హీరో ధనుష్ మరియు ఐశ్వర్య లవ్ స్టోరీ గురించి మనకి తెలియని అనేక నిజాలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ నియామకం దొరకడానికి కూడా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలకి కూడా చాలా సమయం పడుతుంది ఆయనని కలవాలంటే అంత సులభం కాదు అలాంటిది రజనీకాంత్ ఇంటికి అల్లుడు కావడం అంటే సామాన్యమైన విషయమే కాదు కానీ అది చేసి చూపించాడు హీరో ధనుష్ పైగా అతడికి పెద్దగా బాక్గ్రౌండ్ లేదు ఎందుకంటే చాలా చిన్న సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు ‘తుల్లువాధో ఇలామై’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్ తొలి సినిమాలో అయినా లుక్స్ చూసి ఇతడు హీరోనా అంటూ చాలామంది హేళన చేసారు అసలు హీరో అంటే ఎలా ఉండాలి కనీసం చూడటానికి లుక్ అయినా బాగుండాలి కదా అంటూ వెక్కిరింతలు ఎన్నో వచ్చాయి కానీ ఇపుడు అదే ధనుష్ తమిళ నాట టాప్ స్టార్ హీరోగా వెలుగు అందుకున్నారు అయితే ఈయన రజినీకాంత్ అల్లుడు ఎలా అయ్యాడు అనేది చాలా మందికి తెలీదు.

ఒకపుడు చిన్న హీరోనే అయినా కూడా ఇపుడు మాత్రం రెండు జాతీయ అవార్డులు గెలిచి మంచి స్టార్ హీరో అయ్యాడు అయినా రజనీకాంత్ కి తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు ధనుష్ స్టార్ హీరో కావడానికి ముందే అపుడపుడు ఎదుగుతున్న క్రమంలోనే అయినా సూపర్ స్టార్ అల్లుడు అయ్యాడు ఎక్కడ చూసారో ఎందుకు నచ్చారో తెలీదు కానీ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య కి హీరో ధనుష్ బాగా నచ్చేసాడు రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకోవడం పెళ్లి చేసేయడం అంత ఫాస్ట్ గా జరిగిపోయాయి ‘తుల్లువాధో ఇలామై’ తో ధనుష్ చాలా విమర్శలు ఎదురుకున్నారు అయితే అయినా అన్నయ సెల్వ రాఘవన్ అప్పటికే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి సమయం లో అన్నయ దర్శకత్వం లో ధనుష్ నటించిన రెండవ సినిమా కాదల్ కొండెయిన్ సంచలన విజయం సాధించింది ఇదే సినిమాని తెలుగు లో నేను పేరుతో అల్లరి నరేష్ తో రీమేక్ చేసారు ఈ సినిమాతో ధనుష్ మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది.

ఆ సమయంలో ఆ సినిమా చుసిన రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య తనకి ఒక బొకే పంపింది అని తెలియ చేసింది అంటే కాదు చాలా అద్భుతంగా నటించారు కంగ్రాట్స్ కీప్ ఇన్ టచ్ అని అందులో మెసేజ్ కూడా పెటిందంతా, ఆ తరువాత ఒకసారి కాఫీ షాప్ లో కలిసి మాట్లాడుకున్నారు అది ఎలా బయటకి వచ్చిందో కానీ మీడియా వాళ్ళు ప్రేమలో పడేట్టు రాసేశారు ఇదే విషయాన్ని చెప్పారు ధనుష్ తన వాళ్ళ సూపర్ స్టార్ కూతురికి చెడ్డ పేరు వచ్చిందనే బాధ పడుతున్న తరుణంలో పెద్ద వాళ్ళు ఇందులో తప్పు ఎం లేదు అని భావించి పెళ్లి చేసారు అని చెప్పారు ధనుష్ పెళ్లి మాటలు జరిగాక కూడా తాము అసలు పెద్దగా తనతో మాట్లాడుకుంది లేదు అసలు తనతో పెళ్ళికి ఐశ్వర్య ఒప్పుకుంది అనే విష్యం తాను నమ్మలేకపోయాను అని చెప్పాడు ఈ హీరో చాలా త్వరగా తమ పెళ్లి జరిగిపోయిందని తొలిసారి కలుసుకున్న 6నెలల లోనే దంపతులం అయ్యాము అని గత విషయాలను గుర్తు చేసుకున్నారు ధనుష్.

మొత్తానికి కోలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా వీళ్ల ఇద్దరు చాలా మందితో ప్రసంశలు కూడా అందుకున్నారు అయితే వీళ్లకి యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ధనుష్ ఆడుకాలం,కాక ముట్టాయి,విసరనై,ఆశారాం అనే సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు లు పొందారు.రాంజన అనే సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డు, విజయ్ అవార్డ్స్, సీమ అవార్డు వికటన్ అవార్డు, ఐఫా ఉత్సవం ఇలా చాలా బెస్ట్ అవార్డు లు గెల్చుకున్నారు. ధనుష్ అప్పుడప్పుడు సంగీతాన్ని రికార్డ్ చేస్తాడు సాధారణంగా తన సొంత చిత్రాల కోసం అతన్ని పుదుకోట్టైలిరుంధు శరవణన్ లో ప్లేబ్యాక్ సింగర్ గా పరిచయం అయ్యాడు. రజనీకాంత్ అల్లుడిగా కూడా మంచి క్రేజ్ సాధించాడు అనే చెప్పచు ప్రస్తుతం ధనుష్ కర్ణన్, జగామే తందిరామ్, అట్రాంగి రే అనే హిందీ సినిమా, కార్తీక్ నరేన్, ది గ్రే మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమా చేస్తున్నాడు.