హీరో రామ్ చరణ్ కొత్త ఇల్లు ఎన్ని కొట్లో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే ?

ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్.విపరీతంగా ఉన్న టాప్ 3 హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కచ్చితంగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన క్షణం నుండి నేటి వరకు రామ్ చరణ్ ఎదిగిన తీరును చుస్తే ఎవరైనా శబాష్ అనాల్సిందే, మెగాస్టార్ వంటి హీరో కొడుకు ఇండస్ట్రీ కి వస్తున్నాడు అంటే అతని పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఆ అంచనాలను అందుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిదే అలాంటిది రామ్ చరణ్ అటు నటన డాన్స్ పరంగా మరియు బాక్స్ ఆఫీస్ పరంగా తొలి సినిమా నుండే తండ్రి కి తగ్గ తనయుడు అనిపించించుకున్నాడు, రెండవ సినిమా మగధీరతో సృష్టించిన సంచనాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కలెక్షన్ ని మన స్టార్స్ అందుకోవడానికి దాదాపు 8 ఏళ్ళు పట్టింది అని చెప్పచు.

ఇక రంగస్థలంతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డ్స్ తో మరోసారి చెడుగుడు ఆడుకున్నాడు. ప్రస్తుతం అయినా రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది ఇలా ఉండగా ఇపుడు రామ్ చరణ్ కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి సెన్సషనల్ గా మారింది అదేంటంటే రామ్ చరణ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తనకోసం ఒక ప్రత్యేకమైన నివాసా గృహం నిర్మించుకున్నాడు అని, ఈ నివాస గృహం కోసం అయినా దాదాపుగా 38 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఇంతకాలం తన తల్లిదండ్రులుతో పాటుతో నివసించిన రామ్ చరణ్ ఇపుడు ఉపాసన తో కలిసి ప్రత్యేకంగా ఒక్క నివాసం నిర్మించుకుని అందులో స్థిరపడాలని అనే ఆలోచనలో ఉన్నారట.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నూతన గృహం నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే మెగాస్టార్ కొత్త ఇల్లు గురించి అప్పట్లో సోషల్ మీడియా లో స్పెషల్ టాపిక్ గా నిలిచాయి ఇపుడు రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో ఇల్లు నిర్మించడానికి సిద్ధం అయ్యారట లేటెస్ట్ ట్రేండింగ్ టెక్నాలజీ తో తన ఇల్లు ని ఇంద్రభవనంతో సమానమైన ఇల్లుని నిర్మించుకునేలా ఉన్నారట. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రాజమౌళి తో అయినా తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకుంది ఈ ఏడాది అక్టోబర్ 13 తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేసున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు అయినా మెగాస్టార్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా ఆచార్య సినిమా లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ గా కనిపిస్తున్నాడు.

ఈ పాత్ర రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైలు రాయిగా మిగిపోతుందని అన్నారు, ఇందులో చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది, రామ్ చరణ్ పక్కన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ మరియు పూజ హెగ్డే మధ్య ఒక పాట తప్ప మిగిలిన షూటింగ్ అంత పూర్తయింది. ఇక ఈ రెండు సినిమాల తరువాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నాడు దీనితో పాటు కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తారని సినీ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది, ఇక ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ రేంజ్ ఎవ్వరు ఊహించలేని స్థాయికి చేరుకుంటుంది అన్నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రామ్ చరణ్ టాప్ హీరోగా ఒక వెలుగు అందుకున్నాడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్ ఫాన్స్ మరియు మెగా ఫాన్స్ ఏంటో ఎదురుచూస్తున్నారు.