Amaran Movie Review అమరన్ మూవీ రివ్యూ తెలుగు –
కోలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన టాలెంటెడ్ యాక్టర్ శివ కార్తికేయన్ హీరోగా అందాల అద్భుత నటి సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బయోగ్రఫికల్ యాక్షన్ మూవీ అమరన్.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది ఈ మూవీ. మన దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన ఎందరో సైనికులు ఉన్నారు. వారిలో ఒకరు 2014 లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద పోరాటంలో భాగంగా అశువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథగా ఇది రూపొందింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం
చిత్రం పేరు : అమరన్
విడుదల తేదీ : 31-10-2024
నటీనటులు : శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్, లల్లూ, శ్రీ కుమార్, శ్యామ్ మోహన్ తదితరులు
దర్శకత్వం : రాజ్ కుమార్ పెరియసామి
నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, వివేక్ కృష్ణాని
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
ఫోటోగ్రఫీ : సిహెచ్ సాయి
ఎడిటింగ్ : ఆర్ కలైవనన్
Amaran Movie Review
కథ :
తన చిన్న వయసునుండే సైనికుడు కావాలని భావిస్తాడు వరదరాజన్ ముకుంద్ (Siva Karthikeyan) . ఆపై మద్రాసు లోని క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్న సమయంలో కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్గీస్ (Sai Pallavi) ని ప్రేమిస్తాడు ముకుందన్. అయితే అదే సమయంలో అతడికి భారత సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఉద్యోగం లభిస్తుంది. అందుకు ట్రైనింగ్ అనంతరం 22 రాజ్ పుత్ రెజిమెంట్ లో చేరతాడు వరదరాజన్ ముకుంద్.
అయితే వీరిద్దరి ప్రేమ విషయమై ముకుంద్ కుటుంబం ఒప్పుకున్నప్పటికీ ఇందు ఇంటివారు మాత్రం ఒప్పుకోరు. అయినప్పటికీ కూడా ఇద్దరు కలిసి పోరాడి చివరికి ఇరు కుటుంబ పెద్దలని ఒప్ప్పించి ఒక్కటవుతారు. కాగా అక్కడి నుండి వారిద్దరి వివాహ దాంపత్యం ఏవిధంగా సాగింది, వృత్తి పరంగా ముకుంద్ వరదరాజన్ ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు, రాజ్ పుత్ రెజిమెంట్ నుండి రాష్ట్రీయ రైఫిల్స్ కి డిప్యుటేషన్ పై వచ్చిన అనంతరం ఆయన ఏవిధంగా సైనిక ఆపరేషన్స్ ని సాగించి ముందుకు కొనసాగాడు అనేది మొత్తం కూడా మూవీలో చూడాల్సిందే.
ముఖ్యంగా ఇటువంటి బయోగ్రఫికల్ మూవీస్ ని తెరకెక్కించాలి అంటే ఒకింత కష్టం అనే చెప్పాలి. అలానే రియలిస్టిక్ లైఫ్ ని ప్రతిభింబించే పాత్రల్లో నటించి ఆడియన్సు ని మెప్పించడం అటు నటులకు కూడా కొంత సవాలు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి, కొన్ని వాస్తవ ఘటనలతో పాటు అక్కడక్కడ కొద్దిపాటి కమర్షియల్ హంగులతో దీనిని తెరకెక్కించారు అని చెప్పాలి.
వివాహానంతరం తన సైనిక ఆపరేషన్స్ పై ఎంతో దృష్టిపెట్టిన ముకుంద్ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. ఒకానొక సందర్భంలో భార్య రెబెకా ఫోన్ చేసినపుడు అతడి బృందం పై ఉగ్రవాదుల అటాక్ జరుగుతుంది. ఇక పలు కీలక సన్నివేశాల్లో హీరో శివ కార్తికేయన్ నటన ఎంతో బాగుంది. యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన తన పాత్రలో అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడంతో పాటు మేజర్ వరదరాజన్ ముకుందన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారని చెప్పాలి.
Amaran Movie Review
ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించిన సాయి పల్లవి గురించి, ఆమె తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అక్కడక్కడా పలు ఎమోషనల్ సీన్స్ లో సాయి పల్లవి నటనకు మన కంట కన్నీరు ఆగదు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో సాయి పల్లవి నటన అద్భుతః అనే రీతిన ఉంటుంది. దేశం కోసం సైనికుల త్యాగాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చక్కగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రాజ్ కుమార్ ఎంతో బాగా తీశారు.
హీరో హీరోయిన్స్ ఇద్దరు ప్రేమలో పడడం, ఆపై ఒకరినొకరు అర్ధం చేసుకుని వివాహం చేసుకోవాలని నిశ్చయించడం, అనంతరం ఇద్దరు కుటుంబాల పెద్దలని ఒప్పించి వివాహం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలతో పాటు వివాహానంతరం ఒక బిడ్డ కలిగిన వారు, ముకుందన్ ఉద్యోగం రీత్యా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కళ్ళకి కట్టినట్లు దర్శకుడు ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా కథలోని పలు కీలక సన్నివేశాలు ఎంతో హృద్యంగా సాగుతాయి.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా సైనికుడి జీవితం ఆధారంగా రూపొందించిన వాస్తవ కథ కావడంతో ఇటువంటి కథల్లో లోపాలు వెతకలేము. అయితే అక్కడక్కడా కథనం కొద్దిగా నెమ్మది అనిపించినప్పటికీ అది కథనం సాగే తీరుకి పెద్దగా అడ్డంకి అనిపించదు. ఇక ఇటువంటి కథలని తెరకెక్కించేటపుడు దర్శకుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Amaran Movie Review
ముఖ్యంగా అక్కడక్కడా పలు సన్నివేశాల్లో ఉగ్రవాదుల అటాక్ చేసే సన్నివేశాల్లో కథనం కొంత డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విభాగం ఫస్ట్ హాఫ్ లో ఒక పది నిమిషాల మేర ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. ఈ మూవీ ఫోటోగ్రఫి బాగానే ఉంది, అలానే సంగీతం అందించిన జివి ప్రకాష్ కుమార్ సాంగ్స్ పరంగా ఆకట్టుకున్నారు. మూవీ యొక్క తెలుగు డబ్బింగ్ బాగుంది, అందరు పాత్రధారులకు సెట్ అయింది.
తీర్పు :
మొత్తంగా చెప్పాలి అంటే సైనిక వీరుడు మేజర్ వరదరాజన్ ముకుందన్ జీవితం ఆధారంగా రూపొందిన అమరన్ మూవీ చక్కటి కథ కథనాలతో రూపొందిన చిత్రం అని చెప్పాలి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన తీరు తో పాటు హీరో హీరోయిన్స్ గా నటించిన శివ కార్తికేయన్, సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారు. పలు యాక్షన్ ఎమోషల్ సన్నివేశాలు మన మనసులు తాకుతాయి. కథనం పూర్తిగా ఊహాజనితం అయినప్పటికీ ఆడియన్స్ ని స్టోరీకి ఎంగేజ్ చేయడంలో దర్శకుడు రాజ్ కుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.
రేటింగ్ : 4 / 5