Highest Grossing Telugu Movies తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వచ్చిన పలు సినిమాలు పరిశ్రమ యొక్క క్రేజ్, మార్కెట్ ని అమాంతంగా పెంచేసాయి. ముఖ్యంగా 2015లో లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి పార్ట్ 1 మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొంది భారీ స్థాయిలో రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకుంది. తెలుగుతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా బాహుబలి పార్ట్ 1 మూవీ పెద్ద విజయం అందుకుంది. అనంతరం వచ్చిన బాహుబలి 2 మూవీ మరింత భారీ సక్సెస్ అందుకుని తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఆ తరువాత వరుసగా వచ్చిన పలు పాన్ ఇండియన్ సినిమాలు మరింతగా విజయం అందుకుని దూసుకెళ్లాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు సినిమాల గురించి.
పుష్ప 2 ది రూల్ (Pushpa 2: The Rule)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటించిన ఈ మూవీలో రావురమేష్, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలని పోషించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద సంచలన విజయం అందుకుంది. ఓవరాల్ గా పుష్ప 2 మూవీ రూ. 1831 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని తెలుగు సినిమాల్లో అత్యధిక గ్రాస్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది.
Highest Grossing Telugu Movies 2024
బాహుబలి 2 (baahubali 2 : The Conclusion)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మూవీ బాహుబలి 2. ఈ మూవీ 2017లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా ప్రభాస్ నటన మూవీకి హైలైట్. అనుష్క శెట్టి, తమన్నా భాటియా హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని గ్రాండ్ గా నిర్మించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, రానా దగ్గుబాటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన బాహుబలి మూవీ అతి పెద్ద సంచలన విజయం అందుకుని వరల్డ్ వైడ్ గా రూ. 1810 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్ అందుకుంది.
ఆర్ఆర్ఆర్ (RRR)
టాలీవుడ్ యంగ్ స్టార్ యాక్టర్స్, నందమూరి తారకరామారావు, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈమూవీలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ గా కనిపించగా విలన్ గా ఆలిసన్ డూడి, రే స్టీవన్సన్ కనిపించారు. ఆకట్టుకునే కథనాలతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా నటించి అలరించారు. ఈ మూవీని భారీ స్థాయిలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం పెద్ద విజయం సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా రూ. 1387 కోట్లని రాబట్టింది.
కల్కి 2898 ఏడి (Kalki 2898 AD)
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరొక ముఖ్య పాత్ర చేసారు. వైజయంతి మూవీస్ సంస్థ పై సీనియర్ నిర్మాత సి అశ్వినీదత్ ఈ మూవీని అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. కల్కి మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ క్యామియో రోల్స్ చేసారు. రిలీజ్ అనంతరం పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కల్కి 2898 ఏడి మూవీ ఓవరాల్ గా రూ. 1200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది.
సలార్ పార్ట్ 1 : (Salaar Part 1 : Ceasefire)
ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు. ఇక ఈ మూవీని భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత విజయ్ కీరాగందూర్ తన హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై నిర్మించగా రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహా, ఝాన్సీ, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించిన సలార్ పార్ట్ 1 మూవీలో అందాల కథానాయిక శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ఇక సలార్ మూవీ రిలీజ్ అనంతరం అతి పెద్ద విజయం అందుకుంది ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వరకు గ్రాస్ దక్కించుకుంది.
బాహుబలి 1 (Baahubali 1 : The Beginning)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ బాహుబలి పార్ట్ 1 అప్పట్లో పెద్ద విజయం అందుకుంది. ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి రమ్యకృష్ణ, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆర్కా మీడియా సంస్థ నిర్మించిన బాహుబలి 1 మూవీకి ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ దీనిని భారీ వ్యయంతో నిర్మించారు. ఇక బాహుబలి 1 మూవీ అప్పట్లో వరల్డ్ వైడ్ గా రూ. 650 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.
Highest Grossing Telugu Movies IMDB
సాహో (Saaho)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ అందాల కథానాయిక శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లింగ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సాహో. అంతకముందు రిలీజ్ అయిన రెండు బాహుబలి సిరీస్ మూవీస్ తో అతి పెద్ద విజయాలు సొంతం చేసుకుని పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్, మార్కెట్ అందుకున్న ప్రభాస్ ఈమూవీతో కూడా మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూవీని భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించగా కీలక పాత్రల్లో నీల్ నితిన్ ముఖేష్, మురళి శర్మ, వెన్నెల కిశోర్, జాకీ ష్రాఫ్, చుంకి పాండే నటించారు. రిలీజ్ అనంతరం సాహో మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 439 కోట్ల గ్రాస్ ని దక్కించుకుంది.
దేవర పార్ట్ 1 (Devara Part 1)
టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తొలిసారిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. భారీ వ్యయంతో దీనిని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మించగా ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సైఫ్ ఆలీ ఖాన్, గెటప్ శ్రీను, అజయ్ నటించారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుని ఓవరాల్ గా రూ. 521 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
Highest Grossing Telugu Movies in North America
పుష్ప ది రైజ్ (Pushpa The Rise)
పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప పార్ట్ 1. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గ నటించగా నెగటివ్ పాత్రలో ఫహాద్ ఫాసిల్ కనిపించారు. ఇక ఈ మూవీలో పుష్పరాజ్ గా తన అద్భుత నటనతో నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. అనంతరం ఈ మూవీలో నటనకు గాను ఆయనకు ఏకంగా ఉత్తమ నటుడుగా జాతీయ అవదు కూడా లభించింది. అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, మైమ్ గోపి, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈమూవీ భారీ విజయం అందుకుని వరల్డ్ వైడ్ గా రూ. 373 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఆదిపురుష్ (Adipurush)
హిందువుల ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీని టి సిరీస్, రిట్రో ఫైల్స్, సంస్థలు కలిసి గ్రాండ్ గా నిర్మించగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీనిని తెరకెక్కించారు. సైఫ్ ఆలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే. సోనాల్ చౌహన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ మూవీకి అజయ్ అతుల్, సాకేత్ పరంపర సంగీతం సమకూర్చారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో రూ. 392 కోట్ల కలెక్షన్ ని రాబట్టింది.
Highest Grossing Telugu Movies 2023