కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాల్ లు మూతపడిన విషయం తెలిసిందే. ఒకవేళ సినిమా హాల్ లు తెరిచిన కూడా జనాలు హాల్ లోకి వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలీదు. అయితే ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాన్ని ఎదురుకోవాల్సి వస్తుంది.
తెలంగాణ మంత్రి “తలసాని శ్రీనివాస్ యాదవ్” కూడా మరో రెండు నెలలు సినిమా హాల్ లు తెరిచే పరిస్థితి లేదు అని తేల్చి చెప్పేసారు. ఇటువంటి సమయంలోనే OTT ప్లాట్ ఫోరమ్‌లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణం గా OTT వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ సంస్థలు కూడా మంచి సినిమా కి భారీగా ఆదరణ ఉంటుంది అని భావించి మంచి ఆఫర్ ని నిర్మాతల మీద ఉంచుతున్నారు.
ఇందులో భాగంగా నాని నటించిన V సినిమా ని 35 కోట్లు ఇచ్చి అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ గా రిలీజ్ చేసింది. అయితే V సినిమా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ కూడా అలాగే నిరాశపరిచించి. ఇంక లాభం లేదని తెలిసి అమెజాన్ ప్రైమ్ పవన్ కళ్యాణ్ మీద కన్నేసింది.
అతని సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బాధలైపోవాల్సిందే! అది తెలుసుకున్న అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ సినిమా కోసం దిల్ రాజు కి 80 కోట్లు భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ దిల్ రాజు మాత్రం దాన్ని సింపుల్ గా రిజెక్ట్ చేసాడు. ఎందుకంటె దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించి దాన్ని విడుదల చెయ్యాలని ఎప్పటినుంచో కన్నా కళ.
వచ్చే సంక్రాంతికి సినిమా విడులయ్యే అవకాశముంది. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్‌కి కాస్త విరామమిచ్చారు. అన్‌లాక్ ప్రక్రియ మొదలవడంతో ఇప్పుడిప్పుడే ఆగిపోయిన సినిమా షూటింగులు సెట్స్‌పైకి వెళ్తున్నాయి.
అయితే, పవన్ వారికో కండీషన్ పెటినట్టు తెలుస్తోంది. తాను చాతుర్మాస్య దీక్షలో ఉన్నందున సాయంత్రం 4 గంటల వరకే అందుబాటులో ఉంటానని చెప్పినట్టు తెలిసింది. దాంతో సాయంత్రం 6 తర్వాత తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చనేది ఆయన ఆలోచన. దీనికి నిర్మాతలు ఒప్పుకున్నారని, ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ చాతుర్మాస్య దీక్ష నవంబర్‌లో పూర్తి కానుంది.