నిహారిక పెళ్లి కోసం వేళ్ళబోయే టాలీవుడ్ సెలబ్రిటీ లు ఎవరో తెలుసా ?

నిహారిక కొణిదెల మరో రెండు రోజులో జరగబోతుంది, ఇప్పటికే కుటుంబ సభ్యులు అందరు ఉదయపూర్ కి వెళ్లి సందడి చేస్తున్నారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తప్ప మిగితా కుటుంబ సభ్యులు వాళ్ల అందరు ఉదయపూర్ లోనే ఉన్నారు, చిరంజీవి గారు ఈ రోజు సాయంత్రం డైరెక్ట్ గా ఉదయపూర్ కి చేరుకుంటారట మరో వైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు వెళ్లారు అలానే రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులతో స్టార్ట్ అయ్యారు, ముఖ్యం గా సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్,రాజమౌళి ని నాగబాబు గారు రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

చిరంజీవి గారు పెద్ద నాన్న గా నిహారిక పెళ్లి బాధ్యతులు తన మీద వేసుకున్నారు చిరంజీవి గారు ప్రస్తుతం కోవిడ్ నిబంధనకు కారణం గా కొంతమంది కి మాత్రమే ఆహ్వాన పత్రిక అందించారు,సీనియర్ హీరో లు అయిన బాల్లయ్య, వెంకటేష్, నాగార్జున వారికీ చిరంజీవి గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి తన సోదరుడు కూతురు పెళ్ళికి రావాలని ఆహ్వానించారు మరో వైపు వరుణ్ తేజ్ ,రామ్ చరణ్, రానా , నితిన్ , నాగ చైతన్య, సమంత దంపతులు తో పాటు రష్మిక మందన్న ,పూజ హెగ్డే దర్శకుడు కొరటాల శివ,సీనియర్ కోందండ రామ రెడ్డి, రాఘవేంద్ర రావు గారు, అర్.కే మీడియా,మైత్రి మూవీ మేకర్స్ పాటు అనిల్ సుంకర దాన్నయా, దిల్ రాజు ,సురేష్ ని ఆహ్వానించారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ని కూడా ఆహ్వానించారు.

మెగా కుటుంబం లో అందరికి చిన్న పిల్లల అల్లరి తో సందడి చేస్తూ ఉండేది, ఇంకా వరుణ్ తేజ్ కూడా దాదాపు నెల రోజుల నుండి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి దెగ్గర ఉంది పెళ్లి పనులు చుస్కుంటున్నారు అన్ని ఖర్చులతో సహా వరుణ చూసుకుంటాడు అని తెలుస్తుంది ఇంకా మరి కొద్దీ గంటలో నిహారిక మరో ఇంటికి కోడలిగా అడుగు పెట్టబోతోంది నాగబాబు ఎంతో భావోద్వేగ కి లోనవుతున్నారు, నాగబాబు కి కుమార్తె అంతే చాలా ఇష్టం నిహారిక పుట్టిన తరువాత నాగబాబు కి సినిమాలో బాగా కలిసి వచ్చింది తాను నిర్మాతగా కూడా నిహారిక వచ్చాక బాగా లాభాలే వచ్చాయి నష్టాలు రాలేదని నిహారిక ఇంటి మహా లక్ష్మి అని అనేక సార్లు తెలియ చేసారు.

నిహారికకు పెళ్లి కుమార్తె గా రెడీ చేసాక తన అన్న వదినాలతో తీసిన ఫొటోస్ లు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. ఒక కుటుంబంగా మేము నీకు మూలాలు అందించాము..నీకు ఎగరడానికి కావాల్సిన ‘రెక్కలు’ తండ్రిగా నేను ఇచ్చాను .. ఆ ‘రెక్కలు’ నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి అలానే ఆ మూలాలు ఎప్పుడు నిన్ను సంరక్షిస్తూ ఉంటాయి నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే 2 ఉత్తమ బహుమతి. లవ్ యు నిహారిక అని నాగబాబు పోస్ట్ పెట్టారు.

నిహారిక ని పెళ్లి కూతురుగా రెడీ చేసి పసుపు కొడుతూ అలా తన తల్లి గారు కట్టిన నిశ్చితార్థం చీరని నిహారిక కట్టుకుని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు,అలానే అందరు కలిసి ఫ్లైట్ లో వెళ్తూ చైతన్య తో పాటు దిగిన ఫొటోస్ మరియు ఫామిలీ మెంబెర్స్ తో దిగిన ఫొటోస్ అన్ని షేర్ చేస్తూ హాల్ చల్ చేస్తున్నారు మెగా ఫామిలీ అలా పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ అన్ని ఇపుడు వైరల్ అవుతున్నాయి.