లాస్య కంటే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని యాంకర్ రవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అసలు ఎవరు ఆమె?

ప్రస్తుతం బుల్లి తెరలో టాప్ ట్రేండింగ్ లో ఉంది బిగ్ బాస్. పదకొండు వారాలు పూర్తి అయింది. ఇక టాప్ 5 కంటెస్టెంట్ల గురించి చర్చ జరుగుతుంది. 15 వారాల షో కి ఇక మిగిలింది 4 వారాలు మాత్రమే. చివరకు ఏమి జరుగుతుంది అని అందరు ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు. ఎవరు ఫైనల్ టైటిల్ విన్నర్ అనేది చాలా వరకు వారి ఫేవరిట్స్ గురించే భావిస్తున్నారు అభిమానులు. సండే ఒక ఎలిమినేషన్ అయిపొయింది. ఇక ఈ వారం లాస్య ఎలిమినేట్ అయిపొయింది. ఇక మిగిలిన 7 మంది ఇంటి సభ్యుల్లో ఎవరు చివరి వరకు ఉంటారు అనేది మాత్రం చూడాల్సిందే.

తాజా గా యాంకర్ రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూ లో రవి తన టాప్ 5 కంటెస్టెంట్ల గురించి చెపుతూ లాస్య పై సెన్సషనల్ కామెంట్స్ చేసాడు. రవి తన యూట్యూబ్ ఛానల్ కోసం వర్షిణి, ఆమె సోదరి సౌజన్య ను స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. అందులో భాగంగా వర్షిణి లైఫ్ సీక్రెట్లు అన్ని బయట పడ్డాయి, ఇంత వరకు మీడియా ముందు ప్రేక్షకుల ముందు రాని సౌజన్య , మొదటి సారి రవి కోసం కెమెరా ముందు కు వచ్చింది. అయితే రవి కి వాళ్ళు ఇద్దరు పెద్ద ఫాన్స్ అని, చిన్న తనం నుంచి కూడా తను అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. సం థింగ్ స్పెషల్ ప్రోగ్రాం చేసే సమయం లో తమ సోదరుడు మీకు పెద్ద అభిమాని, పటాస్ షో తో మేము కూడా ఫ్యాన్ అయ్యాము అని వర్షిణి, తన సోదరి చెప్పుకొచ్చారు.

అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకున్న సమయం లో వారి టాపిక్ బిగ్ బాస్ షో మీదకు మళ్లింది. ఆ ఇంటర్వ్యూ వల్లే యాంకర్ రవికి, అభిజీత్ కి ఉన్న రేలషన్ బయట పడింది. ఆ ఇద్దరు కజిన్ బ్రదర్స్ అవుతారు అని తెల్సింది. ఇక ఇంటర్వ్యూ లో టాప్ 5 కంటెస్టెంట్ గురించి మాట్లాడుకున్నారు. తన ఉదేశ్యం లో టాప్ 5 కంటెస్టెంట్ల కొందరి పేర్లు చెప్పాడు. అభిజీత్, సోహైల్, హారిక, అవినాష్ అంటూ నలుగురి పేర్లు చెప్పాడు. కానీ అయిదో పేరులో లాస్య పేరు చెప్పకుండా అరియానా పేరు చెప్పాడు. కానీ వర్షిణి ఆమె సోదరి మాత్రం లాస్య పేరు చెప్పారు. తాను కూడా లాస్య నే అనుకున్నాడు గాని అరియానా నే అని, తను స్ట్రాంగ్ అని అంటున్నాడు. అయితే టాప్ 5 లో చెప్పలేదు తేల్చి చెప్పేసాడు అందుకే.

రవి లాస్య అనే పేర్లు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు స్టార్ మా లో వచ్చిన సం థింగ్ స్పెషల్ అనే షో తో ఈ జోడి బాగా పాపులర్ అయింది. తర్వాత చాలా రోజులు కలిసి ఈవెంట్లు చేసారు. కానీ మధ్యలో గొడవలు రావటం తో ఇద్దరు దూరం అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లు ఇద్దరు మాట్లాడుకున్నది కూడా ఎక్కడ లేదు. అయితే రవి చెప్పింది నిజం కానంది. ఎందుకు కంటే లాస్య ఎలిమినేట్ అయిపోయింది. రవి చెప్పిందే నిజం అయింది. టాప్ 5 లో లాస్య లేదు. అరియానా సేఫ్ అయింది. మొత్తానికి రవి లాస్య గురించి ఏం అనుకున్నారో అదే జరిగింది.