హీరో రాజశేఖర్ గురించి మనకి తెలియని ఎన్నో నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

మన తెలుగు ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి మా అన్నయ, అక్క మొగుడు గా, అల్లరి ప్రియుడిగా , అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మొగాడు తెరపై విల్లన్స్ తో ఎవరైతే నాకేంటి అని మూడవ కన్ను తెరిచే శివయ్య ఆగ్రహం లో కానీ అల్లరిలో కానీ తనకంటూ ప్రత్యేకమైన నటన కనపరిచిన అది ఆయనకే చెల్లింది.. మన్నేరిసం లో తన స్టైల్ ఏ వేరు అని నిరూపించి యాంగ్రీ యంగ్ మెన్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న గ్యాంగ్ మాస్టర్ డాక్టర్ రాజశేఖర్, అయినా పేరు వినగానే ముఖ్యం గా గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పాత్రలు , యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో కూడా మేపించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందారు, ఎన్నో సినిమాలో నటించి తనదైన నటనతో అందరిని అక్కటుకున్నాడు రాజశేఖర్..

1962 ఫిబ్రవరి 4 న తమిళనాడు లోని లక్ష్మీపురం లో జన్మించాడు చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెపుతాడు కానీ రాజశేఖర్ నటుడు కాకముందే డాక్టర్ సినిమాలో ఇండస్ట్రీ లో రాకముందే ఎమ్.బి.బి.స్ పూర్తీ చేసి చెన్నై లో డాక్టర్ ప్రాక్టీస్ కూడా పెట్టాడు, ఈయన మొదటి సారి భారతి దర్శకత్వం లో 1984లో తమిళ్ సినిమా పుథుమై పెన్ చిత్రం తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత 1985 లో వచ్చిన వందేమాతరం సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా తరువాత నటుడి గా గుర్తింపు తెచ్చే సినిమాలు చేసిన బ్రేక్ ఇచ్చిన సినిమా కోడిరామకృష్ణ దర్శకత్వం లో తెరకు ఎక్కిన సినిమా తలంబ్రాలు ఈ సినిమా కథ , కధనం తో పాటు పాటలు కూడా కొత్తగా ఉంది సూపర్ హిట్ అయింది.. లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకు ఎక్కిన ఈ సినిమా లో రాజశేఖర్ తో పాటు హీరోయిన్ గా తన భార్య జీవిత కూడా నటించారు..

తేరా మీద హీరోగా రాజశేఖర్ నటన కి తేరా వెనుక డబ్బింగ్ తో సాయి కుమార్ ప్రాణం పోసేవారు వీరి ఇద్దరి కాంబినేషన్ వల్లే రాజశేఖర్ ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. రాజశేఖర్ కెరీర్ లో శృతి లయాలు, ఆహుతి, అంకుశం, మగడు, అన్న, అల్లరి ప్రియుడు, శివయ్య ,మనసున్న మహారాజు, మా అన్నయ, సింహరాశి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు, పి. ఎస్,వీ , గరుడ వేగా లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.. రాజశేఖర్ జీవిత హీరో , హీరోయిన్ గా నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి వీళ్ల ఇద్దరి జంట హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది రియల్ లైఫ్ లో ఎన్నో సినిమాలో కలిసి నటించిన ఇద్దరు ఆ తరువాత నిజ జీవిత భాగస్వాములు అయ్యారు వీళ్ల జంటకి ఇద్దరు కుమార్తలు శివాని, శివాత్మిక దొరసాని సినిమాలో నటించింది ఇపుడు శివాని కూడా సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతుంది..

యాంగ్రీ యంగ్ మెన్ గా ఎన్నో సక్సెస్ లు అందుకున్న రాజశేఖర్ కే .రాఘవేంద్ర దర్శకత్వం లో వచ్చిన అల్లరి ప్రియుడు సినిమా తో అమ్మాయిల మనసు దోచే లవర్ బాయ్ గా మారదు.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ ని ప్లే బాయ్ గా నిరూపించింది అంతే కాదు అప్పటి సీనియర్ టాప్ హీరోలు అయినా చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చాడు కెరీర్ లో హిట్లు, ప్లాపులు ఎన్ని ఉన్న లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్ ఆ మధ్య గరుడ వేగా ,పి.ఎస్.వీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు ఆ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చింది, ఆ మధ్య కరోనా బారిన పది చాలారోజులు తరువాత కోలుకున్నాడు. తన భార్య జీవిత దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నారు అని సమాచారం ఆ సినిమా గురించే ఓఫిషల్ ప్రచారం రానుంది వేచి చూడాల్సిందే..