Allu Arjun Movies List టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా తొలిసారిగా గంగోత్రి మూవీతో తన సినీ ప్రయాణాన్ని మొదలెట్టారు. అయితే అంతకముందు తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన డాడీ మూవీలోని ఒక చిన్న డ్యాన్సింగ్ బిట్ లో కనిపించి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్, తాతయ్య అల్లు రామలింగయ్య, మావయ్యలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల ఆశీస్సులతో సినీ రంగంలోకి హీరోగా అడుగుపెట్టి ప్రస్తుతం వరుస విజయాలతో తిరుగులేని స్టార్డంతో కొనసాగుతున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన మూవీస్ యొక్క లిస్ట్ ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం
గంగోత్రి : (Gangotri)
ప్రముఖ దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గంగోత్రి మూవీలో సింహాద్రి పాత్రలో కనిపించారు అల్లు అర్జున్. ఈ మూవీలో దివంగత అందాల నటి ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా దీనిని గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్ సంస్థల పై అల్లు అరవింద్, అశ్వినీదత్ నిర్మించారు. 2003 మార్చి 28న మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాగానే సక్సెస్ సాధించి హీరోగా తొలి చిత్రంతో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఆర్య : (Arya)
క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మూవీ ఆర్య. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది. హృదయానికి హత్తుకునే లవ్ స్టోరీగా యాక్షన్ అంశాలతో దర్శకుడు సుకుమార్ దీనిని తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, తో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, లవ్ అంశాలు ఈ మూవీని పెద్ద సక్సెస్ చేసాయి. 2004 మే 7న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఆర్య మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సక్సెస్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో రూ. 4 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 30 కోట్లు రాబట్టింది.
Allu Arjun Movies List Hits and Flops
బన్నీ (Bunny)
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బన్నీ. గౌరీ ముంజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ సంస్థ పై మల్లిడి సత్యనారాయణ రెడ్డి గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ 2005 ఏప్రిల్ 6న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ తో పాటు లవ్, యాక్షన్ అంశాలు ప్రధానంగా ఆడియన్స్ ని అలరించాయి. దీని అనంతరం మరింతగా సినీ అవకాశాలతో కొనసాగారు అల్లు అర్జున్
హ్యాపీ : (Happy)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల కథానాయిక జెనీలియా హీరోయిన్ గా ఏ. కరుణకరన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ హ్యాపీ. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ అప్పట్లో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా మూవీ 2006 జనవరి 26న ఆడియన్స్ ముందుకి వచ్చింది. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన హ్యాపీ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 9 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా యువతకు మరింత చేరువయ్యారు అల్లు అర్జున్.
దేశముదురు : (Desamuduru)
అప్పటి టాలీవుడ్ అతి పెద్ద సంచలన విజయ చిత్రం పోకిరి అనంతరం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో అల్లు అర్జున్ చేసిన మూవీ దేశముదురు. ఈ మూవీ ద్వారా టాలీవుడ్ హన్సిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి మ్యూజిక్ అందించిన ఈ మూవీ సాంగ్స్ ఎంతో పాపులర్ అవ్వడంతో పాటు 12 జనవరి 2007న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీలోని తన మాస్ యాక్టింగ్ తో మరింతగా ఆడియన్స్ ఫ్యాన్స్ లో క్రేజ్ చూరగొన్నారు అల్లు అర్జున్. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ. 26 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది.
పరుగు : (Parugu)
బొమ్మరిల్లు బాక్సర్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా అల్లు అర్జున్ చేసిన మూవీ పరుగు . ఈ మూవీలో షీలా హీరోయిన్ గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీతం అందించారు. లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పరుగు మూవీలో తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించిన పరుగు మూవీ 2008 మే 1న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీ విజయంతో నటుడిగా మరింతగా కెరీర్ పరంగా దూసుకెళ్లారు అల్లు అర్జున్.
