013 లో గౌరవం చిత్రంతో హీరో గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కొత్త జంట, శ్రీరాస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ అనే మలయాళం సినిమాని తెలుగు లో రీమేక్ చేసారు ఆ సినిమా లో నటించారు,ఈ సినిమాలు ఏవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక సినిమాలో మాత్రమే కాదు అల్లు సిరిష్ టాప్ హీరోయిన్ తమన్నా తో కలిసి హెడ్ అండ్ షోల్డర్ కమర్షియల్ యాడ్స్ లో చేసారు తెలుగు ప్రేక్షకుల కోసం పనిచేశారు. తన మలయాళ ప్రవేశం కోసం పాపులర్ ” లులు” ఫ్యాషన్ అవార్డ్స్ 2019 సంవత్సరంలో అల్లు శిరీష్ కి “క్రాస్ఓవర్ స్టార్ ఆఫ్ ది ఇయర్” అవార్డు గెల్చుకున్నారు .

శిరీష్ కి ఎబిసిడి సినిమా మంచి పేరు తెచ్చింది ఈ సినిమా పాపులర్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా అదే పేరుతో మలయాళ చిత్రానికి తెలుగు లో రీమేక్ చేసారు, ఈ చిత్రం కథ ఒక గొప్ప చెడిపోయిన బ్రాట్ యొక్క కథ, అతను తన ఇంటి నుండి తరిమివేయబడతాడు మరియు సంస్కరించడం కష్టమనిపిస్తుంది, సిరిష్ మరోసారి ఈ సినిమా ద్వారా అతని నటనకు ప్రసంశలు అందుకున్నారు. సినిమాలతో పాటు హోస్ట్ గా ఐఫా ఉత్సవాల్లో కూడా పాలుగోన్నారు సీమా అవార్డ్స్ లో హోస్ట్ గా తన సత్తా రాణించారు. ఇక ప్రస్తుతం ప్రేమ కాదంట ప్రీ లుక్ పోస్టర్ ని చూసి అందరు వీరు ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు, ఈ పోస్టర్ ట్విట్టర్ లో అల్లు శిరీష్ పోస్ట్ చేసారు దీనితో ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి.