నేను ఈ రోజు మెగా స్టార్ అయ్యానంటే దానికి కారణం ఆయనే!

చిరంజీవి మెగాస్టార్ గా మారడం వెనుక ఎవరున్నారు?.. అసలుఏంజరిగిందంటే!…..
తెలుగు సినీ ఇండస్ట్రి లో స్వయంకృషితో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. టాలీవుడ్ లో చిరంజీవి గారిని మెగాస్టార్ చేసిన నిర్మాత కె. యస్ రామరావ్ గారు.ఈయన తన క్రియేటివ్ కమర్షియల్ బానర్స లో పలు సూపర్‌హిట్ సినిమాలు అంధించారు. తెలుగులో సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణం రాజు , రామరావు, నాగేశ్వరరావు, శోబన్ బాబు,తర్వాత స్టార్ హీరో గా ఎదిగిన అగ్ర హీరో లలో చిరంజీవి గారు ఒకరు. Ntr , కృష్ణ వంటి అగ్ర హీరోలు స్టార్స్ గా వున్న సమయం లో చిరంజీవితో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన నిర్మాత ks. రామారావు గారు.

చిరంజీవి,నిర్మాత. Ks.రామారావు కలయికతో వచ్చిన మొదటి సినిమా అభిలాష. యండమూరి వీరేంద్ర నాథ్ నవల ఆధారం గా కోదండరామిరెడ్డి దర్శకత్వం లో వచ్చిన అభిలాష సినిమా టాలీవుడ్ లో సూపర్‌హిట్ గా నిలిచింది. Ks రామారావు నిర్మాత, చిరజీవి హీరో గా వచ్చిన రెండో సినిమా ఛాలెంజ్. ఈ మూవీ బోక్స్ ఆఫీసు వద్ద సూపర్‌హిట్ గా నిలిచింది. కోదండ రామిరెడ్డి, ks రామారావు, చిరంజీవి వీరి ముగ్గురి కలయికతో వచ్చిన మూడవ సినిమా రాక్షసుడు. ఈ మూవీ బాక్స్ -ఆఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అంటే కాదు ఈ మూవీతో చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. చిరంజీవి,నిర్మాత. Ks.రామారావు, కోదండరామిరెడ్డి దర్శకత్వం లో వచ్చిన మరో మూవీ మరణమృదంగం ఈ చిత్రం కూడా మంచి రిసల్ట్స్ అందుకుంది. ఈ చిత్రం లోనే చిరంజీవి గారి పేరు ముందు మెగాస్టార్ అని వచ్చి చేరింది.

ఇది నిర్మాత ks రామారావు గారు చిరంజీవి గారికి అందించిన అరుదయిన బిరుదు అనే చెప్పాలి. అప్పటివరకు సూపరేం హీరో అని వస్తున్న చిరంజీవి గారు, ఈ సినిమాతో పూర్తిస్తాయి లో మెగాస్టార్ గా మారారు. చిరంజీవి,నిర్మాత. Ks.రామారావు కలయికతో వచ్చిన 5 వ చితం స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్. ఈ చిత్రం రచయిత యండమూరి వీరేంద్ర నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ ఈ సినిమా సరియాయిన ఫలితం అందుకోలేకపోయింది.

చిరంజీవి, నిర్మాత ks రామారావు గారి కాంబినేషన్ లో మొత్తం 5 సినిమాలు తెరకెక్కాయి. అందులో 4 చిత్రాలు సక్సెస్ సాదిస్తే చివరి చిత్రం స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. రామారావు గారు నిర్మించిన ఈ సినిమాలు చిరాజీవి కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయాయి,అంతే కాకుండా ఈయన చిరాజీవి పేరు ముందు మెగాస్టార్ అని చేర్చారు. మొత్తానికి క్రియేటివ్ కమర్షియల్ తో చిరంజీవి గారికి ప్రత్యేక అనుభనడం అనే చెప్పాలి.