Allu Arjun Movies List 2024
ఆర్య 2 : (Arya 2)
అంతకముందు సుకుమార్ దర్శకత్వంలో చేసిన సూపర్ హిట్ మూవీ ఆర్య కి సీక్వెల్ గా అల్లు అర్జున్ చేసిన మూవీ ఆర్య 2. ఈ మూవీని ఆదిత్య ఆర్ట్స్ సంస్థ పై ఆదిత్య బాబు, బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ తో పాటు అల్లు అర్జున్ డ్యాన్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నైటీనిచ్చిన ఆర్య 2 మూవీ యావరేజ్ విజయం సొంతం చేసుకున్నప్పటికీ నటుడిగా అల్లు అర్జున్ కి కెరీర్ పరంగా మరింత మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
వరుడు : (Varudu)
అప్పటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వరుడు. ఈ మూవీని యూనివర్సల్ మీడియా సంస్థ పై డివివి దానయ్య నిర్మించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో 2010 మార్చి 31న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అయితే సొంతం చేసుకోలేకపోయింది. భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కోలీవుడ్ నటుడు ఆర్య విలన్ గా కనిపించారు. అయితే ఈ మూవీలో సందీప్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ నటన పరంగా మంచి ప్రసంశలు అందుకున్నారు.
వేదం : (Vedam)
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేదం. ఈ మూవీలో మంచు మనోజ్, అల్లు అర్జున్ హీరోలుగా నటించగా అనుష్క శెట్టి, దీక్ష సేథ్, మనోజ్ బాజ్ పాయి కీలక పాత్రలు పోషించారు. 2010 జూన్ 4న ఆడియన్స్ ముందుకి వచ్చిన వేదం మూవీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమూవీలో నటించిన ప్రతి ఒక్క పాత్రధారి నటనకు ఆడియన్స్ నుండి ప్రసంశలు కురిసాయి. ఇక ఈ మూవీలో కేబుల్ రాజు గా తన నటనతో అందరినీ అలరించారు అల్లు అర్జున్.
బద్రీనాథ్ : (Badrinath)
రెండవ సారి వివి వినాయక్ తో కలిసి అల్లు అర్జున్ చేసిన మూవీ బద్రీనాథ్. అంతకముందు ఆయనతో కలిసి అల్లు అర్జున్ చేసిన సక్సెస్ఫుల్ మూవీ బన్నీ. ఇక బద్రీనాథ్ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో అల్లు అరవింద్ నిర్మించగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ 2011 జూన్ 10న ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో బద్రీనాథ్ గా ఆకట్టుకునే నటన, డ్యాన్స్ లతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించి మరింత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.
జులాయి : (Julayi)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన మూవీ జులాయి. ఈ మూవీలో అందాల భామ ఇలియానా హీరోయిన్ గా నటించగా సోను సూద్ విలన్ గా కనిపించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ 2012 ఆగష్టు 8న ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక జులాయి మూవీలో రవీంద్ర నారాయణ్ పాత్రలో అల్లు అర్జున్ నటన అందరినీ ఆకట్టుకుంది.
Allu Arjun Movies List New
ఇద్దరమ్మాయిలతో : (Iddarammayilatho)
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ అనంతరం అల్లు అర్జున్ చేసిన మూవీ ఇద్దరమ్మాయిలతో. ఈ మూవీలో అందాల నటీమణులు అమల పాల్, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటించగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పై దీనిని గ్రాండ్ లెవెల్లో బండ్ల గణేష్ నిర్మించారు. అయితే రిలీజ్ అనంతరం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో సంజు రెడ్డి పాత్రలో మరొక్కసారి తన యాక్టింగ్, డ్యాన్సింగ్ టాలెంట్ తో అలరించారు అల్లు అర్జున్. ఈ మూవీ 2013 మే 31న ఆడియన్స్ ముందుకి వచ్చింది.
రేస్ గుర్రం : (Race Gurram)
స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలిసారిగా అల్లు అర్జున్ నటించిన మూవీ రేస్ గుర్రం. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా శ్రీ లక్షి నరసింహా ప్రొడక్షన్స్ సంస్థ పై నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. 2014 ఏప్రిల్ 11 న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. మొత్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో రూపొందిన రేస్ గుర్రం మూవీ రూ. 102 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. ప్రకాష్ రాజ్, శ్యామ్, రవి కిషన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో లక్కీ గా తన పాత్రలో ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించారు అల్లు అర్జున్.
సన్ ఆఫ్ సత్యమూర్తి : (S/O Satyamurthy)
రెండవసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ చేసిన మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో నిత్యా మీనన్ కనిపించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై దీనిని గ్రాండ్ లెవెల్లో ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో విరాజ్ ఆనంద్ పాత్రలో నటించారు అల్లు అర్జున్. 2015 ఏప్రిల్ 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ రూ. 40 కోట్ల బడ్జెట్ తో రూపొంది రూ. 100 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో ప్రకాష్ రాజ్, పవిత్ర లోకేష్, సింధు తులాని, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించారు.
