వకీల్ సాబ్ ట్రైలర్ గురించి మెగాస్టార్ చిరంజీవి సెన్సషనల్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ నిన్న విడుదల అయ్యి అటు ప్రేక్షకుల నుండి ఇటు అభిమానుల నుండి అద్భుతంగా రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, నిన్న ఈ ట్రైలర్ ని ఘనంగా థియేటర్స్ లో విడుదల చెయ్యగా థియేటర్స్ కి వచ్చిన జనాలు ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రీతిలో వచ్చారు అనే చెప్పొచ్చు, సాదారణంగా ఏఒక్క టీజర్ కి కానీ ట్రైలర్ కి కానీ ఈ స్థాయి రెస్పాన్స్ ఒక్క పాన్ ఇండియన్ సినిమాకి రావడం ఇప్పటి వరుకు మనం చూసాము, కానీ నాలుగు సంవత్సరాల క్రితం విడుదల అయినా ఒక్క రీమేక్ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి అని చెప్పడంజ లో ఎలాంటి సందేహం లేదు, హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ శాశ్వతం అని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణగా తీసుకోవచ్చు,ఈ ఒక్క ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకుంది, ఇక మొదటి రోజు దిమ్మ తిరిగిపోయ్యే ఓపెనింగ్స్ గ్యారంటీ అని అభిమానులు ఈ సందర్భంగా సోషల్ మీడియా లో చెప్తున్నారు.

ఇక ఈ ట్రైలర్ కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి ఎలాంటి అద్భుతమైన స్పందన వచ్చిందో టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి కూడా అంతే అద్భుతమైన రెఫాన్సే వచ్చింది,ఈ స్థాయిలో ఒక్క ట్రైలర్ కి టాలీవుడ్ సెలెబ్రిటీలు మొత్తం పూనకాలు వచ్చి ఊగిపోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు, ఇక ఈ సినిమా ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘ నా తమ్ముడు ఇలాంటి సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజి ఉన్న హీరో చేస్తే దాని రీచ్ ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, నిన్న థియేటర్స్ లో విడుదల అయినా ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూస్తుంటే, నాకు కూడా మొదటి రోజు ఈ సినిమాని థెటర్స్ లో అభిమానుల మధ్య చూడాలి అనే కోరిక పుట్టింది, సమయం దొరికితే కచ్చితంగా చూస్తాను’ అంటూ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.

ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఒక్క పెను సంచలనం సృస్ట్రిస్టు ముందుకి దూసుకుపోతుంది అని చెప్పొచ్చు , ఇప్పటికే 14 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని మరియు 9 లక్షలకు పైగా లైక్స్ ని సంపాదించుకున్న ఈ ట్రైలర్ కనివిని ఎరుగని రికార్డులను సృష్టిస్తూ ఇతర హీరోల అభిమానులు కుళ్ళుకునే స్థాయిలో మార్జిన్స్ పెడుతూ ముందుకు దూసుకుపోతుంది, ఒక్క సాధారణ రీమేక్ సినిమాకి ఈ స్థాయి రికార్డ్స్ వస్తుంది అని బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఊహించి ఉండరు,రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ కాస్త తగ్గింది అని అనుకున్న ఎంతో మందికి ఈ ట్రైలర్ ఒక్క చెప్పు దెబ్బ లా నిలిచింది, ఒక్క ట్రైలర్ తో ఈ స్థాయి హైప్ ని తెచ్చుకున్న ఈ సినిమా, విడుదల రోజు ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి, ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో కనివిని ఎరుగని రీతిలో ఏప్రిల్ మూడవ తేదీన చెయ్యబోతున్నాడు దిల్ రాజు,భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఏప్రిల్ 9 వరుకు ఆగాల్సిందే.