Daaku Maharaaj Review డాకు మహారాజ్ రివ్యూ : పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్
సినిమా పేరు : డాకు మహారాజ్ (Daaku Maharaaj)
రేటింగ్ : 3.5 / 5
తారాగణం : బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్, బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాధ్, సచిన్ ఖేడేకర్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి
సంగీతం : ఎస్ థమన్
ఫోటోగ్రఫి : విజయ్ కార్తీక్ కన్నన్
నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకుడు : బాబీ (కొల్లు రవీంద్ర)
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల వరుసగా కెరీర్ పరంగా విజయాలతో మంచి జోష్ మీద ఉన్నారు. అంతకముందు బోయపాటి శ్రీను తీసిన అఖండ మూవీతో 2021 డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన బాలకృష్ణ, ఆ తరువాత గోపీచంద్ మలినేని తీసిన వీరసింహా రెడ్డితో మరొక విజయం అందుకున్నారు.
ఇక ఇటీవల సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరితో ఆయన మరొక విజయం అందుకున్నారు. ఆ విధంగా కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ తాజగా యువ దర్శకుడు బాబీతో చేసిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీలో బాలకృష్ణకి జోడీగా ప్రగ్య జైస్వాల్ నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ నటించారు.
ఇటీవల డాకు మహారాజ్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ 2025 సంక్రాంతి పండుగ కానుకగా డాకు మహారాజ్ మూవీ జనవరి 12న గ్రాండ్ గా పలు థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.
Daaku Maharaaj Review Telugu
కథ :
వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ అయిన సీతారాం అనుకోకుండా ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజల యొక్క కీలక సమస్య తీర్చే సమయంలో ఎదుడైన కొన్ని సంఘటనల కారణంగా ఎలా మారాడు, ఏమి జరిగింది. అతడి జీవితంలో మరికొన్ని సంఘటనలకు అది ఎలా దారి తీసింది. అలానే అక్కడి అక్రమ తవ్వకాలని అడ్డుకుని చివరికి ప్రజలకు ఏవిధంగా మంచి చేసాడు అనేది ఈ మూవీ యొక్క ప్రధాన కథ
నటీనటుల పెరఫార్మన్స్ :
ముఖ్యంగా ఈ మూవీకి ప్రధాన బలం నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్. మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన పరకాయ ప్రవేశం చేసారు అని చెప్పాలి. మారె ముఖ్యంగా డాకు మహారాజ్ పాత్రలో ఆయన యాక్టింగ్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. దర్శకుడు బాబీ కూడా మూవీని చక్కగా తెరకెక్కించారు. ఇక ఆయనతో పాటు నటించిన ప్రగ్య జైస్వాల్ పాత్ర బాగుంది, ఆమె నటన కూడా ఆకట్టుకుంది.
అలానే ఊర్వశి రౌటేలా పాత్ర చిన్నదే అయినా అలరించింది. ఇక ఇటీవల ఆనిమల్ మూవీ ద్వారా ఇండియన్ ఆడియన్స్ కి ఎంతో చేరువైన బాబీ డియోల్ ఈమూవీలో బల్వంత్ సింగ్ గా అదరగొట్టారు. కీలకమైన వైష్ణవి పాత్రలో నటించిన పాప కూడా ఆకట్టుకుంది. బాలకృష్ణ కి ఆ పాపకి మధ్య వచ్చే సన్నివేశాలు మనసుని తాకుతాయి. ఇక శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర సినిమాలో కీలకం, ఆమె కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేసారు. చివరిగా సచిన్ ఖేడేకర్, సందీప్ రాజ్, రవికిషన్, సత్య ల పాత్రలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్,
మాస్ యాక్షన్ సీన్స్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
గ్రాండియర్ విజువల్స్,
ఎమోషనల్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ,
ఊహించదగిన సీన్స్
Daaku Maharaaj Review Rating
విశ్లేషణ :
ముఖ్యంగా డాకు మహారాజ్ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన ఎంచుకున్న కథ పాతదే ఆయినా కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా నడిపారు. తరువాత రాబోయే సీన్ ఇలా ఉంటుంది అని ఊహించినప్పటికీ దానిని మనల్ని కట్టిపడేసేలా ఆయన తీశారు. ఇక నందమూరి బాలకృష్ణ మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా అదరగొట్టారు.
ఇక ఈ సినిమాలో మరొక హీరోగా థమన్ ని చెప్పవచ్చు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ లో థమన్ కొట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్ మొత్తాన్ని షేక్ చేయడం తో పాటు థియేటర్ లో విజిల్స్ వేయిస్తుంది. ఆ విధంగా థమన్ మ్యూజిక్, బాలకృష్ణ యాక్టింగ్, బాబీ టేకింగ్ ఈ మూవీ యొక్క సక్సెస్ కి ప్రధాన కారణాలు. ఇక విజయ్ కార్తీక్ విజువల్స్ ఎంతో గ్రాండియర్ గా ఉన్నాయి.
కొన్ని సీన్స్ ఎంతైతే గూస్ బంప్స్ తెప్పిస్తాయో, అదే విధంగా మరికొన్ని సీన్స్ హృద్యంగా మనసుని తాకుతాయి. నిర్మాతల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా డాకు మహారాజ్ నిజంగా విన్నింగ్ మహారాజ్ అని చెప్పాలి. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
తీర్పు :
ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా పలు థియేటర్స్ లో ఫ్యాన్స్ ఆడియన్స్ ముందుకి వచ్చిన డాకు మహారాజ్ మూవీ అన్నివర్గాల ఆడియన్స్ ని అలరించి మంచి పండుగ శోభని అందిస్తుందని చెప్పవచ్చు. బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, దర్శకుడు బాబీ టేకింగ్ తో పాటు సూపర్ గా ఉండే విజువల్స్, రాక్ స్టార్ థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సంక్రాంతి పండుగకి ఎంచక్కా ఈ ఇంటిల్లిపాది కలిసి డాకు మహారాజ్ మూవీని ఈ సమీప థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి