Pushpa 2 Total Collection Worldwide Till Now – Box Office Earnings & Records

Pushpa 2 Total Collection Worldwide Till Now ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. ఈ మూవీలో అందాల కథానాయిక రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో

Pushpa 2 Total Collection Worldwide Till Now – Box Office Earnings & Records

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. ఈ మూవీలో అందాల కథానాయిక రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, అజయ్ తదితరులు నటించారు.

 అంతకముందు వచ్చిన పుష్ప 1 మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు అందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అద్భుత యాక్టింగ్ కి అందరి నుండి సూపర్ గా క్రేజ్ రావడంతో పాటు ఏకంగా ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ మొదటి భాగాన్ని మించి మరింతగా అద్భుత విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 1800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీలో కూడా మరొక్కసారి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. ఇక రష్మిక మందాన ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు మాస్ యాక్షన్, ఎమోషనల్, కమర్షియల్ అంశాలు పుష్ప 2 లో అందరినీ అలరించి మూవీ ఇంత పెద్ద విజయం అందుకుంది.

ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, అలానే సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి ప్రధాన బలాలుగా చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిన విలువలతో పాటు పాటు భారీ వ్యయంతో పుష్ప 2 మూవీ రూపొందింది.

తెలుగు రాష్ట్రాలలో అనుకున్న అంచనాలను మించిన ఈ మూవీ ముఖ్యంగా నార్త్ లో అయితే అదిరిపోయే రేంజ్ లో రెస్సాన్స్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.

ముఖ్యంగా భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో ఓవరాల్ గా అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా పుష్ప 2 నిలిచింది. ఆ విధంగా పుష్ప 2 తో సంచలన విజయం అందుకోవడంతో పాటు ఏకంగా నటుడిగా తన క్రేజ్ ని అలానే మార్కెట్ రేంజ్ ని కూడా అమాంతం మరింత ఉన్నత స్థాయికి పెంచుకున్నారు అల్లు అర్జున్. మరోవైపు పలు భాషల ఆడియన్స్ అలానే సినీ ప్రముఖుల నుండి సైతం పుష్ప 2 మూవీ పై ప్రసంశలు కురిసాయి.

అయితే అనుకోకుండా ఈ మూవీ యొక్క ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఒక దుర్ఘటన కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదై ఆయన కొంత సమస్యలు ఎదుర్కొన్నారు. దాని కారణంగా ఈ మూవీ ఎంతో పెద్ద విజయం అందుకున్నప్పటికీ ఎటువంటి సక్సెస్ సెలబ్రేషన్స్ ని టీమ్ జరుపలేదు. ఇక ఈ మూవీ మొత్తంగా ఏ ఏ ఏరియాలో ఎంతమేర రాబట్టిందో ఇప్పుడు లిస్ట్ ప్రకారం చూద్దాం.

పుష్ప 2 ది రూల్ డే వైజ్ తెలుగు రాష్ట్రాల షేర్ కలెక్షన్ (జీఎస్టీ కలుపుకుని)

Pushpa 2 Total Collection Worldwide Till Now – Box Office Report

డే 1 : 70.81 కోట్లు (6.35)

డే 2 : 19.25 కోట్లు

డే 3 : 21.60 కోట్లు

డే 4 : 27.86 కోట్లు

డే 5 : 9.02 కోట్లు

డే 6 : 7.51 కోట్లు

డే 7 : 5.85 కోట్లు

డే 8 : 4.59 కోట్లు

డే 9 : 4.34 కోట్లు

డే 10 : 7.75 కోట్లు

డే 11 : 12.25 కోట్లు

డే 12 : 3.07 కోట్లు

డే 13 : 1.88 కోట్లు

డే 14 : 1.76 కోట్లు

డే 15 : 1.61 కోట్లు

డే 16 : 1.70 కోట్లు

డే 17 : 2.20 కోట్లు

డే 18 : 3.51 కోట్లు

డే 19 : 1.35 కోట్లు

డే 20 : 1.48 కోట్లు

డే 21 : 2.34 కోట్లు

డే 22 : 1.39 కోట్లు

డే 23 : 1.08 కోట్లు

డే 24 : 1.32 కోట్లు

డే 25 : 1.65 కోట్లు

డే 26 : 72 లక్షలు

డే 27 : 88 లక్షలు

డే 28 : 1.96 కోట్లు

డే 29 : 76 లక్షలు

డే 30 : 66 లక్షలు

డే 31 : 77 లక్షలు

డే 32 : 1.08 కోట్లు

డే 33 : 32 లక్షలు

డే 34 : 27 లక్షలు

డే 35 : 25 లక్షలు

డే 36 : 21 లక్షలు

డే 37 : 11 లక్షలు

డే 38 : 15 లక్షలు

డే 39 : 18 లక్షలు

డే 40 : 11 లక్షలు

డే 41 : 15 లక్షలు

డే 42 : 10 లక్షలు

డే 43 : 7 లక్షలు

డే 44 : 8 లక్షలు

డే 45 : 14 లక్షలు

ఏపీ, తెలంగాణ టోటల్ : 226.14 కోట్ల షేర్ (344.70 కోట్ల గ్రాస్)

Pushpa 2 Opening Day Collection – Record-Breaking Start

పుష్ప 2 ది రూల్ టోటల్ 45 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్

నైజాం : 104.28 కోట్లు

సీడెడ్ : 35.55 కోట్లు

ఉత్తరాంధ్ర : 24.99 కోట్లు

ఈస్ట్ : 13.63 కోట్లు

వెస్ట్ : 10.32 కోట్లు

గుంటూరు : 16.04 కోట్లు

కృష్ణా : 13.15 కోట్లు

నెల్లూరు : 8.18 కోట్లు

ఏపీ, తెలంగాణ టోటల్ 226.14 కోట్ల షేర్ (344.70 కోట్ల గ్రాస్)

కర్ణాటక : 53.33 కోట్లు

తమిళనాడు : 34.83 కోట్లు

కేరళ : 7.60 కోట్లు

హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా : 386.55 కోట్లు

ఓవర్సీస్ : 127.17 కోట్లు

Pushpa 2 Domestic vs Overseas Earnings – Detailed Analysis

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ : 835.62 కోట్ల షేర్ (1783 కోట్ల గ్రాస్)

Pushpa 2 Box Office Milestones – Crossing the ₹1000 Crore Mark

పుష్ప 2 ది రూల్ మూవీ ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 617 కోట్లు, బ్రేకీవెన్ 620 కోట్లు. కాగా ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మొత్తంగా రూ. 835.62 కోట్లని రాబట్టి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఓవరాల్ గా రూ. 215.62 కోట్ల లాభాలను తెచ్చిపెట్టి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి భారతీయ సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద సంచలనం సృష్టించింది.

కాగా ఇప్పటికీ కూడా ఈ మూవీ పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే, అయితే ఆల్మోస్ట్ ఫుల్ రన్ కి ఇది చేరుకోవడంతో మరికొద్ది రోజుల్లో కొద్దిపాటి రాబట్టే అవకాశం లేకపోలేదు. దీనిని బట్టి మూవీ ఓవరాల్ గా రూ. 1800 కోట్ల వరకు గ్రాస్ రాబడుతుందని అంచనా.

ఇక ఈ మూవీ యొక్క సీక్వెల్ అయిన పుష్ప 3 వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు టాక్. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఈ ఒక మూవీ చేసేందుకు సిద్దమయ్యారు అల్లు అర్జున్. దాని అనంతంర పుష్ప 3 తెరకెక్కే అవకాశం ఉందని టాక్.

Pushpa 2 Comparison with Other Tollywood Blockbusters

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow