హీరో మంచు మనోజ్ కి మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నారు పెళ్లి కూతురు ఎవరంటే ?

మంచు వారి ఇంట త్వరలో పెళ్లి సందడి మోగనున్నాయి మంచు మోహన్ బాబు గారి చిన్న అబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నటు సమాచారం అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మోహన్ బాబు గారి కుటుంబానికి దెగ్గర బంధువు అని తెలుస్తుంది.. మే నెలలో ఈ వివాహం జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి, మల్లి కొడుకుకి పెళ్లి చేయాలనీ నిశ్చయించుకున్న మోహన్ బాబు పిల్లను వెతికేశారట, ఇక మనోజ్ 2020 లో మొదటి భార్య ప్రణతి తో విడిపోయిన సంగతి తెలిసిందే.. అప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నం అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు దానితో అభిమానులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం మనోజ్ విడాకుల తరువాత కూడా ఒక్కడే ఉంటున్నాడు ఫ్యామిలీ కి కూడా దూరంగానే ఉంటున్నాడు.

ఇలాంటి సమయం లో మల్లి సినిమాలు చేస్తాను అని అనౌన్స్ చేసారు, సొంతం గా నిర్మాణ సమస్తాన్ని మొదలుపెట్టి వరసగా సినిమాలు నిర్మించటానికి రెడీ అవుతున్నారు.. మనోజ్ 1993 లో మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, ఖైదీగారు వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.. ఆ తరువాత 6 ఏళ్ల గ్యాప్ తో హీరో గా దొంగ దొంగాడి సినిమాలో ఎంట్రీ ఇచ్చారు, తమిళ్ లో తిరుడా తిరుడి సినిమా రీమేక్ గా తెలుగు లో దొంగ దొంగాడి సినిమా తీశారు.. ఈ సినిమాకి సినీ మా అవార్డ్స్ బెస్ట్ మేల్ డెబిట్ గా ఎంపిక అయ్యారు.. ఆ తరువాత శ్రీ,రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, వేదం, జుమ్మంది నాదం, నూకయ్య, పోటుగాడు, పాండవులు పాండవులు తూమెడ్డ, కరెంటు తీగ, దొంగాట, ఎటాక్, గుంటూరోడు ,ఒక్కడు మిగిలాడు, ఇలా చాలా సినిమాలో నటించాడు.

మనోజ్ నటించిన అన్ని సినిమాలు హిట్ అవ్వలేదు కానీ తనకి మంచి క్రేజ్ తెచ్చిన సినిమా బిందాస్ ఈ సినిమాకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది అయితే మనోజ్ హీరో గానే కాకుండా 2017 లో రైతుల అభివృధికి నిధులు సేకరించడానికి మనోజ్ కుమార్ యూనిటీతో ఫౌండేషన్ స్టార్ట్ చేసారు.. ఇలా మనోజ్ చాలా సార్లు చాలామంది కి సహాయం చేస్తుంటారు, ఇలా సినిమాలో మంచి పేరు తెచుకున్నప్పటికీ ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కానీ రియల్ లైఫ్ లో అయితే మనోజ్ ప్రణతిలాడి ప్రేమ వివాహం ప్రణతి మనోజ్ వాళ్ల వదిన క్లాసుమేట్ అయితే ఇద్దరు ఇష్టపడి మే 2015 లో పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు కలిసి ఉంది కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయారు.

మనోజ్ భార్య ప్రణతికి దూరం అయినా తరువాత సోషల్ మీడియా లో యాక్టీవ్ అయ్యాడు.. సామజిక అంశాలు, పాలిటిక్స్ సమస్యలు పై ట్వీట్స్ ట్రేండింగ్ లో నిలుస్తున్నాయి అయితే వాళ్ళు విడిపోవడానికి అనేక కారణాలు బయటకి వచ్చాయి.. పెళ్లి తరువాత ప్రణతి అమెరికా వెళ్లిపోవడం అక్కడే ఉద్యోగం చేసుకోడం అని తెలుస్తుంది, ఇక్కడే మనోజ్, ప్రణతిల మధ్య మనస్పర్థలు వచ్చాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.. అప్పట్లో మనోజ్ వరస సినిమాలతో బిజీ గా ఉన్నారు పెళ్లి తరువాత కూడా వాళ్ళు సరదాగా గడిపే సమయం కూడా దొరకలేదు సినిమాలో బిజీ గా ఉంటూ తనని పటించుకోవడం లేదని ప్రణతి ప్రదానం గా మనోజ్ పై ఫిర్యాదు చేసిందని ప్రచారం జరిగింది ఇలా ఇద్దరు దూరం అయ్యారు అయితే ఇపుడు మల్లి పెళ్లి చేసుకొని సంతోషం గా ఉండాలని ఫాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు..