చిరు సరసన హీరోయిన్ గా నటించిన ఈమె ఇపుడు సోదరిగా నటించబోతుంది, ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?

మళయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయినా ” లిసిఫెర్ ” రీమిక్స్ మూవీ మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించబోతున్నారు అని తెలిసిందే . ఇంతకుముందు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150 ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా మలిచిన ఘనత వినాయక్ సొంతం. పక్కా కమర్షియల్ అంశాలతో వినాయక్ ఆ మూవీని పెద్ద సక్సెస్ చేసి చూపించారు.

అందువల్ల వి వి వినాయక్ కి లూసిఫెర్ రీమిక్స్ బాధ్యత ఇచ్చారు. అయితే మలయాళ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ లో కమర్షియల్ చిత్రం అద్దేందుకు వినయ్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారట. అక్కడ మోహన్ లాల్ కి హీరోయిన్ లేకపోయినా తెలుగు వెర్షన్ లో చిరుకి ఒక అందమైన కథానాయికను అలాగే పాటలు కూడా జోడిస్తున్నారట. ఇక మెగాభిమానులు అన్నయ్య నుంచి ఆశించే అన్ని అంశాల్ని ఏర్చి కూర్చేందుకు వినాయక్ ప్రిపేరవుతున్నారట.

స్క్రిప్ట్‌ పరంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఓ సోదరి ఉంటుంది. ఈ పాత్రకు రమ్యకృష్ణ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ‘లూసిఫర్‌’లో మోహన్‌లాల్‌ సోదరిగా మలయాళ నటి మంజూ వారియర్‌ నటించారు. గతంలో ‘ఇద్దరు మిత్రులు, అల్లుడా మజాకా’ వంటి సినిమాల్లో హీరోహీరోయిన్‌గా నటించారు చిరు, రమ్యకృష్ణ. మరి ‘లూసిఫర్‌’ లో అన్నా చెల్లెళ్లుగా నటిస్తే అది కచ్చితంగా విశేషమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

లూసీఫర్ రీమేక్‌లో రమ్యక‌ృష్ణ నటిస్తే మెగా ఫ్యాన్స్‌కు కూడా పండగే చూడాలిక. ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ముందు ఈ పాత్ర కోసం సుహాసినితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపించాయి. చివరికి ఇప్పుడు రమ్య దగ్గరికి వచ్చి ఆగాడు వినాయక్.