చిరంజీవి కోసం రామ్ చరణ్ ఎంత పెద్ద రిస్క్ చేయబోతున్నాడో తెలుసా?

ఈ కాలంలో కొడుకుల కోసం కోట్లు ఖర్చు పెడుతూ సినిమా లు తీస్తున్న తండ్రులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక్క హీరో మాత్రం తన తండ్రి సినిమా కోసం తన సినిమా సైతం పక్కన పెట్టి మరి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు, అయన ఎవరో కాదు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

మెగా స్టార్ వారసత్వం పంచుకున్న రామ్ చరణ్, తండ్రికి తగ్గ తనయుడు గా తన రెండో సినిమా అయినా మగధీర లోనే నీరుపించేసాడు అంతే కాకుండా మెగా స్టార్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా తన కొడుకు వున్నాడు అని నిరూపించాడు మన మెగా ధీరుడు రామ్ చరణ్ తేజ్.

ఇక విషానికి వస్తే ఖైదీ నే. 150 ఆడియో ఫంక్షన్ వేదిక లో ఇక చిరంజీవి గారు నటించే అన్ని సినిమా లకి నేనే నిర్మాణం చేస్తా అని రామ్ చరణ్ తేజ్ చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట తప్పకుండ మొత్తం బాధ్యతలు రామ్ చరణ్ ఏ మోస్తున్నాడు.

ఆచార్య సినిమా లో తన తండ్రి పక్కన నటించబోతున్నాడు రామ్ చరణ్ తర్వాత రెండు సినిమా లు కూడా సిద్ధం చేసేసాడు రామ్ చరణ్ . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ చెయ్యబోయే పాత్రా 30 నిముషాలు ఉంటుంది. ఈ పాత్రా కోసం రామ్ చరణ్ చాల రిస్క్ తీసుకుంటున్నాడు అని వార్తలు వచ్చాయి.రామ్ చరణ్ ఈ సినిమా కోసం బరువు పెరగాల్సి ఉంటుంది. అటు ఆర్ ఆర్ ఆర్ కోసం రామ్ చరణ్ బాడీ ని మైంటైన్ చెయ్యాల్సి వుంది. ఇప్పుడు రామ్ చరణ్ బరువు పెరిగితే తగ్గడానికి చాల కష్టం అవుతుంది దీనికి రాజమౌళి మొదట ఒప్పుకోలేదు అంట, తర్వాత ఒప్పుకున్నాడు అంట.

శివ కొరటాల తీస్తున్న ఆచార్య సినిమా లో ఒక ఫైట్ సీన్ లో చిరంజీవి రామ్ చరణ్ కలసి చెయ్యబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి దానికోసం చరణ్ బరువు పెరగాల్సి ఉంది అని దర్శకుడు సూచించారు ఇప్పుడు అదే పని లో వున్నాడట రామ్ చరణ్. బరువు పెరడం తగ్గడం అంటే చాల కష్టం ఎందుకంటె ఆర్ ఆర్ ఆర్ కోసం మల్లి బరువు తాగాల్సి వస్తుంది. దీని కోసం రామ్ చరణ్ చాల రిస్క్ తీసుకుంటున్నాడు. చిరంజీవి గారు మొదట దీనికి ఒప్పుకోలేదు అంట అయితే రామ్ చరణ్ పట్టు వదలని విక్రమార్కుడిలా చిరంజీవి గారిని ఒపించాడు అంట.ఇలా తండ్రి కోసం రామ్ చరణ్ చాల రిస్క్ తీసుకుంటున్నాడు.ఇలాంటి కొడుకు దొరకటం చిరంజీవి కి అదృష్టం అని చెప్పుకోవచ్చు.