రుద్రమదేవి : (Rudhramadevi)
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన భారీ ప్రతిష్టాత్మక బయోగ్రఫికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రుద్రమదేవి. ఈ మూవీలో అనుష్క టైటిల్ పాత్ర పోషించగా కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ, యుక్తాముఖి గుణ, గుణశేఖర్, రాగిణి గుణ గ్రాండ్ గా నిర్మించారు. 2015 అక్టోబర్ 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న ఈమూవీ రూ. 65 కోట్ల వ్యయంతో రూపొంది రూ. 90 కోట్ల వరకు కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు లభించాయి.
Allu Arjun Movies List IMDB
సరైనోడు : (Sarrainodu)
తొలిసారిగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన మూవీ సరైనోడు. ఈ మూవీలో క్యాథరీన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈమూవీలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. 2016 ఏప్రిల్ 22న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన సరైనోడు మూవీ రూ. 50 కోట్ల వ్యయంతో రూపొంది రూ. 125 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెంచింది. ఇక ఈ మూవీ అటు యూట్యూబ్ లో హిందీ వర్షన్ లో అదరగొట్టి వందల మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
డీజే దువ్వాడ జగన్నాథం : (DJ Duvvada Jagannadham)
తొలిసారిగా మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి అల్లు అర్జున్ చేసిన మూవీ డీజే. ఈమూవీలో అందాల కథానాయిక పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద బాగానే కలెక్షన్ రాబట్టింది. 2017 జూన్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ రూ. 50 కోట్లతో రూపొంది, దాదాపుగా రూ. 150 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది. ఇక ఈ మూవీలో దువ్వాడ జగన్నాధం పాత్రలో తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించారు అల్లు అర్జున్.
నా పేరు సూర్య : (Naa Peru Surya)
కథకుడు వక్కంతం వంశీ తొలిసారిగా మెగాఫోన్ పట్టి అల్లు అర్జున్ హీరోగా రూపొందించిన మూవీ నా పేరు సూర్య. ఈ మూవీలో యువ అందాల కథానాయిక అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా విశాల్ శేఖర్ సంగీతం అందించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ సంస్థ పై లగడపాటి శిరీష శ్రీధర్ గ్రాండ్ గా రూపొందించిన ఈ మూవీలో శరత్ కుమార్, ఠాకూర్ అనూప్ సింగ్, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీలో ఇండియన్ ఆర్మీ సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రూ. 55 కోట్ల వ్యయంతో రూపొంది వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ 2018 మే 4న ఆడియన్స్ ముందుకి వచ్చింది.
అల వైకుంఠపురములో : (Ala Vaikunthapurramuloo)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి రూపొందిన మూవీ అల వైకుంఠపురములో. 2020 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముకుందుకి వచ్చిన ఈ మూవీ అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హీరోగా అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీ సాంగ్స్ నేషనల్ వైడ్ గా క్రేజ్ అందుకోవడంతో పాటు సంగీతం అందించిన ఎస్ థమన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, టబు, జయరాం, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ రూ. 100 కోట్ల వ్యయంతో రూపొంది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 280 కోట్ల మేర కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి.
Allu Arjun Movies List Collections
పుష్ప ది రైజ్ : (Pushpa The Rise)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మరొక్కసారి అల్లు అర్జున్ చేసిన మూవీ పుష్ప ది రైజ్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ గ్రాండ్ గా నిర్మించారు. ఈ పాన్ ఇండియన్ మూవీలో పుష్ప రాజ్ గా తన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో అందరి మనసులు గెలుచుకున్న అల్లు అర్జున్, ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ మూవీకి గాను రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. 2021 డిసెంబర్ 17న పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన పుష్ప ది రైజ్ మూవీ రూ. 200 కోట్ల బడ్జెట్ తో రూపొంది రూ. 385 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుని హీరోలాగా అల్లు అర్జున్ క్రేజ్ తో పాటు మార్కెట్ ని కూడా ఎంతో పెంచింది.
ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా అల్లు అర్జున్ చేస్తున్న మూవీ పుష్ప ది రూల్ (Pushpa The Rule). ఈ మూవీ పై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తం కూడా అన్ని భాషల ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది. 2024 డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఇప్పటికే రూ. 1000 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి రిలీజ్ అంతర్మ పుష్ప 2 ది రూల్ ఎంత మేర సక్సెస్ ని అలానే కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగా లతో కూడా సినిమాలు చేయనున్నారు అల్లు అర్జున్.