సీరియల్ యాక్టర్ నవ్య స్వామి అతని ప్రేమించి తప్పు చేశా అంటూ ఎమోషనల్ అయ్యింది !

నవ్య స్వామి ఈ పేరు చెబితే ఎక్కువమంది గుర్తుపట్టక పోవచ్చు కానీ నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు నవ్య స్వామిని అంతలా స్వంతం చేసుకున్నారు నవ్య స్వామి గత ఆరు ఏళ్లగా తెలుగు సీరియల్స్ తో బిజీ గా ఉంటుంది ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఆమె మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది నవ్యస్వామి అయితే ఈ నేపథ్యంలో యాక్టర్ అలీ హోస్ట్ గా చేస్తున్న అలీ తో సరదాగా టాక్ షో లో గెస్ట్ గా పలుగొంది అయితే ఈ షో ఎపిసోడ్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది అంతలా నవ్యస్వామి ఈ షోలో అనేక నిజాలు బయటపెట్టింది నా పేరు మీనాక్షి సీరియల్ లో తనకు అక్కగా నటించిన అమ్మాయిని తన అన్న పెళ్లి చేసుకున్నారు అని దానికి మధ్య వ్యక్తిగా వహించింది తానే అని నవ్య స్వామి చెప్పారు.

ఇక టీవీ ఇండస్ట్రీ లో కరోనా వచ్చింది మొదటిగా తనకే అని ఆ సమయం లో తాను ఎన్నో బాధలు పడ్డారని అపుడు తనకి అంటూ ఎవరు తోడు లేరు అనిపించింది అని నవ్యస్వామి కన్నీరు పెట్టేసింది ఇక ఈ బ్యూటిఫుల్ యాక్టర్స్ ప్రేమ విషయాలు కూడా ఓపెన్ గా మాట్లాడేసింది గతం లో ప్రేమలో విఫలం అయ్యారని వర్కౌట్ కాలేదు దానితో బ్రేకప్ అయ్యిందని అన్నారు. తనకి కోపం ఎక్కువ ఈ కారణంగానే ఒక ఈవెంట్ మేనేజర్ ని కొట్టారని సచ్చారో బ్రతికారో కూడా తెలీదు అంటూ నవ్య స్వామి తెలిపారు. ఇక ఆహ్వానం నా పేరు మీనాక్షి వంటి సిరియాలతో నవ్య స్వామి ఫేమస్ అయ్యారు. ఇపుడు ఆమె కథ సీరియల్ తో ట్రేండింగ్ లో ఉన్నారు, ఈ సీరియల్ లో రవికృష్ణ ,నవ్య స్వామి జంట మరోసారి ప్రేక్షకులను అక్కటుకుంటుంది అయితే వీరు ఇద్దరు రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఒకటి కాబోతున్నారు అని వార్తలు వచ్చాయి.

ఈ మధ్య రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కానీ నవ్య స్వామి మాత్రం రవి తనకి మంచి ఫ్రెండ్ మాత్రమే అని ఈ విష్యం లో కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక నవ్య స్వామి మైసూర్ లో పుట్టి పెరిగింది తన కెరీర్ ని కన్నడ తెంగలి అనే సీరియల్ తో మొదలు పెట్టింది. నా పేరు మీనాక్షి, ఆమెకథ సీరియల్స్ తో పాటు అరన్మానై, కిలి, వాణి రాణి, లక్ష్మి సీరియల్స్ లో నటించింది.. నవ్య స్వామి రవికృష్ణ తో కలిసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఈ జంట బుల్లితెరలో పాపులర్ అయ్యారు ఇద్దరు కలిసి షోలలో పలుగొంటున్నారు ఏ షోలో చూసిన వీళ్ల ప్రేమ గురించి టాపిక్ వస్తూనే ఉంటుంది ఇటీవల వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా వీళ్ల ఇద్దరు జంట గా ఎంట్రీ ఇచ్చారు. ఈటీవీ లో ప్రసారం అవుతున్న క్యాష్ షోలో కూడా యాంకర్ సుమ కూడా వీళ్ల జంట బాగుంటుంది అంటి ప్రేమ గురించి ఆట పట్టిస్తూ ఉంటుంది.

ఇక నవ్య బుల్లితెర నటుల్లో ఎక్కువ పారితోషకం అందుకుంటుంది ఫేమస్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. తనకి సోషల్ మీడియా లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉన్నారు అలానే తన అన్న ని పెళ్లి చేసుకున్న వదిన ఐశ్వర్య పిస్స కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వీళ్ల ఇద్దరు కలిసి నా పేరు మీనాక్షి సీరియల్ లో నటించారు. ఇపుడు ఇద్దరు టాప్ బుల్లితెర యాక్టర్స్ గా నిలుస్తున్నారు. అగ్నిసాక్షి సీరియల్ తో ఐశ్వర్య కి మంచి ఫాలోయింగ్ ని ఏర్పర్చుకుంది. నవ్య స్వామి,రవి కృష్ణ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే వీళ్ల ఇద్దరు కలిసి మంచి హిట్ పెయిర్ గా నిలిచారు ఈ జంటకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది మరి రవికృష్ణ, నవ్య స్వామి రీల్ లైఫ్ లో జంటలు గా ఎలా ఉన్నారో అలానే రియల్ లైఫ్ లో కూడా ఒకటి కావాలని ఫాన్స్ ఏంటో కోరుకుంటున్నారు.