పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

ఒక్కపుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్ పేరు ఎక్కువగా కనిపిస్తుండేది 3 ఏళ్ల కిందట వరకు కూడా వరస సినిమాలతో బిజీ గా ఉన్నారు.. ఇపుడు మాత్రం అయిన టైటిల్స్ కూడా కనిపించుటలేదు.. పర్సనల్ గా ప్రొఫెషనల్ గా పొలిటికల్ గా 3 చోట్ల కూడా ఈయన చాలా దెబ్బతిన్నాడు.. ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంకా అలానే సినిమా అవకాశాలు కూడా రాలేదు ఆయనకి ఇంకా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి పై కొన్ని ఆసక్తిగల వాక్యాలు చేసారు.. ఎన్నికలో సమయం మెగా ఫ్యామిలీ ని బాగానే టార్గెట్ చేసారు పృద్వి రాజ్ అంటే కాదు జనసేనకు నాగబాబు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి మాకు తెలుసు అంటూ అప్పట్లో పృద్వి రాజ్ చేసిన వ్యాఖ్యలు గురించి చాలా హాట్ టాపిక్ గా మారింది…

పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా దారుణం గానే టార్గెట్ చేసారు, ఈ దెబ్బకు తగ్గి ఈయనకి మెగా కుటుంబానికి ఎలాంటి శ్రతుత్వం లేదని చెప్పారు కూడా ఇపుడు మరోసారి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసారు పృద్వి రాజ్.. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని అయిన కు విమర్శించే స్థాయికి తనకు లేదని చెప్తున్నారు,తాను ఇండస్ట్రీ కి రావడానికి కారణమే మెగాస్టార్ మీద ఉన్న ఆసక్తి అని చెప్పారు.. మెగాస్టార్ గారిని రోల్ మోడల్ గా తీసుకుని ఇండస్ట్రీ కి వచ్చారని ఇపుడు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్తున్నారు.. అన్నయ్య ఏ తనకి అన్ని అంటుంటారు అలంటి కుటుంబాన్ని తాను ఎప్పుడు విమర్శించాను అని అన్నాడు..

ప్రిద్వి రాజ్ ఇప్పటికే 100 సినిమాలో పైగా నటించాడు, ఖడ్గం సినిమాలో ” 30 ఇయర్స్ ఇండస్ట్రీ ” అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది,ఆ ఒకటి అడక్కు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా క్యారెక్టర్స్ లో నటించాడు.. పెద్ద హీరోలతో పెద్ద సినిమాలో చిరంజీవి గారి సైరా సినిమాలో కూడా నటించాడు ఎక్కువగా కమెడియన్ గా, జర్నలిస్ట్ గా మినిస్టర్ గా వివిధ పాత్రలో లో నటించాడు కామెడీ తో బాగా పండించేవాడు అలా సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా బిజీ గా ఉండేవారు.. పృద్విరాజ్ తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న ఎస్వీబిసి ఛానల్ చైర్మన్ గా 2020 వరకు పని చేసారు కానీ కొన్ని కారణాల వల్ల రాజీనామా చేసారు …

రాజకీయాల్లో వంద మాటలు అంటాము కానీ సినిమా పరంగా మెగా ఫ్యామిలీ తనకు చాలా సహాయపడింది అన్నారు , వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఒక పార్టీ పదవి అనుభవించాను కాబ్బటి విమర్శలు చేయాల్సి వచ్చింది.. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి తనకి ఎలాంటి వివేదాలు లేవని చెప్పారు.. ఇపుడు ఉన్నటుంది పృద్వి రాజ్ ఇలా మాట్లాడటం పై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందరు మెగా కుటుంబంతో గొడవలు పెట్టుకోడం తో ఈయనకి సినిమా అవకాశాలు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు కొన్ని సినిమాలో మంచి పత్రాలు పడిన కూడా దర్శక, నిర్మాతలు తొలిగించిన్నటు తెలుస్తుంది అందుకే తన జాగ్రత్త కోసం మెగా కుటుంబాన్ని ఆసారిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి ..