హీరో మహేష్ బాబు చెల్లి గురించి మనకి తెలియని అనేక విషయాలు !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి క్రేజ్ ఎంత పెరిగిన కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా ఉండేందుకు ఇష్టపడతారు ఘట్టమనేని కృష్ణ వారసులో సగం మంది సినీ ఫిలింలో ఉంటె మరో సగం మంది ప్రైవేట్ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడతారు.ఇక చాలా రోజుల తరువాత మహేష్ బాబు చెల్లి ఫోటోలు అలాగే మేనల్లుళ్లు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. .సూపర్ స్టార్ కృష్ణ కి మొత్తం ఐదుగురు వారసులు రమేష్ బాబు, పద్మావతి, మంజుల తరువాత మహేష్ బాబు.. ఇక మహేష్ బాబు తరువాత ప్రియదర్శిని జన్మించింది మహేష్ బాబు బాల్యం ఎక్కువగా చెల్లితోనే గడిచింది ప్రియదర్శిని కొంచెం సైలెంట్ అయినప్పటికీ అన్నయ మహేష్ బాబు కలిస్తే మాత్రం ఎంతగానో అల్లరి చేసేవారు. ఇక పద్మావతి పొలిటికల్ లీడర్ గళ్ళ సజయదేవ్ ని వివాహం చేసుకున్న విష్యం తెలిసిందే.

ఇంకా రెండవ ఆమె మంజుల దర్శకురాలుగా నిర్మాతగా, యాక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరిష్కరించుకుంది. ఇక చిన్నారి చెల్లెలు ప్రియదర్శిని హీరో సుధీర్ బాబుని వివాహం చేసుకుంది ప్రియా దర్శిని కెమెరాముందుకు రాకుండా ఎక్కువ ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీ గా ఉంటుంది చాలా రోజుల తరువాత ప్రియదర్శిని కి సంబంధించిన స్పెషల్ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి, ఆమె భర్త సుధీర్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్ ని నిర్వహించారు దీనితో కొన్ని నిమిషాల్లోనే ఆ ఫోటీలో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక మహేష్ బాబు మేనల్లుళ్లు ఇద్దరు కూడా స్పెషల్ ఎట్ట్రక్షన్ గా కనిపించరు పెద్దవాడు చరిత్ మానస్, చిన్నవాడు దర్శన్ ముఖ్యం గా చిన్నవాడు మాత్రం ఎక్కువగా మామయ్య మహేష్ పోలికలతో ఉన్నట్లు తెలుస్తుంది అభిమానులు కూడా అదే తరహాలో కామెంట్ చేసారు.

రాబోయే రోజులో వెండితెరపై మరికొందరు సూపర్ స్టార్స్ కావడం కాయం అని అంటున్నారు, ఇప్పటికే మహేష్బాబు పెద్ద అక్క తనయుడు అశోక్ గళ్ళ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకు ఎక్కుతున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాక్ డౌన్ అనంతరం మొదలుకానుంది. ఈ నెల 30న కృష్ణ గారి పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని విడుదల చేస్తునట్టు సమాచారం. ఇక సుధీర్ బాబు విషయానికి వస్తే మాజీ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇక అతను ప్రధానంగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.. శివ మనసులో శ్రుతిలో లీడ్ యాక్టర్ గా నటించాడు సుధీర్ బాబు విజయవంతమైన చిత్రాలలో ప్రేమా కథా చిత్రమ్, బాఘీ, సమోహనం అలా ఉన్నాయి. సమ్మోహనం నటనకు సిమా స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకున్నారు.

సుధీర్ బాబు సినిమా విషయానికి వస్తే ఏమాయ చేసావే సినిమాలో హీరోయిన్ సమంత కి అన్న పాత్రలో నటించాడు.ఆ తరువాత శివ మనసులో శృతి,దొంగాట,ఆనందో బ్రహ్మ, కృష్ణమ్మా కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు, శ్రీశ్రీ, బాఘీ, వంటి చాలా సినిమాలో నటించాడు అలానే ప్రేమ కథ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది మంచి పేరు తెచ్చింది. చివరిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని తో నటించిన ” వీ ” సినిమా డిజాస్టర్ అయినా విష్యం తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే దర్శకుడితో మరో ప్రేమ కథ ని చేస్తున్నారు అలాగే శ్రీదేవి సోడా సెంటర్ అనే మరో మాస్ సినిమా కూడా చేస్తున్నాడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా లైన్ లో ఉంది. ఇంకా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా చేస్తున్నాడు. సుధీర్ సీమ అవార్డు, జీ సినీ అవార్డు లు గెల్చుకున్నాడు.