వివాదం లో మెగా స్టార్ ఆచార్య!

ఆచార్య కథ నాదే అంటూ రాజేష్ మీడియా ముందుకొచ్చారు. దాదాపు 6 నెలల నుండి షూటింగ్స్ లేక అందరూ కాలిగా వున్నారు. ఇంకో కవధి రోజుల్లో షూటింగ్ మొదలు పెడతారు అనే సమయం లో ఒక కొత్త అంశం బయటకి వచ్చింది. అధి కూడా పెద్ధ సినిమా చిరంజీవి గారి సినిమా అవడం చాలా కీలకం గా మారింది.

ఆయన కథనం మేరకు ……రాజేష్ గారు పెదహాయన అనే వర్కింగ్ టైటిల్ తో 2017 లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. దానిని మెల్లగా డెవలప్ చేసుకుంటూ 2018 ఆగస్టు లో పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ రెఢీ చేసుకోడం జరిగినది. హైదరాబాద్ కి వచ్చిన వారి స్నేహితుడు , రాజేషని వెంటబెట్టుకొని అద్దంకి యం. ఎల్ . ఎ గొట్టిపాటి రవికుమార్ గారిని కలవడానికి వెళ్ళాడు. అక్కడ సబాషణలో బాగం గా రాజేష్ తను రాసుకున్న కథ రెండు లైన్లు వివరించాడు. ఆకథ విని యం . ఎల్. ఎ మైత్రి మూవీస్ వారికి ఫోన్ చేసి ఈ కథ వినమని రాజేష్ ని రెఫర్ చేశాడు. తర్వాత రోజు 2 గంటల సమయం లో యలమంచిలి గారు , చెర్రీ గారు కథ విన్నారు. ఈ రాజేష్ బి.గోపాల్ శిష్యుడు అని చెప్పుకొచ్చారు. కానీ ఇంత బారి మూవీ మీ మీద వర్కౌట్ అవ్వదు . పెద్ధ హీరో లు కూడా అంత ఆసక్తి చూపరు, దీనిని కొరటాల శివ గారు చేస్తే బావుంటాది అని రాజేష్ ని కథ ఇవ్వమని అడిగారు. డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానని చెప్పి కథ ఇవ్వమంటున్నారు దానికి కొంచెం సమయం కావాలనవి రాజేష్ గారు అడిగారు. కథ వినే సమయం లో రికార్డు కూడా చేసున్నారని రాజేష్ అంటున్నారు. తర్వాత ఛాన్స్ కోసం చెన్నై వెళ్ళిన రాజేష్ ఒక నిర్మాతకి కథావినిపించడం,దానికి బాలకృష్ణ గారిని హీరో గా అనుకోడం దాని మేరకు బాలకృష్ణ గారి పక్కనే వుండే ఆనంద్ ని సంప్రదించారు. ఇక ఎన్నికల సమయం లో బాలకృష్ణ గారు 3 నెలలు బిజీ అని చెప్పడం, ప్రొడ్యూసర్ కి కూడా సినిమా ప్లాప్ తో కొంచెం సమయం పట్టింది.

తర్వాత బాల కృష్ణ గారి రూలర్ మూవీ సెట్స్ పై వుండడం తో రాజేష్ బ. గోపాల్ ని కలిశాడు. గోపాల్ గారు కథ ఇవ్వమని అడిగి తాను సినిమా తీస్తానని కథలో వున్న చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. రాజేష్ ఆ కరెక్షన్స్ చేసుకుంటుండగా అక్టోబర్ 4 వ తేదీ ఒక స్నేహితుడు పెట్టిన వాట్సప్ లింక్ లో చిరంజీవి గారు కొరటాల శివతో మూవీ తెరకేకుతున్నట్లు తెలిసింది. డైరెక్టర్ అశోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారిని కలిసి జరిగినడంత వెల్లబుచ్చాడు. ఈ కథనం మేరకు కొరటాల శివగారిని కలవాలి అన్న రాజేష్ విన్నపాన్ని శివ గారు తిరస్కరించారు.

రాజేష్ రెండు సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న పాపర్స్ తో వెళ్ళి కంప్లయింట్ ఇవ్వడం జరిగినది. దీనితో కొరటాల శివ గారు రాజేష్ తో మాట్లాడింది ఏమంటే “నేను మైత్రి మూవీస్ నుండి కథ తీసుకున్నట్లయితే వారితోనే మూవీ చేస్తాను కదా నాకు సంబందం ఏంటి ? న కథ మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి మీరు ఎ విషయం తెలుసుకోకుండా లెటర్ ఇవ్వాడమెంటి ? అని ఆరోపించారు.” దీనికి రాజేష్ పలువురు సినీ ప్రముకులను సంప్రదిoచి నాకు ఏం వద్దండీ ఈ కథకి న పేరు వేయండి చాలు అని కోరాడు. ఈ కథ నుండి నాకు ఎటువంటి డబ్బులు కూడా అవసరం లేదు . నేను ఎటువంటి లాభాలు ఆశించట్లేదని చెప్పడం జరిగినది.ఇప్పుడు సినీ పరిశ్రమకు పెద్ధ దిక్కు ఆయన తెలిసిన నాకు న్యాయం జరుగుతుంది, అనుకున్న రాజేష్ మీడియా ముందుకొచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజేష్ చెప్పిన ఈ కథనo మేరకు కొరటాల శివ గారు , చిరంజీవి గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.