టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న దీపికా పాడుకొనే … హీరో ఎవరో తెలుసా?

కరోన కి అందరూ భయపడుతున్న వైజయంతీ మూవీస్ మాత్రం కేర్ చేయడం లేదు. పరిస్తితులు బాగోలేదు , బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన ఇసుమింతైనా లేదు. మామూలు రోజుల్లో కర్చు పెట్టే దానికంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఒక్క హీరోయిన్ కి మన స్టార్స్ కి ధీటుగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఈ లెక్కన బడ్జెట్ ఎ రేంజ్ లో వుంటుందో ఊహించుకోవచ్చు. సి . అశ్వినీదత్ నిర్మించే సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు ?

ప్రతిస్టాత్మక సంస్త వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భం గా నాగ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా ఒక భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. అల్లుడు నాగ అశ్విన్ చెప్పిన కథ నచ్చడం తో అశ్వినీదత్ నో బడ్జెట్ మూవీ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ మూవీ తో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడాని దర్శకుడు గతం లో చెప్పాడు. ఈ పాన్ వరల్డ్ బడ్జెట్ 200 లా కోట్ల లేక 400 కోట్లా అని నిర్మాత కూడా చెప్పలేక పోతున్నాడు. బడ్జెట్ ఎంతైనా అనవసరం వైజయంతీ మూవీస్ లో ఈ సినిమా చిరస్తాయి గా నిలిపోతుందన్న నమ్మకం తో నిర్మాత వున్నారు.

పాన్ వరల్డ్ కాన్సెప్ట్ కి తగ్గట్టుగానే హీరోఇన్ ను ఎంపిక చేశారు. దీపికా పదుకొనే ప్రభాస్ తో జంట కడుతున్నట్లు గా వైజయంతీ మూవీస్ అనౌన్స్ చేసింది. సినిమాకి 15 కోట్లు తీసుకునే దీపికా ఈ సినిమాకి పరితోషకం బదులు హిందీ రైట్స్ లో షేర్ తీసుకుంటుందట . పరితోషకం లో డిమాండ్ చేసే దీపికా ఈ సినిమా విషయం లో షేర్ తీసుకొని రెమ్యూనరేషన్కంటే డబల్ సంపాదిస్తుందట. కరోన టైమ్ లో కాలిగా కూర్చున్నoదుకు గండి పడ్డ ఆదాయాన్ని కూడా ఈ తెలుగు సినిమాతో రాబడుతుందన్నమాట . బాహుబలి 2 బాలి వుడ్ లో 500 కోట్లు పైగా వసూలు చేయడం తో సాహో హిందీ వెర్షన్ ని 100 కోట్లు కి అమ్మారు. సినిమా అన్నీ భాషలలొ ప్లాప్ అయిన హిందీ లో మాత్రం పెట్టుబడిని రాబట్టింది. ప్రభాస్ కు బాలి వుడ్ లో వున్న క్రేజ్ ని చిసిన దీపికా ప్రభాస్ , నాగ అశ్విన్ మూవీ కి పరితోషకం తీసుకోకుండా హిందీ రైట్స్ లో షేర్ అడుగుతుంది. ఇండస్ట్రి లోనే కాదు బాలి వుడ్ లో కూడా ఏ హీరోయిన్ తీసుకొని రెమ్యూనరేషన్ దీపికా సొంతమయినట్లే.

కథ పై ఎంత నమ్మకం వున్న శక్తి ని మించి కర్చు పెట్టడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తారు. నాగ అశ్విన్ , ప్రభాస్ మూవీ వైజయంతీ మూవీస్ కి లాండ్ మార్క్ గా నిలిచిపోతుందన్న నమ్మకం తో వున్నాడు నిర్మాత. ఇంకా నటి నటుల ఎంపిక కావలసి వుంది. దీపికా తో పాటు బాలి వుడ్ కి చెందిన చాలామంది నటి నటులు ఈ సైంటిఫిక్ మూవీ లో నటించే అవకాశం వున్నది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాదే శ్యామ్ పూర్తి కాగానే ఈ క్రేజీ ప్రాజెక్టు మొదలవుతుంది.