చిరంజీవి గారి కోసం దిగొచ్చిన ఫైట్ మాస్టర్లు.. ఆ ఫైట్ కి నంది అవార్డు

సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి రేజ్ లో వున్న చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి , ఖైదీ న౦ 150 చేసి ఆయన ఏ మాత్రం తగ్గలేదని అందరికీ అర్దమయ్యేలా నిరూపించారు. ఆచార్య సినిమా లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఆచార్య పొస్టర్ కి మంచి రేస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు చిరంజీవి గారిని చూసి , ఇప్పుడు వున్న యంగ్ హీరోలతో పోటీ గా ఏ మాత్రం తగ్గకుండా తన సత్తా చాటారు మెగాస్టార్ గారు.

మెగాస్టార్ సినిమా ఆచార్య లో రం చరణ్ నటించడం అనేది మొరక ఆసక్తికరమైన విషయం అని చెప్పవచ్చు. తండ్రి కొడుకులను కలిపి ఒకే స్క్రీన్ పై చూడడం అనేది అభిమనులలో నూతన ఉత్సాహం నెలకొలపుతుంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం.కొరటాల శివ కూడా చిరు రేంజ్ కి తగ్గటూ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ప్రతిస్టత్మకం గా ఆచార్య సినిమాని నిర్మిస్తున్నారు. చిరంజీవి గారి ని అదిరిపోయేలా చూపించబోతున్నారని సమాచాఈ సినిమాలో విజయశాంతి నటించబోతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పూర్తి కాగానే చితరంజీవి గారు తమిళ మూవీ వేధాలం రీమేక్ చేయపోతున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మెగాస్టార్ చెక్ చేసుకున్న గుండు లుక్ ఫోటో కూడా ఫాన్స్ అందరికీ నచ్చేసింది. అది వేధాలం సినిమాకోసమే అని అందరికీ అర్దమయింది. ఎందుకంటే వేధాలం తమిళ మూవీ లో అజిత్ సగం గుండు తో కనిపిస్తారు ఆ సినిమాలో , చిరంజీవి గారు కూడా ఇధి ఎలా సెట్ అవుతుందో అని చూసుకున్నారనే వార్తలు కూడా రాకపోలేదు.

ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ మనకు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. ఇధి ఫుల్ డ్రామా, యాక్షన్ మూవీ కాబట్టి దీనికి అంతర్జాతీయ స్తానం లో వున్న కొరియోగ్రాఫర్స్ ని తీసుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం కె. జి. యఫ్ మూవీలో ఫైట్ మాస్టర్స్ గా పని చేసిన జాతీయ అవార్డు అందుకున్న “అన్ను అరవేల్ “ లు ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ గా పని చేయబోతున్నారట. ఇటీవల హైదరాబాద్ కి వచ్చిన ఈ ఫైట్ మాస్టర్స్ చిరంజీవి గారిని కూడా కలిశారని పబ్లిక్ టాక్ నడుస్తుంది. పైగా చిరంజీవి గారి నాటనకి ఇటువంటి ఫైట్ మాస్టర్స్ కూడా కలిస్తే సినిమా ఏ రేంజ్ లో వుంటుందో ఊహించుకుంటుoటేనే గూస్ బుంప్స్ వచ్చేలా ఫైట్స్ వుండడం పక్క అని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా కి ఎలా పని చేస్తుందో కె. జి. యఫ్ లాంటి సినిమాలో ఫైట్ మాస్టర్స్ అయిన వీళ్ళు చిరు సినిమాకి ఎలా చేయబోతున్నారో అని.