హీరో పంజా వైష్ణవ తేజ్ వెనక ఇద్దరు శక్తులు ఉన్నారు అది ఎవరో తెలుసా?

బుజ్జిబాబు సన దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఉప్పెన సినిమా మంచి కలెక్షన్ తో దూసుకులేతుంది, తొలి సినిమా తోనే తన ప్రతాపం చూపించిన వైష్ణవ తేజ్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా తొలి సినిమా అయినప్పటికీ బాగా యాక్టింగ్ చేసింది మంచి ఫేమ్ సాధించింది.ఈ సినిమా గురించి సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ పంజా వైష్ణవ తేజ్ చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ కొన్ని మాటలు ఇక్కడ చెప్పలేను నేను అయ్యప్ప మాలలో ఉన్నాను,ఈ అబ్బాయి తో కాస్త జాగ్రత్తగా ఉండండి చూడటానికి సిగ్గు పడుతూ ఎప్పుడు నవ్వుతుంటాడు కానీ లోపల ఒక అగ్నిపర్వతంలా ఉంటాడు అని చెప్పాడు. తాము అందరిలో అత్యధిక మంచి ఆలోచనా విధానంతో కలిగిన వ్యక్తి అంటే వైష్ణవ అని చెప్పాలి, వైష్ణవ ఇంత సక్సెస్ అవ్వడం తమకు ఆశ్చర్యం గా లేదన్నారు ఎందుకంటే ఇలాంటి కుర్రాడు కచ్చితంగా సక్సెస్ అవుతారని నాకు గట్టి నమ్మకం ఉందని పెద్ద స్టార్ అవుతారని అనిపిస్తుందని అన్నారు రామ్ చరణ్.

ఇలాంటి పెరఫార్మన్స్ ఇవ్వడానికి నాకు 7 ఏళ్ళు పట్టింది అలాంటిది మొదటి సినిమాతోనే వైష్ణవ తేజ్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చేసారు హీరో గా సక్సెస్ అయ్యాడు, నిజంగా వాడిలో అగ్నిపర్వతం లాంటి ఆలోచన ఉంటె తప్ప ఇలాంటి పెర్ఫార్మన్స్ రాదు వైష్ణవ యాక్టర్ అవ్వాలని అనుకున్నపుడు అతని ప్రోత్సహించింది ముందుగా నాన్న గారు చిరంజీవి గారు, బాబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అయితే చిరంజీవి గారికి చెప్పినపుడు అయినా చాలా ఎంకరేజ్ చేసారు కానీ దాని ముందుకి తీసుకెళ్లి వైష్ణవ తేజ్ ని పెద్ద యాక్టర్ చేయాలనీ ట్రైనింగ్ ఇపించి వేరే దేశాలకి పంపించారు గురువు గా ముందుకి నడిపించారు పవన్ కళ్యాణ్, బహుశా వైష్ణవ తేజ్ లో ఉన్న డెడికేషన్ చూసి అయినా ప్రోత్సహించి ఉంటారు,అలాంటి ఇద్దరు వ్యక్తులతో మన లైఫ్ లో ఉండటం చాలా అదృష్టం అని చెప్పారు. ఉప్పెన కధ చిరంజీవి గారు నాలుగు సార్లు విన్నారని బహుశా తన సినిమా కధ కూడా అన్ని సార్లు విన్నారో లేదో అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాను రిలీజ్ కి అందరికన్నా రెండు రోజులు ముందే చిరంజీవి గారు ఈ సినిమాని చూసారు నిర్మాతలకు ఎంతో గట్టి భరోసా ఇచ్చారు కూడా అయినా ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి కారణం ముఖ్యం గా మెగా అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు అని అన్నారు కరోనా పరిస్థితి తరువాత సినీ పరిశ్రమకు మల్లి తెరుచుకుంటుంటే దానికి కారణం తెలుగు సినిమా ప్రేక్షుకులే అని తెలుగు సినిమా వాళ్ళకి మల్లి ప్రాణం పోశారు అని అన్నారు, ఇక హీరోయిన్ కృతి శెట్టి బెబమ్మ సినిమాలో అదరకొట్టింది కృతి నువ్వు ప్రతి ఒక్కరి హృదయాల్ని గెల్చుకున్నావు మా కుర్రోళ్లు అంత ఇక రెచ్చిపోతారు అంటే కొంచెం బెబమ్మ వాళ్ళ కూడా అని అర్ధం అవుతుంది, ఈమధ్య కొత్త హీరోయిన్ కి ఇంత గ్రాండ్ వెలకమ్ చెప్పడం ఎప్పుడు చూడలేదు ఇది నాకు తెలిసి మొదటిసారి ఇది ఆమెకు ప్రారంభం మాత్రమే ఇక ఎన్నో విజయాలను సాధించాలని నేను కోరుకుంటున్నాను అని పొగిడేస్తున్నారు రామ్ చరణ్.

ఉప్పెన సినిమా 22 కోట్లు బడ్జెట్ తో మొదలు పెడితే ఇప్పటిదాకా 75 కోట్లు దాక విజయాన్ని అందుకుని రికార్డులు సృష్టించింది, 100 కోట్లు క్రాస్ చేస్తుందని ఆశిస్తున్నారు అయితే ఇప్పటిదాకా ఏ హీరో మొదటి సినిమాకి ఇంత విజయాన్ని అందుకోలేదు 2017లో నాని నటించిన ” నేను లోకల్” సినిమాకి 35 కోట్లు వాసులు చేసింది, 2015 లో ఎన్టీఆర్ నటించిన టెంపర్ కూడా ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యింది. టెంపర్ సినిమాకి 44 కోట్లు వాసులు చేసింది అలాగే 2013లో విడుదలైన ప్రభాస్ నటించిన మిర్చి సినిమాకి 48 కోట్లు వచ్చాయి ఈ ప్రకారం చుస్తే ప్రభాస్, ఎన్టీఆర్ ని సినిమాలని కూడా దాటేసింది ఉప్పెన కలెక్షన్ వైష్ణవ తేజ్ మొదటి సినిమా కి ఇంత కలెక్షన్ వస్తే ఇంకో 3 సినిమాలు చేస్తే స్టార్ హీరోల లిస్ట్ లో చేరుతాం పక్క అంటున్నారు అయితే వైష్ణవ తేజ్ ఫాన్స్ అందరు పేరు నిలబెడతారు అటు మెగా ఫాన్స్ కూడా ఆశలు నెరవేరుస్తారో లేదో చూడాలి అంటున్నారు. వైష్ణవ తేజ్ కి మంచి కెరీర్ ఉంటుందని సీనియర్ నటులు అందరు ఆయనని పొగిడేస్తున్నారు.