విజయ్ తో అర్జున్ రెడ్డి కి బాబు లాంటి సినిమా తీసి చూపిస్తా

పాన్ ఇండియా లోకి అడుగుపెడుతున్న విజయదేవరకొండ మారిపోయాడు. ఇప్పుడు ఈ బాబు రేంజ్ అంతా పైనే. నిన్నటి వరకు కిందనే చూసిన విజయ్ ప్రస్తుతం శికరాన్ని టార్గెట్ చేశాడు. ఇప్పుడు విజయ్ స్టార్స్ డైరెక్టర్స్ వెంట పడుతున్నాడు.2022 లో సుకుమార్ డైరక్షన్ లో విజయ్ సినిమా కినఫిరం అయ్యింది. పాల్ కాన్ క్రియేషన్స్ పతాకం పై కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు. నిర్మాత పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబినేషన్ గురించి తెలియజేశారు. సుకుమార్ అల్లు అర్జున్ తో తీస్తున్న “పుష్ప” మొదలు కావలసివుంది. పూరీ సినిమా పూర్తి కాగానే నిన్నుకొరి , మజిలీ వంటి హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ్ దర్శకత్వం లో నటించనున్నాడు విజయ దేవరకొoడ . శివ పెద్ధ హీరోలతో చేయకపోయినా వరుస హిట్స్ తో క్రేజీ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. సత్యలీష్ లుక్ కి , ఫ్యాషన్ కి , రౌడీ హీరో కేర్ ఆఫ్ అడ్రస్ . కథలోనే కాదు లుక్ లో కూడా డిఫరెంట్ గా కనిపించాలనుకుంటాడు . ఇక సుకుమార్ సంగతి సరే సరే . స్టైలిష్ ఫిల్మ్ మానర్ గా మంచి పేరుంది. ఇలా ఇద్ధరు స్టైలిస్ట్ , స్పెషలిస్ట్ లు కలిస్తే సినిమా ఎలా వుంటుందో ఇప్పటినుండే ఊహించుకుంటున్నారు అభిమానులు.

ట్విటర్ వేధికాగా విజయ దేవరకొoడ స్పందిస్తూ నాలో వున్న నటుడు ఎంతో వుచ్చు కథతో ఎదురుచూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఇద్ధవక గుర్తుండిపోయే సినిమా అవుతుందని హామీ ఇస్తున్న. సుక్కు సర్ మీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రం గా ఎదురుచూస్తున్న అంటూ సంతోషం వ్యక్తం చేశాడు విజయ దేవరకొండ. అలాగే “నాకు నువ్వొక మంచి మిత్రుడివి కస్టపడే మనసత్వం కాలవాడివి . హ్యాపీ బర్త్డే కేదార్ “ అంటూ తన ప్రొడ్యూసర్ ని విశ్ చేశాడు. కేదార్ తన పుట్టినరోజు సందర్భం గా ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తీస్తున్న మూవీ గురించి వివరిస్తూ “నాకెంతో ఇష్టమైన విజయదేవరకొండ , సుకుమార్ గార్లతో న మొదటి సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషం గా వుంది . వీరి కాంబినేషన్ అనగానే చాలా అంచనాలుంటాయి . ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి శైలి లోనే సినిమా వుంటుంది . పాన్ ఇండియా ప్రాజెక్టు 2022 లో ఈ సినిమా మొదలవుతుంది. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రి కి వచ్చాను . భవిష్యత్ లో వరుస గా సినిమాలు చేస్తాను.” అని పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ సినీ ప్రస్తానం “ఎవడే సుబ్రమణ్యం “ తో మొదలైంది. ఈ సినిమాలో గొప్ప పాత్ర పోషించారు విజయ్. ఈ సినిమా తోనే నాగ అశ్విన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మహానటి వంటి గొప్ప చిత్రాలు తీసి స్టార్ జాబితాలోకి చెరిపోయాడు నాగ అశ్విన్. ప్రస్తుతo ప్రభాస్ , దీపికా లతో ఒక సైంటిఫిక్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతే కాక “ పెళ్లిచూపులు” మూవీ తో డైరెక్టర్ గా పరిచేయమైన తారుణ్ భాస్కర్ ఇప్పుడు వెంకటేశ్ తో మూవీ తీయనున్నాడు. “గీత గోవిందం “ మూవీ డైరెక్టర్ ప్రస్తుతం మహేష్ తో సర్కారు వారి పాట డైరెక్ట్ చేస్తున్నాడు. “అర్జున్ రెడ్డి “ మూవీ డైరెక్టర్ సందీప్ వంగ “కబీర్ సింగ్ “ ను హిందీ లో డైరెక్ట్ చేసి 300 కోట్లు పైగా రాబట్టాడు. ఈ మూవీ తో సందీప్ పేరు బాలీవుడ్ లో మారుమోగిపోయింది.

తన సినిమాలతో స్టార్ దర్శకులు గా చేసిన విజయ దేవరకొoడ ప్రస్తుతం చిన్న చితకా దర్శకులను పట్టించుకోడంలేదు. ఎందుకంటారా ! విజయ దేవరకొండ కి ఎన్ని హిట్స్ పడిన యంగ్ హీరో అనే ముద్ర నుండి బయటపడలేకపోతున్నాడు. అర్జునరెడ్డి తో ట్రెండ్ సెట్ చేశాడు. గీత గోవిందం తో బాక్స్ ఆఫీసు వధ 70 కోట్లు వసూలు చేశాడు. ఇంతటి బారి విజయం కూడా విజయ్ ని స్టార్ హీరో ని చేయలేకపోయింది. స్టార్ డైరెక్టర్ చేతిలో పడితే కానీ స్టార్ కాలేననుకున్నాడో ఏమో వరుస పెట్టి స్టార్స్ కి డేట్ ఇస్తున్నాడు మన విజయ దేవరకొండ.