రాజమౌళి పై అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహం!

దర్శక ధీరుడు రాజమౌళికి హ్యాట్స్ఆఫ్ అంటున్నారు. జక్కన్న ఆ ఒక్క స్టార్ ని తప్ప సినిమాలు తీయడం లో అందర్నీ కవర్ చేసినట్లే. ఈ భాహుబలి డైరెక్టర్ క్లారిటీ తో ఇప్పుడు ఓ ఇద్ధరు ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇదలా వుంటే జక్కన్న వల్ల ఒక స్టార్ డైరెక్టర్ కూడా డైలమా లో పడినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఫాన్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? రాజమౌళి వల్ల స్టార్ డైరెక్టర్ కి వచ్చిన సమస్య ఏంటి ? అనేది చూదాo..

ఒక్కో సినిమాతో రాజమౌళి ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయినప్పటికీ జక్కన్న మాత్రం తెలుగు స్టార్స్ తో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు హీరోలతోనే వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని , టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని జక్కనన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి జూ . యన్ టి ఆర్ , రామచరణ్ లతో “ ఆర్ ఆర్ ఆర్” మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమా వుంటుందని రివీల్ చేసి సర్ప్రైస్ షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం జక్కన్న నిర్ణయంతో ఇద్ధలు స్టార్ హీరోల ఫాన్స్ హర్ట్ అయినట్టు టాక్. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి యన్. టి . ర్ తో మరో సినిమా వుంటుందని ఆసపడ్డారు. ఆదేవిదం గా బాహుబలి తర్వాత జక్కన్న ప్రభాస్ తో నే మరో సినిమా తీస్తారని ఎక్స్పెక్ట్ చేశారు . ఇదేరకం గా దర్శకధీరుడు మా అల్లు అర్జున్ తో సినిమా తీయలేదు కాబట్టి ఈ సారి సినిమా చేసే ఛాన్స్ వుందని ఆశ పెట్టుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజమౌళి మహేష్ బాబు తో సినిమా వుంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ లతో సినిమా చేస్తే రాజమౌళి అందరి స్టార్స్ తో సినిమాలు చేసినట్లే. కరొన ఎఫెక్ట్ టైమ్ లో రాజమౌళి మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలతో ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు జక్కన కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అప్పుడెప్పుడో దానయ్య కి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమం లో కె . ల్ నారాయణ కి ఇచ్చిన మాట ప్రకారం తర్వాత ఆయన నిర్మాణం లోనే మహేష్ తో సినిమా చేయబోతున్నాడంట. ఇప్పుడు రాజమౌళి తలచుకుంటే బాలీవుడ్ నిర్మాతలె క్యూ కడతారు. కానీ జక్కన్న మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఒకరితర్వాత ఒకరితో సినిమాలు చేస్తున్నాడు.

రాజమౌళి గారితోపాటు తన కుటుంబ సబ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజెసారు. ఈ విషయం మేరకు ఆయన మాటల్లో …కొద్దీ రోజుల క్రితం నాకు నా కుటుంబ సభ్యులకు కాస్త జ్వరం వచ్చింది, తరువాత దానికదే తగ్గిపోయింది.కానీ మేము కోవిద్ టెస్ట్ చేయించుకోగా ఫలితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచనా మేరకు మేమంతా హోమ్ ఖ్వారెంటీన్ లోకి వెళ్లిపోయాం . ప్రస్తుతం మాకు ఎలాంటి లక్షణాలు లెవ్ అంతాబాగానే వున్నాం.అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.వారి యొక్క సూచనలు పాటిస్తున్నాం. రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వాళ్ళ మేము ప్లాస్మా దానం చేయగలుగుతాం అని రాజమౌళి గారు పేర్కొన్నారు.
రాజమౌళి గారు RRR షూటింగ్ లో బిజీ గా వున్నారు.పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం లాక్ డౌన్ వాళ్ళ తాత్కాలికం గా నిలిపివేయడం జరిగింది.ఇప్పుడు తెలంగాణ ప్ప్రభుత్వం నుండి షూటింగ్లకు అనుమతి లేదు. వచ్చేనెల ప్రభుత్వం నుండి షూటింగ్ అనుమతి లభించిన రాజమౌళి గారు RRR మూవీ ని కొనసాగించలేరు.దీనికి కారణం కరోనా మహమ్మారి నే . ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయదేవగన్ లాంటి స్టార్ హీరోలతో షూటింగ్ కష్టం అని భావించి, ప్రస్తుతానికి షూటింగ్ ని వాయిదా వేసుకున్నారు.