Anushka in Saree తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచిన అనుష్క శెట్టి కూడా ఒకరు. తెలుగు సినీ తెరపై ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క, తొలిసారిగా అక్కినేని నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సూపర్ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ 2005లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకుంది. ఇందులో సోను సూద్ చెల్లెలిగా షాషా పాత్రలో కనిపించి మెప్పించారు అనుష్క శెట్టి.
ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న అనుష్క శెట్టి, ఆ తరువాత కొన్నాళ్ల అనంతరం దివంగత దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన హర్రర్ జానర్ మూవీ అరుంధతిలో నటించి మెప్పించారు. ఆ మూవీలో డ్యూయల్ రోల్ పోషించారు అనుష్క. ఇక అందులో ఆమె పోషించిన జేజెమ్మ పాత్రకు అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి. అప్పట్లో రిలీజ్ అనంతరం అతి పెద్ద విజయం అందుకున్న ఈ హర్రర్ మూవీ హీరోయిన్ గా అనుష్క రేంజ్ ని అమాంతంగా పెంచేసింది.
ఆ తరువాత రవితేజతో విక్రమార్కుడు, బలాదూర్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఖలేజా, నటసింహం నందమూరి బాలకృష్ణతో ఒక్కమగాడు, కింగ్ నాగార్జున తో రగడ మూవీస్ చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు అనుష్క శెట్టి. ఇక అక్కడి నుండి మరింతగా కెరీర్ పరంగా దూసుకెళ్లిన అనుష్క శెట్టి అటు తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకున్నారు. అక్కడి సూపర్ స్టార్స్ అయిన సూర్య, ఇళయదలపతి విజయ్ ల సరసన పలు సినిమాలు చేసారు అనుష్క.
Anushka in Saree Images
ఆ విధంగా అక్కడ కూడా మంచి విజయాలు అందుకున్న అనుష్క శెట్టి, తమిళ ఆడియన్స్ నుండి కూడా హీరోయిన్ గా బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన వేదం మూవీలో అనుష్క శెట్టి పోషించిన పాత్రకు అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి. అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో లింగా, నాగార్జున తో సోగ్గాడే చిన్నినాయన, గుణశేఖర్ తీసిన భారీ ప్రతిష్టాత్మక మూవీ రుద్రమ దేవి సినిమాలు చేశారు అనుష్క. అవన్నీ కూడా ఆమె క్రేజ్ ని మరింత పెంచాయి.
అయితే 2015లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో దేవసేన పాత్ర లో నటించి తన అద్భుత నటన, అందంతో ఆకట్టుకున్నారు అనుష్క శెట్టి. అప్పట్లో పాన్ ఇండియన్ రేంజ్ లో అతిపెద్ద సంచలన విజయాలు సొంతం చేసుకున్న బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకదానిని మించి మరొకటి గొప్ప సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో హీరోయిన్ గా అనుష్కకు మరింతగా పేరు లభించింది.
ఆ తరువాత అనుష్క శెట్టి యాక్షన్ థ్రిల్లర్ మూవీ భాగమతి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. యువ దర్శకుడు అశోక్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో రిలీజ్ అనంతరం విజయం సొంతం చేసుకుంది. ఆ సినిమా అనంతరం నిశ్శబ్దం అనే మూవీలో విభిన్న పాత్రలో నటించి మరొక్కసారి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అనుష్క. అయితే ఆ మూవీ తరువాత కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్నారు అనుష్క.
అయితే మధ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తీసిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ పేట్రియాటిక్ మూవీ సైరా నరసింహా రెడ్డి మూవీలో కొన్ని క్షణాల పాటు రాణి లక్ష్మీబాయి పాత్రలో మెరిశారు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా కొంత బ్రేక్ తీసుకున్నారు అనుష్క. ఇక ఇటీవల యువ దర్శకుడు పి మహేష్ తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
Anushka in Saree Look
యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ సొంతం చేసుకుని హీరోయిన్ గా అనుష్క కి ఇంకా పేరు తీస్కువచ్చింది. ఇక తాజాగా క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఘాటీ మూవీలో ఆమె ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా తాజా దీని యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ రిలీజ్ అయి మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది.
ఈ గ్లింప్స్ లో ఎంతో పవర్ఫుల్ లేడీ పాత్రలో రౌద్రంగా కనిపించరు అనుష్క. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ కి మంచి స్నేహితురాలైన అనుష్క, ఆయనని వివాహం చేసుకోనున్నారని అప్పట్లో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే తామిద్దరి మధ్య ఉన్నదీ మంచి స్నేహం మాత్రమే అని, దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని మీడియాని కోరారు అనుష్క శెట్టి. ఇక అనుష్క మంచి నటి మాత్రమే కాదు మంచి మనసున్న మనసున్న నటి కూడా. పలు సందర్భాల్లో తనకు ఉన్నంతలో పలువురు తన స్టాఫ్ తో పాటు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం అందించి తన మంచి మనసు చాటుకున్నారు అనుష్క శెట్టి.
Anushka in Saree Latest
ఇక మొదటి నుండి తాను కష్టాన్ని నమ్మి ముందుకు సాగుతున్నానని అయితే మధ్యలో సినీ కెరీర్ పరంగా పలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి మెల్లగా ఒక్కొక్కటిగా విజయం అందుకుని నేడు ఈ స్థాయికి చేరానని అంటారు అనుష్క. ఇక తాను ఇంతటి గొప్ప స్థాయికి రావడానికి తల్లితండ్రులు మరియు సోదరుడి యొక్క ప్రోత్సాహం ఎంతో ఉందని వారి యొక్క ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనని అంటుంటారు అనుష్క.
ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు అనుష్క శెట్టి. ఆకట్టుకునే అందంతో పాటు చక్కని శరీర సౌష్ఠవం కలిగిన అనుష్క ఎక్కువగా మోడరన్ డ్రెస్ లతో పాటు పలు సందర్భాల్లో చీరకట్టులో కూడా దర్శనమిస్తుంటాడు. ఇక తన ఆరోగ్యాన్ని నిత్యం వ్యయంతో పాటు యోగా వంటివి చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటానని, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా అని కూడా ఆమె అంటారు.