హీరో శివాజీ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఎం చేసేవారో తెలుసా?

ఫిలిం ఇండస్ట్రీ లో చాలామంది సినిమా మీద ఆసక్తి తో ఇండస్ట్రీ లోకి వస్తారు అయితే వచ్చే ఆలోచన అయితే ఉంటుంది కానీ ఎందుకు వస్తున్నారో ఎం అవాలని వస్తున్నారో మాత్రం కొంతమందికి ఒక క్లారిటీ ఉండదు వచ్చాక గాలి ఎటు మళ్లితే అటు వెళదాం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా వచ్చిన వాళ్లలో హీరో అయినా వాళ్ళు డైరెక్టర్ అయినా వాళ్ళు ఎడిటర్ అయినా వాళ్ళు అలా 24 విభాగాల్లో ఏదొక దాంట్లో సెటిల్ అవుతున్నారు అయితే పక్కాగా హీరో అవ్వాలి లేదా డైరెక్టర్ అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇక ఎలాంటి బాక్గ్రౌండ్ లేకపోయినా ఏదోరకంగా ముందు ఒక ప్లాటుఫార్మ్ ఏర్పర్చుకుని దాని ద్వారా అనుకున్న రీచ్ గోల్ అయినా వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో శివాజీ కూడా ఉన్నారు.

శివాజీ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో అయినా బాషా మీద మంచి పట్టు ఉన్న కారణం గా బుల్లితెర పై వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది దానితో కొన్నాళ్ళు యాంకర్ గా వ్యవరించాడు, ఈ క్రమం లో కొన్ని పరిచయాలు ఏర్పడాయి దానితో ఆయనకి చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కింది, తనని తాను పోషించుకునేందుకు జెమినీ టీవీ లో వీడియో ఎడిటర్ గా చేరారు అపుడే యాంకరింగ్ చేసే అవకాశం పొందారు, ఇక దర్శకుడు కే. రాఘవేంద్ర రావు 2000 సంవత్సరం లో అయినా చేయబోయే పరదేశి అనే సినిమా కోసం నూతన నటి, నటులను ఆహ్వానిస్తూ స్టార్ 2000 కాన్సెప్ట్ అనే ఒక పోటీ ని నిర్వహించారు అందులో హీరోయిన్ లయ, శివాజీ రెండవ స్థానం లో నిలిచారు, మొదటి స్థానం లో నిలిచినా వారు విశ్వాస్, తనూజ, మాధవ్ నటులు పరదేశి సినిమాలో నటించారు కానీ దీని ద్వారా శివాజీ అందరికి పరిచయం అయ్యారు.

ఈయన నటించిన సినిమాలో మొదట విడుదలైంది చిరంజీవి హీరో గా నటించిన మాస్టర్ సినిమా అయితే తొలి అవకాశం ఇచ్చింది మాత్రం ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి శ్రీ సీతా రాముల కళ్యాణం చుత్తము రారాండి అనే సినిమాలో శివాజీ కి హీరో వెంకట్ తో స్నేహితుడి పాత్ర లో నటించాడు అలానే శివాజీ మెగాస్టార్ చిరంజీవి కి పెద్ద వీర అభిమాని మెగాస్టార్ చిరంజీవి ని కలవాలని ఏంటో ఆశపడేవారు కానీ ఏకంగా మాస్టర్ సినిమాతో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం లక్కీ ఛాన్స్ అందుకున్నారు, ఈ సినిమాలో శివాజీ ప్రభావంతుడైన క్రీడాకారుడిగా కనిపించదు కనీసం బూట్లు కూడా కొనుకోలేను పేదరికం లో ఉంటె చిరంజీవి అతని ప్రోత్సహించారు నిజ జీవితం లో కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు తనని అలాగే ప్రోత్సహించారని ఎన్నో సందర్భాల్లో శివాజీ చెప్పాడు.

హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదని ఏదొక పాత్రలో నటించే అవకాశం వచ్చిన చేయడానికి ఎప్పుడు సిద్ధం గా ఉన్నాను అని శివాజీ తెలిపిన సందర్భాలు ఉన్నాయ్. ఇక సినిమాలో శివాజీ అందుకున్న మొదటి సంపాదన 15,000 రూపాయలు మాస్టర్ సినిమాకి అందుకున్న ఈ సంపాదన తో తల్లి కి బంగారం కొన్నారు. ఇలా ప్రారంభం అయినా శివాజీ కెరీర్ హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా చాలా సినిమాలో నటించాడు అయితే నిర్మాత గా చేసిన సినిమాలు చాలా దెబ్బతీశాయి, ఆ తరువాత భారతీయ జనతా పార్టీ లో చేరిన శివాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక తరుగూటి హోదా సాదించేందుకు చాలా కష్టాలు పడ్డారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి లో చేరి ఉద్యమం చేసారు హోదా ఇవ్వనందుకు సొంత పార్టీ భాజపా ని విమర్శించారు, ఆ తరువాత పార్టీ కి రాజీనామా చేసారు.