చిరు 153 లో హీరోయిన్ ఎవరో తెలుసా ?

టాలీ వుడ్ లో మెగాస్టార్ చిరంజీవి , విజయ శాంతి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే చాలావరకు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తుo టారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారి చేతుల్లో రెండు సినిమాలున్నాయి . ఇక చిరు సినిమాలో విజయశాంతి నటించే అవకాశం వుంది అని ప్రచారం జరుగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి తో విజయశాంతి 153 వ సినిమాలో నటించే అవకాశం వుందంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమా చేస్తున్నారు.తర్వాత చిరంజీవి గారు లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ఆ సినిమా అంతా రాజకీయ కోణం లో వుంటుంది. వాస్తవానికి మలయాళం లో మోహన్ లాల్ పాత్ర సరసన ఎవ్వరూ నటించలేదు. అయితే తెలుగు లో మాత్రం చిరంజీవి గారి సరసన భార్య గా విజయశాంతి కనిపించే అవకాశం వుందని, ఆ పాత్రకు విజయ శాంతి అయితేనే బాగుంటుందని విజయశాంతి ని ఎంపిక చేసే అవకాశం వుంటుందని టాలీ వుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబందించి ఈ చిత్ర నిర్మాత రాంచరణ్, విజయశాంతి తో చర్చలు కూడా జరిపారని , విజయశాంతి కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారి తో పాటు విజయశాంతి కూడా హాజరయ్యారు. అప్పుడు వీరి ఇద్ధరూ విబేధాలు లేకుండా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. తమ అనుభవాలు నెమరు వేసుకొని గతం లో వున్న సమస్యలు కూడా పరిష్కరించుకున్నట్లే కనపడింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి విజయ శాంతి గారు ఎలా నటిస్తారో ఎంటో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు మూవీ ఆడియో ఫంక్షన్ కి ముందుకూడ విజయశాంతి , మెగాస్టార్ గారి సంభాషణలు ఈ మధ్య ఏం లేకుండావున్నేయి. ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో వాళ్ళు కలవడం పటా రోజులు గుర్తుకు తెచ్చుకోవడం , వారి మధ్య వున్న రాజకీయ విమర్శలు విబేధాలు కూడా మర్చిపోయేలా చేశాయి. విజయశాంతి మెగాస్టార్ గారు లేటెస్ట్ గా ఒక గుండు తో లుక్ ని పోస్ట్ చేశారు సోషల్ మీడియా లో ఆ లుక్ సోషల్ మీడియా లో హల్ చల్ చేసినది. ఆ లుక్ చూసిన విజయశాంతి తనదైన శైలి లో మెగాస్టార్ ని పొగడ్తలతో ముంచేసింది కూడా ..” మా చిరంజీవి గారు ఏది చేసినా అది అదిరిపోవాలి అంతే, ఈ లుక్ తో అందరినీ మీ వైపు తిప్పుకున్నారు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని ఇలా చూస్తుంటే యంగ్ హీరోలతో పోటీగా నిలుస్తున్నారు ఇప్పటికీ కూడా అదే చూపు, అదే జోరు, అదే మాట.మీకు మీరే సాటి చిరంజీవి గారూ” అంటూ తన ఆనంద భావాలని వ్యక్తం చేశారు.

మెగాస్టార్ హీరో గా తెరకెక్కుతున్న మెగాస్టార్ 152 వ సినిమా ఆచార్య సినిమా పై ప్రేక్షకులలో బారిగా అంచనాలు వున్న విషయానం తెలిసిందే. సామాజిక కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమా 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా, ఇక మిగిలిన షూటింగ్ డిసెంబర్ లో చేద్దాం అనుకుంటున్నారట. మిగిలిన 70 శాతం షూటింగ్ ని కూడా త్వరగా పూర్తి చేసి ఆచార్య సినిమా ని త్వరగా రిలీస్ చేయాలనే ఆలోచనలో వున్నారట. ఈ సినిమాను ఎలాగైనా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు కరెక్ట్ గా కుదిరితే ఆచార్య సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 24 న రిలీస్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీస్ అయిన ఆచార్య ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేయగా ఆచార్య సినిమా అదిరిపోయే రేంజ్ లో వుంటుందని తెలుస్తుంది. మెగాస్టార్ తన 153 వ సినిమాలో మెగాస్టార్ సరసన విజయశాంతి నటించడం అనేది ఫాన్స్ కి పండగలా కనువిందు చేయడం పక్కా అని తెలుస్తుoది.