పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన ఈ సంచాయిత గణపతిరాజు ఎవరు?

మనసా ట్రస్ట్ వ్యవహారం పై రగడ కొనసాగుతుంది. ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తాని టార్గెట్ చేసీన వారికి వరసగా కౌంటర్స్ ఇస్తున్నారు. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యనా పాత్రుడు లా పై ట్విటర్ లో విరుచుకుపడ్డ ఆమె, తాజా గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్వీట్స్ చేశారు. జనసేనాని ఆరోపణలకు ఇదే నా సమాదానం అంటూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు అనకుండానే సంచయిత గారు తొందరపడి ట్వీట్ చేసేశారని జనసైనికులు ,పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏపీ లో ప్రస్తుతం రాజకీయం లో సంచయిత అనే పేరు మారుమొగుతుంది. సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సంచయిత గజపతి రాజకీయ వర్గాలలో చర్చనీయ అంశం అయింది. బిజేపి యువమోర్చా కార్యవర్గ సభ్యురాలిగా వుండి, అధికార ys కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోమీనేటెడ్ పోస్ట్ ను తమకు చెప్పకుండా స్వీకరించినందుకు సంచాయిత కి బిజేపి నోటీస్ జారీ చేసింది.అయితే సంచాయిత నీయమక వ్యవహారం రాజకీయం గా అటు గజపతి వంశీకుల కుటుంబాల్లో ఎలాంటి పరిస్తితుల్లో దారి తీస్తుందో చూడాలి.

విషయం లోకి వెళ్తే మానస ట్రస్ట్ హిందూయేతర సారధ్యం లో నడుస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారంటూ సంచాయిత ప్రస్తావించారు. ఈ వ్యాక్యా లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను హిందువునని, తన తల్లి దండ్రులు ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజు గార్లు కూడా హిందువులు అని చెప్పారు. అయితే తన తల్లి ఉమా గజపతి రాజు బ్రామణ కుటుంబానికి చెందిన రమేష్ ను రెండో వివాహం చేసుకున్నారని , ట్వీట్ చేశారు. అంతే కాదు ఆయన ఫిల్మ్ మేకర్ గా 6 సార్లు జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారని గుర్తు చేశారు. ప్రతిష్టాపనగా ఎమ్మి అవార్డు కి కూడా నామినేట్ అయ్యారన్నారు. టిడిపి చేస్తున్న తప్పుడు ఆరోపణల ఉచ్చు లో పవన్ కళ్యాణ్ పడవద్దన్నారు . సింహాచలం దేవస్తానం , మనసా ట్రస్ట్ లో ఫోరెన్సీక్ టెస్ట్ జరుగుతుందని,అందుకే తమ అవినీతి అవకతవకలు భయపడుతాయని టిడిపి నేతలు భయపడుతున్నారని సంచయిత అన్నారు. ఒక హిందువుగా తాను అన్నీ మాతాలను గౌరవిస్తానని మీరు అలా చేయగలరా అని ప్రశ్నించారు. చంద్ర బాబు , టిడిపి చెప్తున్న అసత్యలను పవన్ కళ్యాణ్ ని నమ్మవద్దని , పవన్ కళ్యాణ్ గతం లో చేసిన వ్యక్యాలను సరిచేసుకుంటూ ప్రకటన చేయాలని పవన్ కళ్యాణ్ గారిని కోరారు సంచయిత. ఓ జెంటిల్ మెన్ గా మీనుండి నేను ఆశిస్తుంది అదొక్కటే అన్నారు సంచయిత.

కానీ జనసేన నేతలు మాత్రం “ మనసా ట్రస్ట్ హిందూయేతర సారధ్యం లో నడుస్తుందని “ఎప్పుడు అనలేదని పేర్కొంటున్నారు.ట్రస్టీ లను మార్చడం లో రాజకీయ జోక్యమ్ మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడారని వీడియో ప్రూఫ్ తో సహా జనసేన ముందుపెడుతుంది. కావున సంచయిత గారు చేసిన ప్రకటన పచ్చి అసత్యమని ఆమె తన మాటలు వెనక్కి తీసుకోవాలని జనసైనికులు కోరుతున్నారు.