బిగ్ బాస్ అభిజీత్ హారిక ఫ్రెండ్షిప్ పై పేరెంట్స్ కామెంట్లు…

తెలుగు బిగ్ బాస్ షో అద్భుతంగా ముందుకు సాగుతుంది. బుల్లి తెరలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. రోజు రోజుకి ప్రజా ఆదరణ చేరుకుంటుంది అనే చెప్పాలి. టాప్ ప్లేస్ లో వెలుగుతుంది సౌత్ ఇండియా లో బిగ్ బాస్ ఈ పాటికి ఎపుడు కొత్త కొత్త టీమ్ తో ముందుకొస్తు దాని ప్రభావాన్ని మరి ఇంతగా వెలిగిస్తుంది అనే చెప్పాలి. మన భాషలో ఈ షో సూపర్ సక్సెస్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో హౌస్ లో జరిగే లవ్ ట్రాక్లు ప్రధాన కారణం అనే చెప్పాలి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్లో కూడా ప్రేమ కహానీలు కనబడుతున్నాయి.

అందులో అభిజీత్ హారిక ట్రాక్ ఒకటి ఈ షో స్టార్టింగ్ నుండి ట్రెండ్ అవుతుంది ఈ జంట. పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అనే అంటున్నారు చాలా మంది. బిగ్ బాస్ అన్ని భాషల్లో ను లవ్ ట్రాకులు కారణంగానే హై లైట్ అవుతుంది మన తెలుగులో కూడా ఇదే తర వ్యవహారాలు హాట్ టాపిక్ అయ్యాయి. మొదటి సీజన్లో దీక్షాపంత్ -ప్రిన్స్, రెండో సీజన్లో తేజస్వి-సామ్రాట్, దీప్తి సునైనా-తనీష్, మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, ఇలా ట్రాకులు బాగా నడిచాయి. కానీ బయటకి వచ్చాక ఒకరు వివాహం చేసుకున్నది లేదు కేవలం షో ప్రమోట్ చేయటానికే ఈ వార్తలు ప్లస్ పాయింట్ అయ్యాయి అని చాలా వినిపించాయి.

ప్రస్తుతం ప్రసారమవుతుంది 4వ సీసన్ లో మొదటి నుండే లవ్ ట్రాకులు కారణంగా ఫేమస్ అయింది. ప్రారంభంలో అభిజీత్ మోనాల్ గజ్జర్ క్లోజ్ గా ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళు ఇద్దరికీ ట్రాక్ కంటిన్యూ అయ్యిది అనుకున్నారు. కానీ అనుకోని విధంగా మోనాల్ అఖిల్ తో, అభిజీత్ హారిక తో ఫిక్స్ అయ్యారు. అలాగే అరియనా అవినాష్ జంట కూడా ఫేమస్ అయింది సీసన్ 4 లో గతంలో కంటే ఈ సీజన్లో 3 ట్రాకులు కనిపించాయి అని చెప్పొచ్చు. గతంలో జరిగిన టాస్క్స్ లో తనను అభిజీత్ ని వేరే టీమ్స్ లో పెట్టినందుకు నిరాశ పడింది హారిక. ఆ సమయంలోనే ఇలా ఎందుకు చేసావ్ బిగ్ బాస్ అని కెమెరా ముందు ప్రశ్నించింది. అయితే ఈ సన్నివేశం తర్వాత వీళ్లిద్దరి మధ్యలో నిజంగానే ట్రాక్ నడుస్తుంది అని అందారికి అనిపించింది. ఆ తర్వాత కూడా ఒకరికొకరు సహాయం చేస్కుంటూ ముందుకి వెళ్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఏది జరిగిన టెలికాస్ట్ అవుతుంది అని తెలిసి కూడా ఇద్దరు హగ్లు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. ఒకరిని ఒకరు సేవ్ చేస్కుంటూ వస్తున్నారు. కలిసి చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. దీనితో ప్రేక్షకుల మధ్య వీళ్ళ ట్రాక్ పై ఒక బలమయిన అభిప్రాయం అయితే ఏర్పడిపోయింది. ఈ సమయంలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. తాజా గా దీనికి పేరెంట్స్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటున్నారు కొందరు. తాజా గా హారిక తల్లి తన బ్రదర్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే సంధర్బంగా అభిజీత్ హారిక ఫ్రెండ్షిప్ చాలా క్యూట్ గా ఉంది అని మాకు నోయెల్ కూడా చెప్పాడు అని. అది లవ్ అయిన మాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు అని హారిక తల్లి చెప్పారు. ఇది విన్న అభిక ఫాన్స్ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.