చత్రపతి చంద్రశేఖర్ భార్య స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

సినిమా పరిశ్రమ లో ఒక్క అవకాశం కోసం తమ టాలెంట్ నిరూపించుకోడం కోసం రోజు కి 100 ల మంది సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుట ఉంటారు ఎక్కడో వందలో లేక వేళలో ఒక్కరికి ఇలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి, ఎక్కువ గా ఫామిలీ సపోర్ట్ తో వచ్చిన వాళ్లు చాలా మంది సినిమా పరిశ్రమలో అంచల అంచలిగా ఎదిగిన వాళ్లు ఉంటె ఏ సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలో పైకి వచ్చినవారు అతి కొద్దీ మంది అనే చెప్పచు సినిమా రంగం లో ఛాన్స్ లు వెతుక్కోడం ద్వారా చాలా మంది నటి నటులు టెక్నిషన్స్ కి కొందరు పరిచయం అవుతూ ఉంటారు.ఏ ఒక్కరు సక్సెస్ అయిన కూడా మరొకరు ఆ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేలా చేయడం సినిమా రంగం లో సర్వ సాధారణం.

ముఖ్యం గా ఒక మిత్రుడు మంచి పోసిషన్ లో ఉంటె సినిమా పరిశ్రమలో కచ్చితంగా మిగిలిన మిత్రలకు ఒక మంచి ట్రాక్ ని అయితే ఇవ్వడం జరుగుతుంది, అదే తరహా లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తన మొదట కెరీర్ నుంచి పరిచయం ఉన్న చంద్ర శేఖర్ అనే నటుడు మిత్రుడిగా ఉన్న వంటి వ్యక్తి కి జక్కన లైఫ్ ఇచ్చారని చెప్పాలి చాలా వరకు ప్రతి సినిమాలో రాజమౌళి చంద్ర శేఖర్ లో ఉన్న టాలెంట్ ని బాగా వాడేవారు ముఖ్యం గా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన చంద్ర శేఖర్ చేత ఎమోషనల్ సీన్స్ చెప్పించారు రాజమౌళి,చంద్ర శేఖర్ చేసిన సినిమాలు సై, రంగస్థలం, ఛత్రపతి, విక్రమార్కుడు,ఈగ, మగధీర ,యూ టర్న్, విశ్వాసం, ఢీ, మర్యాద రామన్న ఇంకా చాలా పెద్ద సినిమాలో నటించారు.

రాజమౌళి సినిమాలో చంద్ర శేఖర్ తప్పకుండ ఉంటాడు ఆ మార్క్ అనేది ఏర్పడిపోయింది. టాలీవుడ్ లో టాక్ కూడా ఉండిపోయింది, అయితే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మిక చిత్రాల్లో అతను కనిపించకపోవడం నిజంగా షాక్ అనే చెప్పాలి అయితే చంద్ర శేఖర్ కి క్యారెక్టర్ ఇచ్చారు 20 రోజుల వరకు షూటింగ్ కూడా ఉంటుందని డేట్స్ కూడా ఫిక్స్ చేసారు కానీ షూటింగ్ సమయం దగ్గర పడ్తున్నపుడు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కాల్ రాకపోడం తో చంద్ర శేఖర్ రాజమౌళి ఆఫీస్ కి వెళ్ళాడు విష్యం ఏంటి అని అడిగితే రాజమౌళి సమాధానం ఇస్తూ ఎందుకో ఆ ఎపిసోడ్ కథ కి అడ్డం పడినట్టు అనిపిస్తుంది అని ఏదో విద్ధంగా నిన్ను పెట్టి తీయచ్చు కానీ అంతగా బాగుండక పోవచ్చు అలా చూపివడం ఇష్టం లేదు అని చెప్పారు ముందు ఇన్ఫోర్మ్ చేయాల్సింది అని వెళ్లిపోయారు.ఈ విష్యం పై రీసెంట్ గా ఇంటర్వ్యూ లో కూడా చంద్ర శేఖర్ చెప్పారు.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా చంద్ర శేఖర్ ఇప్పటికి కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి గారి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు కేవలం వెండి తెరపై మాత్రమే పరిచయం ఉన్న చంద్ర శేఖర్ వ్యక్తి గత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చంద్ర శేఖర్ సినీ కెరీర్ రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ no.1 సినిమా ద్వారా మొదలైంది అసలు ఆశ్చర్యకరమైన విష్యం ఏంటి అంటే దర్శకుడిగా రాజమౌళి కి అదే తొలి సినిమా అలాగే చంద్ర శేఖర్ కి కూడా అదే తొలి సినిమా ఈ సినిమా తరువుత చంద్ర శేఖర్ రాజమౌళి తీసిన ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రలో ఎక్కువగా పోషించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించారు.

చంద్ర శేఖర్ భార్య మన తెలుగు సినిమా రంగంలో పెద్ద నటి ఆవిడా పేరు నీలియా భవాని ఆమె టాలీవుడ్ లో కిక్ 2, సైర నరసింహ రెడ్డి ,జెంటిల్ మన్, పండగ చేస్కో వంటి ఎన్నో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ,టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో మంచి క్యారెక్టర్ లో ఆర్టిస్ట్ గా నటించింది ప్రస్తుతం బుల్లి తేరా సీరియల్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా మోడలింగ్ గా మంచి నైపుణ్యం సంపాదించుకుంది, ఖమ్మం జిల్లా లో పుట్టి పెరిగిన నీలియా మరియు చంద్ర శేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ల ఇద్దరు ప్రేమ లో ఉన్న సమయానికి చంద్ర శేఖర్ సినిమాలో అడుగు పెట్టలేదు ఆ సమయానికి ఎలాంటి ఉద్యోగం కూడా లేదు హైదరాబాద్ వచ్చి రాజమౌళి ఈటీవీ లో తెరకు ఎక్కిస్తున్న శాంతి నివాసం సీరియల్ లో ఒక చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది.

చంద్ర శేఖర్,నీలియా భవాని దాంపత్య జీవితం లో కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ విడాకులు వరకు దారి తీసింది వీళ్ల ఇద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం నీలియా దగ్గర ఏ ఉంటున్నారు కూతురు పూజిత అపోలో మెడికల్ కాలేజీ మెడిసిన్ చేస్తుంది,కొడుకు మహేశ్వరం క్రికెటర్ గా స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వీలు అయినంత త్వరగా వీళ్ల ఇద్దరు కలవాలని అందరం కోరుకుందాం.