పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే వార్త చెప్పిన బండ్ల గణేష్

బండ్ల గణేష్ ఈ పేరుకి రెండు తెలుగు రాష్ట్ర ల వారికి పెద్ద పరిచయం అవసరంలేదు. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు మనోడు ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి,. ఆ తరువాత రాజకీయాలకు దూరం గా ఉంటూ సినిమాల పైనే ఫోకస్ పెట్టాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు సొంత బిజినెస్ తో బిజీ గా వున్నాడు. అప్పుడప్పుడు కాంట్రావర్సి లు చేసే బండ్ల గణేష్ కరోన టైమ్ లో కూడా ప్రజలకి తనకు తోచిన సహాయం చేస్తా అంటూ ట్విట్టర్ ద్వారా తన సహాయక భావాన్ని తెలియజేశారు. ఇంతవరకు బానే వుంది కానీ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారి ఫోటో తో ఒక పోస్ట్ చేశారు. ఏంటంటే మా బాస్ ఒక్ చెప్పారు.మళ్లీ నా కల నిజం కాబోతోంది.అందుకు న దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు బండ్ల గణేష్ తో సినిమాకి ఒప్పుకున్నటుంది.

  ఒకసారి తీన్మార్ , గబ్బర్సింగ్ మూవీలను నిర్మించిన బండ్ల గణేష్ తో మరో మూవీకి ఒప్పుకున్నట్లు ఇండైరెక్ట్ గా మనకు అర్దమవుతుంది. అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.తన 26 వ సినిమా వకీల్ సాబ్ చిత్రం దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు.తర్వాత 27 వ చిత్రం క్రిష్ దర్శకత్వం లో చేయబోయే సినిమాని a.m రత్నం నిర్మిస్తున్నారు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి మైత్రీ మూవీస్ వారు నిర్మాణ సారద్యం లో ఈ సినిమా జరగబోతుంది. ఈ మూడు సినిమాలే కాకుండా ఆ తర్వాత కొత్తగా మరో వార్త బయటకొచ్చింది. అదే పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి దర్శత్వంలో ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారని దీనికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు లేదా ఆయన ప్లాన్ వేరేలా వుందా అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా గబ్బర్సింగ్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ గారు మరొక సారి సినిమా తీయడం మీడియా లోనూ సోషల్ మీడియా లోనూ ఆసక్తి కరం గా మారింది.

బండ్ల గణేష్ మరియు పవన్ కళ్యాణ్ సుస్వాగతం మూవీ లో కలిసి నటించారు. అంటేకాకుండా పవన్ అంటే గణేష్ కి ఫస్ట్ నుండి అభిమానమే. ఇటీవల జరిగిన ఆడియో వెదుకలు ఇతర టీ వి షోలలో కూడా పవన్ కి ఆయనకి వున్న అనుబందం గురించి చాలానే చెప్పాడు. గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ తో చరియడం తన అదృస్టమ్ అని ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. అంతే కాదు కతమ రాయుడు మూవీ ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయిన గణేష్ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇవన్నీ మనం లైవ్ లో చిసినవే.

బండ్ల గణేష్ రాజకీయం లోకి వచ్చిన తర్వాత ఆయన తొందర పడి ,మాట్లాడిన మాటలకు మూల్యం చెల్లించుకొక తప్పలేదు. జనసేనాని గురించి రోజా చేసిన కామెంట్స్ కి కూడా బండ్ల గణేష్ టీ . వి 9 లో జరిగిన లైవ్ ప్రోగ్రామ్ లో రోజా అన్న మాటలకి వ్యతిరేకత చూపాడు. పవన్ ని ఎవ్వరూ ఏమన్నా కూడా అభిమనులతోపాటు బండ్ల గణేష్ కూడా ఒప్పుకునే వాడు కాదు. దీని అయితే ఈ మధ్య బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏమయిందో తెలీదు కానీ వారి ఇరువురి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. చాలా సోషల్ మీడియాల్లో బండ్ల గణేష్ పవర్ స్టార్ ని ఏదో విమర్శించే విధంగా మాట్లాడినట్టు వార్తలు వినిపించాయ్ . ఏడితేనేం ప్రస్తుతం బండ్ల గణేష్ చేసియన పోస్ట్ తో వారి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.గణేష్ కళ కూడా నిజం కాబోతుంది. ఎట్టకేలకు తన దేవుడు ఒప్పుకున్నందుకు బందల గణేష్ ఆనందం తో పోస్ట్ చేసిన ఫోటో హాట్ టాపిక్ గా హాల్ చల్ చేస్తుంది.