బ్లాక్ బస్టర్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న మెగాస్టార్ కొత్త సినిమా

సుమారు 9 సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి ఎలాంటి సంచలన విజయాలు అందుకుంటున్నాడో మన అందరికి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి ఊపు కి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు కూడా నిలబడలేక ఉన్నారు.ఖైదీ నెంబర్ 150 చిత్రం తో మొదలైన మెగాస్టార్ చిరంజీవి జైత్ర యాత్ర సై రా నరసింహ రెడ్డి తో కంటిన్యూ అయ్యింది.65 ఏళ్ళ వయస్సులో కూడా 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల అవలీలగా కొడుతున్న మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో చెయ్యబొయ్యే సినిమాల గురించి సర్వత్రా చరచనీయంశంగా మారింది.ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాకి సంబందించి మోషన్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదల అవ్వగా అభిమానుల నుండి విశేషమైన ఆదరణ లభించింది

ఇక ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చెయ్యబొయ్యే సినిమా గురించి ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీక్ చేసాడు.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఇటీవలే జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే.ట్విట్టర్ లో ఆయనకీ సెలెబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షల వెళ్లువని కురిపించారు.అయితే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేరు పేరు నా ప్రతి ఒక్క సెలబ్రిటీ కి కృతఙ్ఞతలు తెలియచేసిన సంగతి మన అందరికి తెలిసిందే.ఆలా ఆయన దర్శకుడు మెహర్ రమేష్ కి కూడా కృతఙ్ఞతలు తెలియచేస్తూ ‘నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు రమేష్ గారు.అన్నయ్య తో మీరు చెయ్యబోతున్న సినిమా ఘానా విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను ‘ అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.దీనితో చిరంజీవి మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఒక్క మూవీ వస్తున్నట్టు అభిమానులకు అర్థం అయిపోయింది

అయితే అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా అజిత్ వేదలమ్ సినిమాని రీమేక్ చెయ్యబోతున్నట్టు సమాచారం.అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానేర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.