హ్యాపీ డేస్ అప్పు గుర్తు ఉందా?..ఇప్పుడు ఆమె ఎలా మారిపోయిందో చూడండి

మన టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు కొన్ని సినిమాలని కొత్త వాళ్ళతో తీసి స్టార్ హీరో రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్లలో ఒక్కడు శేఖర్ కమ్ముల, ఈయనకి మన టాలీవుడ్ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , కొత్త వాళ్ళతో సినిమా తీసి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం శేఖర్ కమ్ముల స్టైల్, అలా 2007 వ సంవత్సరం లో హ్యాపీ డేస్ అనే సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, యూత్ లో ఈ సినిమా చూసాక ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అవ్వాలి అనే రేంజ్ లో ఈ సినిమాతో ఆయన ప్రభావితం చేసాడు, ఈ సినిమా ద్వారానే వరుణ్ సందేశ్ , నిఖిల్ వంటి హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు ,హీరోయిన్ తమ్మన్న కి కూడా ఈ సినిమా తన కెరీర్ లో మొట్టమొదటి హిట్ గా నిలిచింది, ఇక ఈ సినిమా లో నిఖిల్ కి జోడిగా ఇచ్చిన గాయత్రి రావు అలియాస్ అప్పు ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు, అయితే గాయత్రి రావు గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మేము చెప్పబోతున్నాము.

హ్యాపీ డేస్ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి రావు, ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆరంజ్ సినిమాలో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోనూ నటించింది, ఆరంజ్ సినిమాలో మాయ పాత్రలో ఆమె నటించగా , గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది, చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో ఎప్పటికి గుర్తు ఉంది పొయ్యే పాత్రలలోనే ఆమె నటించింది, గత ఏడాది పెళ్లి చేసుకున్న గాయత్రీ రావు ఇప్పుడు చెన్నై లో స్థిరపడిపోయింది, పెళ్లి అయినా తర్వాత కూడా ఆమె సినీమాల్లో నటిస్తాను ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది, ఇది ఇలా ఉండగా గాయత్రీ రావు కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయే, ఈమె తల్లి గురించి ఇటీవల సోషల్ మీడియా లో బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి, అవి ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

గాయత్రి రావు తల్లి పేరు పద్మ మరియు తండ్రి పేరు అరుణ్ కుమార్, ఈమె తల్లి పద్మ ఎప్పటి నుండో టాలీవుడ్ లో నటిస్తూనే ఉంది, ఇప్పుడు సీరియల్స్ లో ఈమె మోస్ట్ బిజీ గా ఉండే ఆర్టిస్ట్, హ్యాపీ డేస్ సినిమాలో కూడా ఆమె నిఖిల్ కి తల్లి గా నటించింది, ఈ విషయం ఇప్పటి వరుకు మనకి తెలియదు, ఆమె ఫోటోలను మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, ఇక గాయత్రి రావు విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తన వైవాహిక జీవితం ని ఎంజాయ్ చేస్తోంది, అయితే మంచి నటన ప్రతిభ మరియు అందం రెండు ఉన్న కూడా ఎందుకో గాయత్రి రావు కి రావాల్సిన క్రేజ్ మరియు ఫేమ్ దక్కలేదు అనే చెప్పాలి, హ్యాపీ డేస్ సినిమా తర్వాత కెరీర్ లో ఎక్కడికో వెళ్తుంది అనుకున్న అమ్మాయి కేవలం సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమతం అయ్యింది, 2007 లో విడుదల అయినా హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఈమె కేవలం 7 సినిమాల్లోనే నటించింది అంటే అర్థం చేసుకోవచ్చు , పాపం ఈ అమ్మాయికి అదృష్టం కలిసి రాలేదు అని , మరి భవిస్సాజ్యట్టు లో ఈయన గాయత్రి రావు కి మంచిగా అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

1

2

3

4

5

6

7

8