హీరో శర్వానంద్ మరియు రామ్ చరణ్ త్వరలో సోదరులు కాబోతున్నారు అసలు విష్యం ఏంటి ?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ ఒకొక్కరు వివాహాలు చేసుకుని ఒక ఇంటివారు అవుతున్నారు అనే చెప్పాలి.. 2020 కరోనా ఏడాది లో చాలా మంది సినీ సెలెబ్రిటీలు వివాహాలు చేసుకున్నారు.. ముఖ్యం గా రానా,నితిన్, నిఖిల్ ల వివాహం కూడా జరిగిపోయింది, కొందరు ప్రేమ వివాహాలు చేసుకుంటే మరికొందరు ఇంట్లో చుసిన సంబంధాలను చేసుకుంటున్నారు.. ఈ కరోనా నేపథ్యం లో సెలబ్రిటీల పెళ్లిళ్లు హంగామా లేకుండా సైలెంట్ గా జరిగిపోయాయి.. ఒక పక్క కరోనా నియమాలను పాటిస్తూనే హీరోలు గత ఏడాది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇపుడు కొత్త సంవత్సరం వచ్చింది మరి ఈ ఏడాది పెళ్లిలా గురించి మాట్లాడితే ముందుగా టాపిక్ వినిపించేది ప్రభాస్ పెళ్లి గురించి ఆ తరువాత మరో యంగ్ హీరో శర్వానంద్… వీళ్ల ఇద్దరు ఇపుడు తెలుగు ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ గా ఉన్నారు వీరి పెళ్లి గురించి అందరికి చర్చించుకుంటున్నారు …

తాజాగా శర్వానంద్ పెళ్ళికి సంబంధించి ఒక వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది ఇంటరెస్టింగ్ విష్యం ఏంటి అంటే రామ్ చరణ్ భార్య ఉపాసన ద్వారా నే ఈ పెళ్లి జరగబోతుంది.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో నే కాదు ఇపుడు పరిశ్రమకు వెతల కుటుంబం లో కూడా దీని గురించి వార్త వినిపిస్తుంది, శర్వానంద్ స్నేహితురాలు ఉపాసన కి కజిన్ సిస్టర్ గా వరస అవుతుంది.. అనుష్క కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నటు గా వార్తలు వినిపిస్తున్నాయి, ఉపాసన దెగ్గర ఉందిమరి ఇరు కుటుంబాలను ఒప్పించిందని, దీనికి పెళ్లి పెద్దగా రామ్ చరణ్ , ఉపాసన ఇద్దరు దెగ్గర ఉంది మరి చేస్తారని వార్తలు వస్తున్నాయి..

శర్వానంద్ పెళ్లి గురించి ఇపుడు సోషల్ మీడియా లో హాల్ చల్ అవుతుంది, నిజానికి 2019 నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయి గత రెండు ఏళ్లగా ఈ వార్త వినిపించిన దీనికి సంబంధించి ఎక్కడ క్లారిటీ అనేది ఇవ్వలేదు రామ్ చరణ్,శర్వానంద్ ఇద్దరు కూడా మంచి మిత్రులు చిన్నతనం నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. ఇద్దరు కూడా అన్న తమ్ముడిలా ఉండబోతున్నారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.. ముఖ్యం గా ప్రతి ఈవెంట్ కి శర్వానంద్, రామ్ చరణ్ ఇంటికి వచ్చేవారు మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఏంటో సన్నిహితులుగా ఉండేవారు అయితే తన కుమారుడు రామ్ చరణ్ ని ఎలా చేసేవారో అలానే శర్వానంద్ ని కూడా అలానే చూసేవారని చెప్పేవారు ..

ఫిలిం ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయం లో తాను హీరో అవుతాను అనే సమయం లో చిరంజీవి కూడా సపోర్ట్ చేసారు.. ఇంట సైలెంట్ గా ఉండే వ్యక్తి హీరో అవుతారా అని చిరంజీవి గారు కూడా నిజంగా ఆశ్చర్యపోయారు .. శర్వానంద్ అద్భుతంగా నటిస్తారు అంటూ చిరంజీవి కూడా చాలా సార్లు తెలియ చేసారు.. మొత్తానికి ఉపాసన చెల్లెలు ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.. కొన్ని నెలలు గా వీరు ఇద్దరు ప్రేమ లో ఉన్నారని.. మొత్తానికి వీళ్ల బంధం పెళ్లి తో ఇంకా బలపడనుండి ఈ విష్యం గురించి ఇరు కుటుంబాలు క్లారిటీ ఇస్తే కానీ కన్ఫర్మ్ చేయలేము అంటున్నారు శర్వానంద్ అభిమానులు ..