Devara Collection Worldwide టాలీవుడ్ స్టార్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సోలో మూవీ వచ్చి దాదాపుగా ఆరేళ్ళయింది. అంతకముందు 2022 మార్చిలో తన స్నేహితుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు ఎన్టీఆర్.
అతిపెద్ద సంచలన విజయం అందుకున్న ఆ భారీ పాన్ ఇండియన్ మూవీలో కొమురం భీం గా ఎన్టీఆర్ నటించగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించారు. ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో అద్బుతముగా నటించారు. ముఖ్యంగా జక్కన్న రాజమౌళి RRR మూవీని తెరకెక్కించిన తీరు అద్భుతం.
ఆ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ పవర్ఫుల్ గా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని భారతీయ సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచింది. ఇక ఆరేళ్ళ అనంతరం తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేసిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1.
Devara Collection Worldwide Closing
ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అజయ్, శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ఇక ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసారు. దేవర, వర రెండు పాత్రల్లో కూడా ఎన్టీఆర్ సహజ నటన కు అందరి నుండి గొప్పగా ప్రసంశలు కురిసాయి.
రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన దేవర పార్ట్ 1 మూవీకి రత్నవేలు ఫోటోగ్రఫి అందించగా ప్రముఖ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా అత్యధిక వ్యయంతో నిర్మించాయి. ముఖ్యంగా దేవర మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో కూడా అద్భుతంగా కలెక్షన్ రాబట్టింది.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు అర్ధరాత్రి దేవర పార్ట్ 1 ప్రీమియర్స్ ప్రదర్శించగా మంచి టాక్ అయితే లభించింది. అనంతరం ఫస్ట్ షో, మ్యాట్నీ, ఈవెనింగ్ షో అనంతరం దేవర కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుండి కూడా మంచి టాక్ లభించింది.
Devara Collection Worldwide Total
ఆకట్టుకునే కథ, కథనాలతో తన మార్క్ స్టైల్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించిన అన్ని కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించి అందరి మెప్పు సొంతం చేసుకున్నారు. ఇక దేవర లో ఎన్టీఆర్ సూపర్ పెరఫార్మసి తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ ఆకట్టుకునే అందం, అభినయం, అనిరుద్ అందించిన సాంగ్స్ తో పాటు పలు కీలక యాక్షన్ సన్నివేశాల్లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతి పెద్ద బలం అని చెప్పకతప్పదు.
ఆ తరువాత ఫోటోగ్రాఫర్ రత్నవేలు కథ యొక్క గమనానికి తగ్గట్టుగా తెరకెక్కించిన విజువల్స్ మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దేవర మూవీలో హృద్యమైన కథ, యాక్షన్ బ్లాక్స్, ఫైట్స్, ఎమోషన్స్, వంటివి అందరినీ ఎంతో అలరించాయి. ఇక దేవర మూవీ ఓపెనింగ్ డే నుండే అన్ని ఏరియాల్లో భారీ స్థాయి కలెక్షన్ నమోదు చేసింది. ముఖ్యంగా రూ. 350 కోట్ల భారీ వ్యయంతో నిర్మితం అయిన దేవర పార్ట్ 1 మూవీ గడచిన మొత్తం 34 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 477 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.
Devara Collection Worldwide Total
ఒకరకంగా ఇది అతి పెద్ద నంబర్ అని చెప్పాలి. వాస్తవానికి పర్మిషన్స్ కారణాల రీత్యా దేవర మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ ముందు క్యాన్సిల్ అయిన విషయం తెల్సిందే. కాగా ఆ ఈవెంట్ కోసం సంగీత దర్శకుడు అనిరుద్ అండ్ టీమ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు పలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అయితే ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అనిరుద్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.
ముఖ్యంగా ఆ ఈవెంట్ కనుక జరిగి ఉంటె దేవరకు నార్త్ తో పాటు పలు ఇతర భాషల్లో కూడా మరింత బజ్ క్రియేట్ అయి అది ఖచ్చితంగా ఓపెనింగ్స్ మరియు కలెక్షన్స్ కు హెల్ప్ అయ్యేది. ఇక మ్యాటర్ లోకి వెళితే దేవర పార్ట్ 1 మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 112.55 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ. 182.55 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
Devara Collection Worldwide
దానితో ఈ మూవీ యొక్క బ్రేకివెన్ రూ. 190 కోట్లు టార్గెట్ కాగా, గ్రాస్ పరంగా రూ. 400 కోట్లు రాబట్టాల్సిన టార్గెట్ ఏర్పడింది. అయితే రిలీజ్ అనంతరం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 477 కోట్లు రాబట్టి షేర్ పరంగా రూ. 266 కోట్లు సొంతం చేసుకుంది. అంటే ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం దేవర పార్ట్ 1 మూవీ రూ. 83 కోట్ల మేర లాభాలను నిర్మాతలకు అందించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దేవర కు ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి విపరీతమైన క్రేజ్ లభిచింది. ఏ బి సి అని తేడా లేకుండా దాదాపుగా అనేక ఏరియాల్లో దేవర బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగింది. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ లో ఈ మూవీ అతి పెద్ద సెన్సేషన్ సృష్టించి ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేసింది.
దేవర పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ కలెక్షన్ (షేర్) డీటెయిల్స్ :-
నైజాం – రూ. 67.82 కోట్లు
సీడెడ్ – రూ. 34.71 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 19.50 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ. 12.69 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 9.52 కోట్లు
గుంటూరు – రూ. 14.65 కోట్లు
కృష్ణా – రూ. 10. 32 కోట్లు
నెల్లూరు – రూ. 7.97 కోట్లు
ఈ ప్రకారం చూసుకుంటే దేవర పార్ట్ 1 మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 177 కోట్ల షేర్ ని రూ. 252 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.
దేవర పార్ట్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ (షేర్) డీటెయిల్స్ :-
తెలుగు రాష్ట్రాలు – రూ. 177 కోట్లు
కర్ణాటక – రూ. 18.20 కోట్లు
తమిళనాడు – రూ. 4.16 కోట్లు
కేరళ – రూ. 97 లక్షలు
హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 34.53 కోట్లు
ఓవర్సీస్ – రూ. 36.11 కోట్లు
టోటల్ – రూ. 266 కోట్ల షేర్ ( రూ. 477 కోట్లు గ్రాస్)