హీరో రాజశేఖర్ గురించి మనకి తెలియని ఎన్నో నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మన తెలుగు ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి మా అన్నయ,అక్క మొగుడుగా, అల్లరిప్రియుడిగా, అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మొగాడు తెరపై విల్లన్స్ తో ఎవరైతే నాకేంటి అని మూడవ కన్నుతెరిచే శివయ్య ఆగ్రహంలో కానీ అల్లరిలో కానీ తనకంటూ ప్రత్యేకమైన నటన కనపరిచిన అది ఆయనకే చెల్లింది.మన్నేరిసం లో తన స్టైల్ ఏవేరు అని నిరూపించి యాంగ్రీ యంగ్ మెన్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న గ్యాంగ్ మాస్టర్ డాక్టర్ రాజశేఖర్ అయినా పేరు వినగానే ముఖ్యం గా గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పాత్రలు,యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో కూడా బాగా మేపించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందారు, ఎన్నో సినిమాలో నటించి తనదైన నటనతో అందరిని అక్కటుకున్నాడు డాక్టర్ రాజశేఖర్.

1962 ఫిబ్రవరి 4న తమిళనాడు లోని లక్ష్మీపురం లో జన్మించాడు చాలామంది నటులతో డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెపుతాడు కానీ రాజశేఖర్ నటుడు కాకముందే డాక్టర్ సినిమాలో ఇండస్ట్రీ లో రాకముందే ఎమ్.బి.బి.స్ పూర్తీచేసి చెన్నైలో డాక్టర్ ప్రాక్టీస్ కూడా పెట్టాడు,ఈయన మొదటిసారి భారతి దర్శకత్వంలో 1984లో తమిళ్ సినిమా పుథుమై పెన్ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి. ఆ తరువాత 1985లో వచ్చిన వందేమాతరం సినిమాతో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తరువాత నటుడిగా గుర్తింపు తెచ్చే సినిమాలు చేసిన బ్రేక్ ఇచ్చిన సినిమా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకు ఎక్కిన సినిమా తలంబ్రాలు,ఈ సినిమా కథ,కధనంతో పాటు పాటలు కూడా కొత్తగా ఉంది సూపర్ హిట్ అయ్యింది, లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకు ఎక్కిన ఈ సినిమా లో రాజశేఖర్ తో పాటు హీరోయిన్ గా తన భార్య జీవిత కూడా నటించారు.

తేరామీద హీరోగా రాజశేఖర్ నటన కి తేరా వెనుక డబ్బింగ్ తో సాయికుమార్ ప్రాణం పోసేవారు వీరి ఇద్దరి కాంబినేషన్ వల్లే రాజశేఖర్ ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి,రాజశేఖర్ కెరీర్ లో శృతి లయాలు, ఆహుతి, అంకుశం,మగాడు,అన్న,అల్లరి ప్రియుడు,శివయ్య,మనసున్న మహారాజు,మా అన్నయ,సింహరాశి,ఎవడైతే నాకేంటి, గోరింటాకు,పి. ఎస్,వీ,గరుడవేగా లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.రాజశేఖర్ జీవిత హీరో,హీరోయిన్ గా నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి వీళ్ల ఇద్దరి జంట హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది,రియల్ లైఫ్ లో ఎన్నో సినిమాలో కలిసి నటించిన ఇద్దరు, ఆ తరువాత నిజ జీవిత భాగస్వాములు అయ్యారు వీళ్ల జంటకి ఇద్దరు కుమార్తలు శివాని,శివాత్మిక దొరసాని సినిమాలో నటించింది, ఇపుడు శివాని కూడా సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతుంది సమాచారం.

యాంగ్రీ యంగ్ మెన్ గా ఎన్నో సక్సెస్లు అందుకున్న రాజశేఖర్ కే .రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన అల్లరిప్రియుడు సినిమాతో అమ్మాయిల మనసు దోచే లవర్ బాయ్ గా మారదు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ ని ప్లేబాయ్ గా నిరూపించింది అంతేకాదు అప్పటి సీనియర్ టాప్ హీరోలు అయినా చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చాడు,కెరీర్ లో హిట్లు, ప్లాపులు ఎన్ని ఉన్న లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్,ఆ మధ్య గరుడ వేగా,పి.ఎస్.వీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు,ఆ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది, ఆ మధ్య కరోనా బారిన పది చాలారోజులు తరువాత కోలుకున్నాడు.తన భార్య జీవిత దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నారు అని సమాచారం,ఆ సినిమా గురించి ఓఫిషల్ ప్రచారం రానుంది వేచి చూడాల్సిందే.