Best Telugu Movies on IMDB భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పటితో పోలిస్తే ఇటీవల ఆకట్టుకునే కథ, కథనాలతో కూడిన సినిమాలను ఆడియన్స్ ముందుకి తీసుకువస్తోంది. ముఖ్యంగా అనేకమంది స్టార్స్ తో పాటు యువ కథకులు, దర్శకులు, నిర్మాతలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ తమ ప్రతిభ తో అందరినీ అలరిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ సినిమాల తరువాత భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాల రాక మొదలైంది.
ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్, దేవర, సలార్, కల్కి 2898 ఏడి, దేవర వంటి భారీ సినిమాలు దేశవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ తో పాటు ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో సైతం భారీ స్థాయి కలెక్షన్ సొంతం చేసుకున్నాయి. ఇక విషయం ఏమిటంటే, సినిమాలకు రేటింగ్స్ అందించే సంస్థల్లో ప్రఖ్యాతి గాంచింది IMDB (Internet Movie Database). ఇందులో ప్రతి యొక్క భాషా మూవీకి ప్రత్యేకంగా రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాగా తెలుగు మూవీస్ లో అత్యధిక IMDB రేటింగ్స్ కలిగిన బెస్ట్ మూవీస్ యొక్క లిస్ట్ ని ఇప్పుడు చూద్దాం
C / O Kancharapalem :
IMDB Rating – 8.8 / 10
యువ దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ అంథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో సుబ్బారావు, రాధా బెస్సి, కేశవ కర్రీ, నిత్యశ్రీ గోరు, కార్తీక్ రత్నం, ప్రణీత పట్నాయక్, మోహన్ భగత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ సంస్థ పై ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి గ్రాండ్ గా నిర్మించారు.
స్వీకర్ అగస్తి సంగీతం అందించిన ఈ మూవీ 7 సెప్టెంబర్ 2018న ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా హృద్యమైన యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ మనసుని తాకాయి. ముఖ్యంగా విమర్శకులు సైతం ఈ మూవీ పై ప్రసంశలు కురిపించారు. రూ. 70 లక్షల మేర బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఓవరాల్ గా రూ. 7 కోట్లు రాబట్టింది.
Best Telugu Movies on IMDB 2023
Jersey
IMDB Rating : 8.5 / 10
టాలీవుడ్ యువ నటుల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జెర్సీ. ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో సత్యరాజ్, సనుష, విస్వంత్ తదితరులు నటించారు.
2019లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. నాని ఆకట్టుకునే ఎమోషనల్ యాక్టింగ్ తో పాటు గౌతమ్ అలరించే టేకింగ్ మూవీని మంచి సక్సెస్ చేసాయి, ఇక అనిరుద్ సంగీతం కూడా ఆడియన్స్ ని అలరించింది. ఇక జెర్సీ మూవీ రూ. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందగా ఓవరాల్ గా దీనికి రూ. 48 కోట్ల కలెక్షన్ లభించింది.
MayaBazar
IMDB Rating – 9.1 / 10
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటి దిగ్గజ లెజెండరీ నటీనటులు అందరూ కూడా నటించిన మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మాయ బజార్. ఈ మూవీలో శ్రీకృష్ణుడిగా లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు కనిపించగా అభిమన్యుడిగా లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, ఘటోత్కచుడిగా లెజెండరీ ఎస్వీ రంగారావు కనిపించారు.
అప్పట్లో అందరిలో మంచి అంచనాలుఎ ఏర్పరిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. 1957లో రిలీజ్ అయిన ఈ మూవీని అప్పటి దిగ్గజ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ వారు భారీ వ్యయంతో నిర్మించగా కెవి రెడ్డి తెరకెక్కించారు. అనంతరం ఈ మూవీ తమిళ్ లో కూడా రూపొంది అక్కడ కూడా విజయం అందుకుంది.
Sita Ramam
IMDB Rating – 8. 5 / 10
యువ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా యువ అందాల నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సీతారామం. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ తెలుగుతో పాటు పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించగా అశ్వినీదత్ నిర్మించారు. ఇక ఈ మూవీ 2022 లో రిలీజ్ అయింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర చేయగా ఇతర ముఖ్య పాత్రల్లో సుమంత్, సచిన్ ఖేడేకర్, తరుణ్ భాస్కర్ తదితరుల నటించారు. ఆకట్టుకునే కథ కథనాలతో ఈ మూవీ అందరినీ విశేషంగా అలరించింది.
