తమ్ముడు నాగబాబు కి జన్మదిన శుభాకాంక్షలు …

నాగ బాబు గారి పూర్తీ పేరు కొణిదెల నాగేంద్ర బాబు, మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు అని ఎంతో గర్వం గా చెప్తారు, అన్న అంతే చాలా ప్రేమ గా ఉంటారు. చిరంజీవి గారికి చెప్పకుండా ఏది చేయరు . ఫిలిం ఇండస్ట్రీ లో యాక్టర్ ,ప్రొడ్యూసర్, కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, అతను ప్రధానంగా సహాయక పాత్రలు మరియు విలన్ పాత్రలలో నటించాడు..

నాగబాబు గారు తెలుగు,తమిళ, కన్నడ భాషలో నటించారు.100 సినిమా ల పైగా నటించారు,చిరంజీవి గారితో రాక్షసుడు,కొండవీటి దొంగ, అల్లరోడు హబ్బా, అందరు దొంగలే దొరికితే ,మనసు మాట వినడు, అమ్మ చెప్పింది. చందమామ సినిమాలో కాజల్ తండ్రి పాత్రలో బాగా గుర్తింపు వచ్చింది ఆ సినిమా మంచి హిట్ అయింది సెంటిమెంటల్ సీన్స్ తో బాగా యాక్ట్ చేసారు.

మైఖేల్ మదానా కామరాజు, ఆకాశ రమణ,దూకుడు, ఒక్కడినే,బ్రూస్ లీ ,ది ఫైటర్ ,ఖైదీ no 150 .143, అంజీ, షాక్, శ్రీ రామదాసు ,ఆరంజ్ సినిమా ప్లాప్ అవ్వడం వాళ్ళ బాగా నష్టం రావడం ఆర్థిక సమస్యలు లో పడ్డారు.సినిమాలో కన్న జబర్దస్త్ షో లో జడ్జి గా చేసారు,వీర,అదుర్స్ ,జీ తెలుగు లో అదిరింది షో లో చేసారు.

అంజనా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణుల తో కలిసి పలు సినిమాలు నిర్మించారు.నాగేంద్ర గారి భార్య పద్మజ కొణిదెల వారికీ ఇద్దరు పిల్లలు, నటుడు వరుణ్ తేజ్ ,నిహారికా ప్రస్తుతం ఇద్దరు టాప్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ పేరు సంపాదించారు వరుణ్ తేజ్ హిట్స్ తో ముందుకి వెళ్తున్నారు, ప్రస్తుతం నిహారిక పెళ్లి సందడి లో ఉన్నారు,మెగా ఫామిలీ లో మరో పెళ్ళికి సిద్ధం గా ఉన్నారు.

టీవీ సీరియల్స్ లో కనిపిస్తాడు మరియు ఈటీవీ లో ప్రసారమైన జబర్దాస్త్ అనే కామెడీ షోలో న్యాయమూర్తి గా వర్క్ చేసారు కొన్ని కారణాల వాళ్ళ డ్రాప్ అయ్యారు. నాగ బాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు మరియు M.P. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో నరసపురం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి.నాగబాబు గారికి ఇటీవలే కోవిడ్ రావడం నివారణ అయ్యాక ,కోవిడ్ పేషెంట్స్ కి ప్లాస్మా డొనేట్ చేసారు,బ్లడ్ డొనేషన్స్,మంచి పనులు చేస్తూ మెగా ఫామిలీ లో గొప్ప పేరు సంపాదించారు.