అనుష్క శెట్టి , అనుష్క శర్మ లా మధ్య పోరు కి ప్రభాస్ ఎలా కారణమో తెలుసా ?

అనుష్క వర్సెస్ అనుష్క!


అదేనండీ బాబు అనుష్క శెట్టి వర్సెస్ అనుష్క శర్మ వీళ్లదరి మద్య కాంపీటేషన్ మొదలైంది ఇప్పుడు. సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడని అనుష్క శర్మ కు, తన కెరీర్ గ్రాఫ్ లో నార్త్ ఊసే లేని అనుష్క శెట్టి కి పోలిక ఏంటి అనుకుంటున్నారా? ఉత్తర దక్షిణ దృవాలంటీ వీరద్దరి మద్య గోడవేంటో ఆ డార్లింగ్ ప్రభాస్ గారి ద్వారా తెలుసుకుందాం రండి!.

ప్రభాస్ చేయబోయే ఆదిపురుష్ అలియాస్ శ్రీరామ చంద్రుడు ఏక ప్రత్ని వ్రతుడు ఒక్కటే భార్య ఒక్కటే భాణం టైపు అన్నమాట. ఆ నాటి రాముడు సీత కోసం ఆడవులంతా గాలించాడు. ఇప్పుడు ఈ రాముడు కి కావాల్సిన సీత కోసం దేశమంతా జల్లెడ పడుతున్నాడు డైరెక్టర్ ఓం రౌత్ . దాదాపు 6 నుండి 7 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తే ఇప్పుడు 2 -3 పేర్లను అండర్లైన్ చేశారట. అందులో ఒకరు బాలి వుడ్ స్వీటీ అనుష్క శర్మ, ఇప్పుడు సీమంతం వేడుకలో వున్న అనుష్క శర్మ సీత పాత్రకోశం ఫిక్స్ అయ్యారట డైరెక్టర్ ఓం . తాను రాసుకున్న కథ చెప్పి ఆమెను ఒప్పించారని, కాకపోతే డొటెడ్ లైన్స్ మీద ఇంకా సంతకం చేయలేదని నార్త్ మీడియా రాసేస్తుంది.

సల్మాన్ ఖాన్ తో సుల్తాన్ , అమీర్ ఖాన్ తో పి . కె , షారుక్ ఖాన్ తో జీరో మూవీ ఇలా అందరి స్టార్స్ తో పెద్ధ సినిమాలు చేసి అల్ ఇన్ అల్ అలుగు రాని అనిపించుకున్న అనుష్క శర్మ రెండేళ్ల నుండి గ్లామ్మర్ ఫీల్డ్ కి సెలవు పెట్టి ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యారు. అమ్మనవుతున్నానోచ్ అంటూ అనవునస్మెంట్ ఇచ్చిన ఈ అమ్మడు సినిమాలా పట్ల తన ఆలోచన మార్చుకునే వుంటారు. ఆదిపురుష్ తో వ్యవహారం కనుక ఇధి అంటి అంటనట్టు వుండే పాత్ర అవుతుందని , డాన్స్ లు గాట్రా అంటూ పెద్ధగా కస్టపడే అవసరం లేకపోవచ్చని సెకండ్ థాట్స్ తో వున్నారంట. డెలివేరి అయ్యాక 2 నేలల సమయం తర్వాత షూటింగ్ లో పాల్గొంటారని టాక్ నడుస్తుంది. ఇప్పుడు డార్లింగ్ విత్ అనుష్క శర్మ “రబ్ నే బనా ది జోడీ “అంటూ కొంప్లిమెంట్స్ వస్తున్నాయ్ అప్పుడే.

ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఇంకా బొమ్మాళీ ఫోబియా తో నే వున్నారు . మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి బాహుబలి , దేవసేన కాంబో ను రిపీట్ చేయాలి ఆన్నది వెళ్ళు చేస్తున్న ఓపెన్ డిమాండ్. రాముడు ప్రభాస్ అయితే సీత అనుష్క శెట్టి ఇందులో సెకండ్ ఒపీనియన్ కి ఛాన్సే లేదంటూ సోషల్ మీడియా లో జుస్టిఫై చేస్తున్నారు. నార్త్ లో మినిమమ్ పరిచయం లేకపోయినా దేవసేన గా సూపర్హిట్ నటనతో ఆకట్టుకున్నారు అనుష్క శెట్టి. అందుకే మా అనుష్క కి మరే అనుష్క పోటీ కాబోరు అన్నదే వల్ల కాన్ఫిడెన్స్ .

ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ లో ఏమేమి పరమేటర్స్ చూశారు . ఇప్పుడు సీత పాత్రను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అనేది కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓం రౌత్ ఇస్టం. ప్రభాస్ నిగ్రహం లో రాముడి విగ్రహాన్ని చూసారంటున్న ఆ స్టార్ డైరెక్టర్ కి అనుష్క శర్మ కళ్ళల్లో సీత పాత్రకి వుండాల్సిన లక్షణాలు కనిపించయామో , ఒక మంచి రోజు ఆదిపురుష్ డైరెక్టర్ ఆ మంచి వార్తా అఫిసియల్ గా చెప్పేదాక ఇరువురి భామల మద్య ఈ ఊగిసలాట తప్పేలా లేదు.