Nuvvu Naaku Nachav
IMDB Rating – 8.7 / 10
టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా అప్పటి స్టార్ డైరెక్టర్ విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ మూవీలో సుధ, చంద్రమోహన్, ప్రకాష్ రాజ్, సుహాసిని, సునీల్, బ్రహ్మానందం తదితరుల ముఖ్య పాత్రలు పోషించగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిశోర్ దీనిని గ్రాండ్ గా నిర్మించారు.
2001లో రిలీజ్ అయిన ఈ మూవీ అతి పెద్ద విజయం అందుకుంది. కోటి సంగీతం అందించిన ఈ మూవీలోని సాంగ్స్ అప్పట్లో విశేషమైన స్పందన అందుకోవడంతో పాటు ఇందులో వెంకటేష్ యాక్టింగ్, కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించాయి.
Agent Sai Srinivasa Athreya
IMDB Rating – 8.3 / 10
యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన థ్రిల్లింగ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ మూవీలో శృతి శర్మ హీరోయిన్ గా నటించగా స్వరూప్ దీనిని తెరకెక్కించారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని రాహుల్ యాదవ్ నక్కా గ్రాండ్ గా నిర్మించగా మార్క్ ఆర్ రాబిన్ దీనికి సంగీతం అందించారు.
మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ముఖ్యంగా ఏజెంట్ ఆత్రేయ గా నవీన్ పోలిశెట్టి తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ రూ. 4 కోట్ల బడ్జెట్ తో రూపొంది రూ. 20 కోట్లు కలెక్షన్ రాబట్టింది.
Best Telugu Movies on IMDB 2024
Aha Naa Pellanta
IMDB Rating – 8.9 / 10
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా రజిని హీరోయిన్ గా దిగ్గజ దివంగత దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన లవ్, యక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అహ నా పెళ్ళంట. అప్పట్లో అతి పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ 1987లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ తో పాటు కీలక పాత్రలో నటించిన కోట శ్రీనివాసరావు నటన ఈ మూవీ భారీ సక్సెస్ కి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
జంధ్యాల అద్భుత కామెడీ టేకింగ్ తో పాటు సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పై ప్రముఖ నిర్మాత డి రామనాయడు నిర్మించారు. ఇక రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న అహ నా పెళ్ళంటా మూవీ రూ. 16 లక్షలతో రూపొంది రూ. 5 కోట్ల కలెక్షన్ రాబట్టింది.
Mahanati
IMDB Rating – 8.4 / 10
అందాల కథానాయిక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒకప్పటి దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ మూవీ మహానటి. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ ఇతర పాత్రల్లో నటించగా యువ దర్శకుడు నాగ అశ్విన్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కించారు. భారీ వ్యయంతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంస్థల పై స్వప్న దత్ నిర్మించిన ఈమూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.
ఇక అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ 2018 లో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకుంది. అంతే కాదు సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయం చేసిన కీర్తి సురేష్ కు ఈ మూవీకి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా లభించింది. రూ. 25 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ మూవీ రూ. 83 కోట్లని రాబట్టింది.
Best Telugu Movies on IMDB 2022
Baahubali 2 : The Conclusion
IMDB Rating : 8.2 /10
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ నటి అనుష్క శెట్టి హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియన్ మూవీ బాహుబలి 2. అంతకముందు వచ్చిన బాహుబలి 1 మూవీ అప్పట్లో పెద్ద విజయం అందుకోగా దానికి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ మరింత భారీ విజయం అందుకుంది.
ముఖ్యంగా మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ నటన, అనుష్క, తమన్నా ల ఆకట్టుకునే అందం అభినయం, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యద్భుత టేకింగ్ ఈ మూవీని ఎంతో భారీ విజయవంతం చేసాయి. ఇక ఈ మూవీ 2017లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి ఊహకందని స్థాయి విజయం అందుకుంది. ఇక ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. కాగా బాహుబలి 2 మూవీ రూ. 250 కోట్లతో రూపొంది వరల్డ్ వైడ్ గా రూ. 1850 కోట్లు రాబట్టింది.
Aa Naluguru
IMDB Rating : 8.6 /10
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విభిన్న పాత్రలో నటించిన మూవీ ఆ నలుగురు. ఈ మూవీలో రఘురాం పాత్రలో ఆయన అద్భుత నటన గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. చంద్ర సిద్దార్ధ తెరకెక్కించిన ఈ మూవీలో ఆమని, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, చలపతి రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు.
ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ మూవీని ప్రేమ్ మూవీస్ బ్యానర్ పై సరిత పాత్ర, ప్రేమ్ కుమార్ గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ తో పాటు ఎమోషనల్ అంశాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. 2004లో రిలీజ్ అయిన ఈమూవీతో నటుడిగా రాజేంద్ర ప్రసాద్ అందరి నుండి మరింతగా ప్రసంశలు అందుకున్నారు.