మెగా స్టార్ చిరంజీవి ఈ లాక్ డౌన్ సమయం లో ఫామిలీ తో స్పెండ్ చేస్తూ సజావుగా సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లో తాను వరసగా స్క్రిప్టులు వింటూ దర్శకులని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. చిరు రీమిక్స్ మూవీస్ పై ఎక్కువ ఆశక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
మొదట ” సాహూ ” డైరెక్టర్ సుజిత్, మళయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయినా ” లిసిఫెర్ ” రీమిక్స్ మూవీ రూపొందించారు. కానీ అతని స్క్రీన్ ప్లే చిరంజీవి ని ఆకటుకోలేదు. ఆ తరవాత మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ తో సంప్రదింపులు అయ్యాయి అని ప్రచారమైంది. ఇంతకుముందు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150 ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా మలిచిన ఘనత వినాయక్ సొంతం. పక్కా కమర్షియల్ అంశాలతో వినాయక్ ఆ మూవీని పెద్ద సక్సెస్ చేసి చూపించారు.
అందువల్ల వి వి వినాయక్ కి లూసిఫెర్ రీమిక్స్ బాధ్యత ఇచ్చారు. అయితే మలయాళ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ లో కమర్షియల్ చిత్రం అద్దేందుకు వినయ్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారట. అక్కడ మోహన్ లాల్ కి హీరోయిన్ లేకపోయినా తెలుగు వెర్షన్ లో చిరుకి ఒక అందమైన కథానాయికను అలాగే పాటలు కూడా జోడిస్తున్నారట. ఇక మెగాభిమానులు అన్నయ్య నుంచి ఆశించే అన్ని అంశాల్ని ఏర్చి కూర్చేందుకు వినాయక్ ప్రిపేరవుతున్నారట.
దీంతో ఈ ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతోంది. ఈలోగానే చిరు మరో రీమేక్ పైనా దృష్టి పెట్టారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటించేందుకు చిరు ప్రిపేరవుతున్నారట. అంటే వినాయక్ రేసులో వెనక్కి వెళితే మెహర్ ముందుకొచ్చారన్నది తాజా గుసగుస. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సుందట. మరి అప్పటికి వినాయక్ స్క్రిప్ట్ వందశాతం రెడీ అవుతుందా లేదా? అన్నది సస్పెన్స్.